అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత మళ్లీ 12 ఏండ్లకు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో ఈసారి రోహిత్ సేన కప్ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ కప్ నేపథ్యంలో బీసీసీఐ కూడా పక్కా ప్రణాళికతో ఉంది. భారీగా లాభాలను ఆర్జించాలని చూస్తోంది.
వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం వచ్చింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ లో కాశ్మీర్ విల్లో(Kashmir Willow Bats) క్రికెట్ బ్యాట్లను ఎక్కువగా ఉపయోగించాలని బీసీసీఐ అనుకుంటుంది. కాగా క్రికెట్‌లో ఇప్పటికైతే ఇంగ్లీష్ విల్లో , కశ్మీర్ విల్లో బ్యాట్లను వాడుతున్నారు.
వీటిలో ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్(English Willow Bats)కు ఎక్కువగా క్రేజ్ ఉంది. ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి దేశాలు.. ఈ ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించడం ఇదే తొలిసారి.
దీనికి ఒక కారణం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచ కప్(T20 World Cup)లో మెుదటిసారిగా కశ్మీర్ విల్లో బ్యాట్ ను ఉపయోగించిన బ్యాటర్.. టి20 ప్రపంచ్ కప్ లో అత్యంత లాంగ్ సిక్స్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది.
ఇక మరో కారణం ఏంటంటే కాశ్మీర్ విల్లో బ్యాట్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో పోలిస్తే.. చౌకగా ఉంటాయి. అలాగే ఈ బ్యాట్స్ నాణ్యత కూడా బాగా ఉంటుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ధర ఉంటుంది. అదే ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ చూసుకుంటే.. రూ.లక్ష వరకూ ఉంటాయి. దీంతో నాణ్యతతో తక్కువ ధరకు వచ్చే.. కశ్మీర్ విల్లో బ్యాట్లపై ఆటగాళ్లు దృష్టి పెడుతున్నారు.
బ్యాట్ల తయారీతో కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా, చార్సూ, సేతార్ సంగం, హల్ములా, సంగం, పుజ్‌టెంగ్, మిర్జాపూర్, సేతార్ గ్రామాలు, పంజాబ్‌లోని జలంధర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Heega Kashmir willow Hx 509 cricket bat (Grade 2) is manufactured using selected Kashmir willow and is hand-crafted with utmost precision. The bat is suitable for leather balls.https://t.co/Xzxz6ys3JS#englishwillowbat #kashmirwillowbat #heegasports pic.twitter.com/Vqo7kgGaEs
— Heega Sports (@HeegaSports) May 20, 2023
చదవండి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా
13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్‌లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు
Comments
Please login to add a commentAdd a comment