కేరళలో నిపా వైరస్ కలకలంతో ఒక్కసారిగా యావత్తు రాష్ట్రం ఉలిక్కిపడింది. వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా ఆరోగ్య కేంద్రాలను అలర్ట్ చేసింది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా బారిన పడ్డాడు. పూణే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్థారించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా తెలిపారు. ప్రస్తుతం అతను ఒక ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అతన్ని అక్కడ నుంచి కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తారని అన్నారు.
అతన్ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. హైరిస్క్ కాంటాక్ట్‌లు ఇప్పటికే వేరుచేసి నమునాలను పరీక్ష కోసం పంపినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం చిన్నారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్ల పేర్కొన్నారు వైద్యులు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యలు రాష్ట్రమంతటా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సమీప ఆస్పత్రులన్నింటిలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజలు మాస్క్ ధరించాలని, రోగులు ఆస్పత్రులను సందర్శించే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు.
అంతకుమునుపు ఆస్ట్రేలియా నుంచి సేకరించి పూణే ఎన్‌ఐవీలో నిల్వ ఉంచిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఆదివారం రాష్ట్రానికి చేరుకుంటుందని అన్నారు. ఆ బాధిత చిన్నారి పాండిక్కాడ్ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు కేరళ అధికారులు. అంతేగాదు ఆయా సమీప ప్రాంతాల్లోని ప్రజలు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే సమీప మంజేరి వైద్య కళాశాలలో ఆరోగ్య శాఖ 30 ఐసోలేషన్ గదులు, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసింది. అంతేగాక నిపా వైరస్ సోకిన బాలుడితో పరిచయం ఉన్నవారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. పైగా అంటువ్యాధి నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేసేలా ఆరోగ్య కేంద్రాలను కూడా ఆదేశించారు అధికారులు.
నిపా వైరస్ లక్షణాలు..
తీవ్రమైన తలనొప్పి
అలసట
వాంతులు
బలహీనత
మూర్ఛ,
చూపు మందగించడంతో పాటు జ్వరం
ఈ వ్యాధి శరీర ద్రవాల ద్వారా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు..
సాధ్యమైనంత వరకు చేతులను వీలైనన్ని సార్లు కడుక్కోవాలి. వ్యాధిగ్రస్తులను సందర్శించటం, అంటువ్యాధులు ప్రబలే ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలి. పక్షులు లేదా జంతువులు సగం తిన్న లేదా కరిచిన పండ్లను తినకూడదు. అలాగే పండ్లను సరిగ్గా కడిగితినాలి. బహిరంగ కంటైనర్లలో నిల్వ ఉంచిన కల్లు వంటి పానీయాలను తీసుకోకూడదు వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్ ఎమ్.ఎల్. నీహారిక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
(చదవండి: వామ్మో..! ఇలా కూడా నిద్రపోతారా?)
Comments
Please login to add a commentAdd a comment