
రియాద్ : ప్రాణాంతక నిపా వైరస్ వ్యాప్తిపై భయాందోళనల నేపథ్యంలో కేరళ నుంచి ప్రాసెస్డ్ పండ్లు, కూరగాయల దిగుమతుపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. నిపా వైరస్ కారణంగా మెదడులో ప్రమాదకర వాపుతో పాటు తీవ్ర జ్వరం, దగ్గు, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం తలెత్తుతాయని గల్ఫ్ న్యూస్ పేర్కొంది. మే 29న కేరళ నుంచి దిగుమతులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స నిషేధించింది.
కేరళ నుంచి దిగుమతికి సిద్ధమైన వంద టన్నుల పండ్లు, కూరగాయలు, తాజా ఉత్పత్తులను దేశంలోకి ప్రవేశించేందుకు నిరాకరించామని యూఏఈ అధికారులు పేర్కొన్నారు. కాగా నిపా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మందులతో కూడిన విమానాన్ని యూఏఈ సంస్థ వీపీఎస్ హెల్త్‌కేర్ కేరళకు తరలించింది. కేరళలో నిపా వైరస్‌తో బాధపడే 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16 మంది మరణించారు. మిగిలిన ఇద్దరు కోజికోడ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మరో 2000 మంది అనుమానిత కేసులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment