
డాక్టర్ కఫీల్ ఖాన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, తిరువనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న అరుదైన వైరస్ నిపాను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం తగిన నివారణ చర్యలను ముమ్మరం చేసింది. వైరస్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించేందుకు దేశ వ్యాప్తంగా స్పెషలిస్ట్ వైద్యులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆహ్వానించారు. నిపా వైరస్ బాధితులకు చికిత్స చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డాక్టర్ కఫీల్ ఖాన్ తెలిపారు. ఆయన కేరళ వెళ్లనున్నారు. కాగా ప్రమాదకర నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.
వైరస్ గోవా, ముంబై రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతుందన్న వార్తల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ‘అమాయకులైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నాకు అవకాశం ఇవ్వండి’ అంటూ కఫీల్ ఖాన్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీనికి స్పందించిన విజయన్ నిపా బాధితులకు ఉచితంగా వైద్యం చేసేందుకు కేరళ వస్తున్న డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ధన్యవాదాలు అంటూ పోస్టు చేశారు.
కాగా గత ఏడాది ఆగస్ట్‌లో గోరఖ్‌పూర్‌ని బీఆర్‌డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలో కఫీల్‌ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసింది. కఫీల్‌ఖాన్ ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
గోరఖ్‌పూర్ వదిలి వెళ్లను
‘నిపా వైరస్‌తో కేరళలో ఒక నర్సుతో సహా పదిమంది మరణించారని తెలుకున్నా. ఎలాగైనా వారికి సహాయం చేయాలని కేరళ వెళ్లాలి అనుకున్నా. యూపీ ప్రభుత్వం నా సస్పెన్షన్ ఇంకా రద్దు చేయలేదు. ఇటీవల ఆసుపత్రిని సంప్రదించాను. గోరఖ్‌పూర్‌ను వదిలి ఎక్కడికి వెళ్లను త్వరలోనే అక్కడికి వెళ్తా’ అని కఫీల్ ఖాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment