Rohit Sharma Says-Very Competitive-ODI-WC-2023 After-Schedule Released - Sakshi
Sakshi News home page

#RohitSharma: 'పోటీ తీవ్రంగా ఉంది.. అంత సులభం కాదు; కష్టపడతాం'

Published Tue, Jun 27 2023 5:32 PM | Last Updated on Tue, Jun 27 2023 6:34 PM

Rohit Sharma Says-Very Competitive-ODI-WC-2023 After-Schedule Released - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ రానే వచ్చింది. ఇవాళ(జూన్‌ 27) ఐసీసీ ఉదయం వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌, వేదికలు, మ్యాచ్‌ వివరాలు, టైమింగ్స్‌ను విడుదల చేసింది. పుష్కరకాలం తర్వాత మన దేశం వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 2011లో ధోని సేన చేసిన మ్యాజిక్‌ను ఈసారి రోహిత్‌ సేన రిపీట్‌ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

స్వదేశంలో వరల్డ్‌కప్‌ జరుగుతుండడంతో టీమిండియా పెవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికి.. ఇటీవలీ కాలంలో మన జట్టు ఇస్తున్న ప్రదర్శన చూస్తే కాస్త కలవరం ఉందనే చెప్పొచ్చు. కానీ స్వదేశంలో మనల్ని ఓడించాలంటే ఏ జట్టుకైనా కష్టమే. కాగా వరల​్‌కప్‌  షెడ్యూల్‌ విడుదల చేయడంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు.

''టి20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వన్డే క్రికెట్‌లో కూడా వేగం పెరిగింది. అందుకే ఈ వరల్డ్ కప్‌లో కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. వరల్డ్‌కప్‌ కొట్డడం అంత సులభం కాదు. శక్తి మేరకు కష్టపడతాం. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో మ్యాచ్‌లు ఆడనుండడంతో అన్ని జట్లపై ఒత్తడి ఉంటుంది. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో మాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో  బాగా తెలుసు.

2011ను రిపీట్‌ చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలని అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి వరల్డ్ కప్‌కు ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి.అక్టోబర్-నవంబర్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. బెస్ట్ ఇవ్వాలి. అప్పుడే వరల్డ్ కప్ నెరవేరుతుంది. ముంబైలో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అంటూ  రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

రౌండ్ రాబిన్ ఫార్మాట్
ఈసారి వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనుంది. అంటే టోర్నీ ఓ టీమ్.. ప్రతి ఇతర టీమ్ తో తలపడాల్సి ఉంటుంది. మొత్తంగా 45 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో ఆరు మ్యాచ్ లు మాత్రమే డే మ్యాచ్ లు. ఇవి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇతర మ్యాచ్ లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. లీగ్ నుంచి టాప్ 4 టీమ్స్ సెమీస్ చేరతాయి. నవంబర్ 15న ముంబైలో, నవంబర్ 16న కోల్‌కతాలో రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.

కళ్లన్నీ ఆ మ్యాచ్‌పైనే..
ఇక వరల్డ్ కప్ లో భాగంగా దాయాది పాకిస్థాన్ తో అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా తలపడనుంది. 1992 నుంచి 2019 వరకు మొత్తం ఏడుసార్లు ఇండియా, పాకిస్థాన్‌లు వన్డే వరల్డ్‌కప్‌లో తలపడ్డాయి.అన్ని సందర్భాల్లోనూ టీమిండియానే విజేతగా నిలవడం విశేషం.

చదవండి: వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల.. జైషాపై ట్రోల్స్‌, మీమ్స్‌

'అప్పుడు సచిన్‌ కోసం.. ఇప్పుడు కోహ్లి కోసం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement