మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్ | Financial Assistance To Four Through Ap Cm Relief Fund | Sakshi
Sakshi News home page

మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్

Published Thu, Mar 14 2024 8:08 PM | Last Updated on Thu, Mar 14 2024 9:36 PM

Financial Assistance To Four Through Ap Cm Relief Fund - Sakshi

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలుగురికి ఆర్థిక సహాయం

సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. బీకాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా.. సీఎం  వెంటనే స్పందించారు.

పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. హరిజన గోరంట్లకు అందజేశారు.

బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని.. నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా.. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్‌కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.

అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్  తాను 6 సంవత్సరాల నుంచి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, సహాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి  వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.

బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని.. నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి  వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్‌కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రీయింబర్స్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement