
లక్నో: మహమ్మారి కరోనా పుట్టుకకు గబ్బిలాలకు సంబంధం ఉందని భావిస్తున్న నేపథ్యంలో... గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసిన ఓ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గోరఖ్‌పూర్‌లోని బేల్‌గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చచ్చిపడిన ఘటన మంగళవారం ఉదయం బయటపడింది. కరోనా వైరస్ కారణంగా అవి చనిపోయి ఉండొచ్చని స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెటర్నరీ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం అందించారు.
ఎండ తీవ్రతతోనే గబ్బిలాలు చనిపోయానని వెటర్నరీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉత్తర భారతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దాంతో చెరువు కుంటలు ఎండిపోయానని తెలిపారు. నీటికి కటకట రావడంతోనే అవి ప్రాణాలు విడిచాయని చెప్పారు. స్థానికంగా ఉండే ప్రజలు పాత్రల్లో వాటికి నీరు ఏర్పాటు చేయాలని కోరారు. మృత గబ్బిలాలను ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ పంపించామని, వాటి మృతికి గల కచ్చితమైన వివరాలు వెల్లడవుతాయని డివిజనల్ ఫారెస్ట్ హెడ్ అవినాష్ కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment