
ప్రస్తుతం ప్రజలంతా నగదు రహిత లావాదేవీలే చేస్తున్నారు. డిటిటల్ పేమెంట్లకు అలవాటుపడ్డారు కూడా. ఇది వరకటిలా నగదు కోసం బ్యాంక్‌ల వద్ద బార్లు తీరాల్సిన పనికూడా లేదు. ఎందుకంటే వీధికో ఏటీఏం ఉండటంతో క్షణాల్లో పనైపోతుంది. ఈ సదుపాయం బస్సు, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ఉంది. కానీ జర్నీ చేస్తున్నప్పుడూ..ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే సమయంలో నగదు పొందాలంటే మాత్రం కష్టమే. ఆయా స్టేషన్‌లలో ఆగితేగానీ సాధ్యం కాదు. అయితే ఆ ఇబ్బంది కూడా లేకుండా జర్నీ టైంలో కూడా ఈజీగా డబ్బుని పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చేసింది. ఆ సౌకర్యాన్ని అందిస్తోంది ఇండియన్ రైల్వే సంస్థ. ఏ రైలులో ప్రారంభించారంటే..
ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (INFRIS)లో భాగంగా ఈ సదుపాయన్ని అందిస్తోంది. రైలు కదులుతున్నప్పుడూ ప్రయాణికులు నగుదు పొందేలా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని పంచవటి ఎక్స్‌ప్రెస్ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇది భారతదేశంలోనే తొలి ఏటీఎం రైలుగా మారింది.
అది ఎలా పనిచేస్తుందనే ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఈ ఏటీఎం నుంచి రైలు కదులుతున్నప్పుడూ నగదు పొందే వెసులుబాటు ఉంది. ఇదంతా ఇండియన్ రైల్వేస్ భూసావల్ డివిజన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో విజయవంతమైనట్లు రైల్వే అదికారుల తెలిపారు. ఈ సరికొత్త రైల్వే ఏటీఎం జర్నీ అంతటా సజావుగానే పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
అయితే ఇగత్పురి, కసారా ప్రాంతాల మధ్య సొరంగాలు, తగిన నెట్‌వర్క్ అందుబాటులో ఉండదు కాబట్టి ఆప్రాంతాల్లో నగదు పొందడం కాస్త సమస్యాత్మకంగా ఉండొచ్చని అన్నారు. అలాగే యంత్రం పనితీరును పర్యవేక్షిస్తూనే ఉంటామని అన్నారు భుసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పాండే. తాము ఈ ఆలోచనను INFRIS సమావేశంలో ప్రతిపాదించామని అన్నారు.
ఆ తర్వాత అదెలా కార్యరూపంలోకి తీసుకురావాలనే దానిపై తమ బృందం పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏటీఎం పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని 22 కోచ్‌ల ప్రయాణికులకు మాత్రమే కాదు ముంబై-హింగోలి జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు కూడా అందుబాటులో ఉంటుందట. ఎందుకంటే ఈ రైలు ఒక బోగిని పంచవటి ఎక్సప్రెస్ పంచుకుంటుందట.
అలాగే ఈ ఏటీఎం భద్రతను నిర్థారించేలా ప్రత్యేక షట్టర్ సిస్టమ్ తోపాటు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ తదితరాలు ఉంటాయన్నారు. అయితే ప్రయాణికులు ఈ సేవను ఆదరిస్తే గనుక త్వరలో మరిన్ని రైళ్లకు దీన్ని విస్తరించే అవకాశం ఉంటుందని రైల్వే అదికారులు వెల్లడించారు.
(చదవండి: టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్‌గా పైలట్ అనౌన్స్‌మెంట్)