
తిరువనంతపురం: కేరళలో నిపా వైరస్ వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి ప్రాణాలు విడిచిన నర్సు లినీ పుత్తుస్సెరి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు కేరళసర్కారు ముందుకొచ్చింది. లినీ భర్త సజీష్ విద్యార్హత ఆధారంగా అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే లినీ ఇద్దరు పిల్లలకు (5 ఏళ్లు, 2 ఏళ్లు) సీఎం సహాయక నిధి నుంచి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నిపా కారణంగా మృతిచెందిన వారికి రూ.5 లక్షల సాయం అందించనుంది. ప్రమాదకర నిపా వైరస్ వ్యాప్తితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రానికి వచ్చే సందర్శకులు కొజికోడ్, మలప్పురం, వాయనాడ్, కన్నూర్ జిల్లాలకు వెళ్లవద్దని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment