ప్రతీకాత్మక చిత్రం
బొబ్బిలి : పర్యావరణంలో దేశానికే తలమానికం అంటూ ఇటీవల ఉన్నతాధికారుల నుం చి ఢిల్లీలో అవార్డునందుకున్న బొబ్బిలి మున్సి పాలిటీ నడిబొడ్డున గబ్బిలాల చెట్టు ఆ అవా ర్డుకే ప్రశ్నార్థకంగా మారింది. బొబ్బిలి సీహెచ్‌సీ వద్ద ఉన్న పెద్ద మర్రి చెట్టుపై పెద్ద సం ఖ్యలో గబ్బిలాలు తిష్టవేసి ఉన్నాయి.
దశాబ్దా ల కాలం నుంచి ఈ చెట్టు ఇక్కడే ఉన్నా... ఇటీవల గబ్బిలాల కారణంగా నిఫా వైరస్ సోకుతుందన్న దుమారం రేగడంతో ఇక్కడివారిలో ఆందోళన మొదలైంది. చెట్టు నిండా పెద్ద సం ఖ్యలో పగలూ రాత్రి అన్న తేడా లేకుండా వేల సంఖ్యలో గబ్బిలాలు వేలాడుతునే ఉంటా యి.
నిఫా వైరస్ తో దేశంలోని వివిధ ప్రాం తాల్లో పెద్ద ఎత్తున ప్రజలు మరణించిన విష యం దావానలంలా వ్యాపించడంతో ఇప్పు డు అందరి దృష్టి ఈ గబ్బిలాల చెట్టుపై పడిం ది. ఈ ఆస్పత్రికి నిత్యం 250 నుంచి 300కు పైగా ఓపీ రోగులు వస్తున్నారు.
ఇవి గాకుండా 40 వరకూ ఇన్‌పేషెంట్లు విభాగానికి వస్తుం టారు. పక్కనే గబ్బిలా ల చెట్టు ఉండటంతో వా టి వ్యర్థాలు పడుతుంటాయి. అంతేగాదు. ఆస్పత్రి 50పడకలుగా విస్తరింపజేసి.. అదనపు భవనాలు నిర్మించనున్న నేపథ్యంలో ఈ చెట్టుపై ఉన్న గబ్బిలాలనుంచి వైరస్ సోకేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment