
కోజికోడ్‌లో ముసా పార్థివదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది ఖననంచేస్తున్న దృశ్యం
కోజికోడ్: కేరళను వణికిస్తోన్న ‘నిపా’ వైరస్‌తో గురువారం మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనతో రాష్ట్రంలో నిపాతో చనిపోయినవారి సంఖ్య 11కు చేరుకుంది. ఈ విషయమై కోజికోడ్ జిల్లా వైద్యాధికారి డా.జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఇక్కడి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వి.ముసా(61) గురువారం చనిపోయినట్లు తెలిపారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) నిపుణులు, ఎయిమ్స్ వైద్యుల బృందం కేరళలో పర్యటిస్తోంది. మరోవైపు, కర్ణాటకలో నిపా లక్షణాలతో శివమొగ్గ జిల్లాలోని సాగర ప్రాంతానికి చెందిన మిదున్(21) ఆస్పత్రిలో చేరారు.