Gorakhpur
-
వీధి కుక్క స్వైర విహారం.. గంటలో 17 మందిపై దాడి
ఉత్తరప్రదేశ్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారిని కనిపించినట్లే మీద పడి గాయపరిచింది. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా కేవలం గంట వ్యవధిలోనే కంట పడిన 17 మందిపై దాడి చేసింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో మహిళతోపాటు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని షాపూర్లో ఆగష్టు 14న జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.ఇందులో 22 ఏళ్ల విద్యార్ధి ఆశిష్ యాదవ్.. ఆవాస్ వికాస్ కాలనీలోని తన ఇంటి ముందు నిలబడి ఫోన్లో మాట్లాడుతుండగా వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. ఇంటి ముందు వెళ్తున్న కుక్క.. అకస్మాత్తుగా యువకుడి వైపుకు పరుగెత్తుకొచ్చి కరిచింది. అయితే దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆ కుక్క ఎంతకు తగ్గలేదు.అతడిపైకి ఎగురుతూ, మరింత వేగంగా కరిచేందుకు యత్నించింది. ఆశిష్ కిందపడిపోవడంతో అతని కాలుపై, ముఖంపై గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడిలో అతని ముఖం, నోరు, కళ్లు, పెదవులు దెబ్బతిన్నాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రేబిస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పారని ఆశిష్ తండ్రి విజయ్ యాదవ్ తెలిపారు. కుక్కల దాడిపై నగరపాలక సంస్థకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు.ఈ ఘటన తరువాత కుక్కు ఇంటి గేటు వద్ద నిలబడిన మరో మహిళపై దాడి చేసింది. ఆమె మోకాలి, కాలుపై కరిచి వెళ్లిపోయింది. దీంతో మహిళ మోకాలిపై లోతైన గాయమవ్వగా కుట్లు పడ్డాయి. దీని తర్వాత ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు బాలికలపై కుక్క దాడి చేసింది. ఇలా ఆ పిచ్చి కుక్క దాదాపు 17 మందిని గాయపరిచింది.దీనిపై గోరఖ్‌పూర్ అదనపు మున్సిపల్ కమీషనర్ దుర్గేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ కోసం నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నామని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేయడంతోపాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
వరల్డ్ క్లాస్ లుక్‌లో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ త్వరలో వరల్డ్ క్లాస్ లుక్‌లో కనిపించనుంది. ఈ రైల్వే స్టేషన్‌ను రూ.498 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్లో పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నామని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు, రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బడ్జెట్ హోటల్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు చూసేందుకు, షాపింగ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలేటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది ప్రత్యేక తరహా ఎస్కలేటర్. దానిపై నిలబడి నడవకుండానే ఒక చోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులతో సహా ప్రయాణికులంతా ట్రావెలేటర్ను వినియోగించుకోవచ్చు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. 2023 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
Lok Sabha Election 2024: గోరఖ్‌పూర్‌లో స్టార్ వార్!
ఉత్తరప్రదేశ్‌లో శనివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో గోరఖ్‌పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ శుక్లా, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఇద్దరూ భోజ్‌పురి స్టార్లే కావడం అందుకు కారణం... రవికిషన్‌కు పీఠం మద్దతు... భోజ్‌పురి సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శుక్లా. కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జౌన్పూర్ నుంచి పోటీ చేసి ఓడారు. 2017లో బీజేపీలో చేరారు. 2019లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కనిపించనే లేదనే విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు ఆయనను ‘బయటి వ్యక్తి’గా అభివర్ణిస్తున్నాయి. దాంతో పీఎం మోదీ, సీఎం యోగి చరిష్మానే నమ్ముకున్నారు. గోరఖ్‌పూర్‌లో తనకు ఇల్లుందని, ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొస్తున్నారు. యువకులతో కుస్తీ పడుతూ, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం జోరుగా చేశారు. రవి కిషన్‌కు గోరక్షనాథ్ పీఠం మద్దతు కూడా ఉంది. నిషాద్ ఓట్లను నమ్ముకున్న కాజల్ భోజ్‌పురి నటి, ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్కు ఇది నాలుగో ఎన్నిక. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై, కాంపియర్గంజ్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడారు. మేయర్ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే ఆమెకు ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. తన సామాజికవర్గమైన నిషాద్ ఓట్లనే నమ్ముకున్నారు. అయితే 2019 మాదిరిగా ఈసారి కూడా ఎస్పీ ఓట్లను బీఎస్పీ గట్టిగానే చీల్చేలా కని్పస్తోంది. 1990ల నుంచి బీజేపీ హవా.. గోరఖ్‌పూర్ స్థానంలో 1984 దాకా కాంగ్రెస్‌దే హవా. రామమందిర ఉద్యమ నేపథ్యంలో 1989 నుంచీ గోరక్షనాథ్ పీఠం ఆధిపత్యం మొదలైంది. అప్పటినుంచి 1996 దాకా వరుసగా మూడుసార్లు గోరక్షనాథ్ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ ఇక్కడినుంచి గెలిచారు. 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు ప్రస్తుత పీఠాధిపతి యోగి గెలిచారు. సీఎం అయ్యాక ఆయన రాజీనామాతో 2018లో జరిగిన ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా ఎస్పీ నేత ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాను ఓడించారు. కానీ ఈ ఆధిపత్యాన్ని ఎస్పీ నిలబెట్టుకోలేకపోయింది. కుల సమీకరణాలదే కీలకపాత్ర..గోరఖ్‌పూర్‌లో అగ్రవర్ణ ఓట్లు 6 లక్షలున్నాయి. 9 లక్షల ఓబీసీ, 4 లక్షల నిషాద్, 2 లక్షలకు పైగా యాదవ ఓట్లున్నాయి. 2.5 లక్షల దళిత ఓట్లు, 2 లక్షల ముస్లిం ఓట్లూ తనకేనని కాజల్ చెబుతున్నారు. నిషాద్లూ తన వెంటే ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా నిషాద్‌ల ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం స్వస్థలంలో హీరో- హీరోయిన్ పోరు
లోక్‌సభకు చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో వారణాసి, గోరఖ్‌పూర్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. గోరఖ్‌పూర్ అంటే గీతా ప్రెస్ ఉన్న నగరం. ఈ ప్రాంతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనూ కీలకంగా నిలిచింది. ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం. ఇక్కడ ఈసారి బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీ పార్టీల మధ్యప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో హీరో వర్సెస్ హీరోయిన్ పోరు నెలకొంది. ఇక్కడి నుండి ప్రస్తుత ఎంపీ, నటుడు రవి కిషన్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ భోజ్‌పురి నటి కాజల్ నిషాద్కు ఇక్కడి టిక్కెట్ కేటాయించింది. రవి కిషన్ 2019లో ఇక్కడి నుంచి బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు. కాజల్ నిషాద్ 2012లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఎస్పీ టికెట్‌పై అసెంబ్లీ, మేయర్ ఎన్నికల్లో పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు.1990లో యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించి, వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రవి కిషన్ విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఐదుసార్లు ఎంపీని చేసిన ఇక్కడి ఓటర్లు సీఎంపై మరింత నమ్మకం ఉంచారు. అందుకే బీజేపీకి మద్దతుగా నిలుస్తారనే అంచనాలున్నాయి.గోరఖ్‌పూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 20 లక్షల 74 వేలు. ఈ సీటులో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అవన్నీ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 లోక్‌సభ ఉప ఎన్నిక మినహా ప్రతిసారీ సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. -
Lok Sabha Election 2024: యూపీలో ఆఖరి పోరాటం!
ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్‌పూర్ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్... గోరఖ్‌పూర్... భోజ్‌పురీ వార్ సుప్రసిద్ధ గోరఖ్‌నాథ్ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట. ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్‌పురి నటి కాజల్ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.గాజీపూర్.. త్రిముఖ పోరు ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్ సింగ్, బీజేపీ నుంచి పరాస్ నాథ్ రాయ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!వారణాసి... మోదీ హ్యాట్రిక్ గురికాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్‌సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.చందౌలీ... టఫ్ ఫైట్ దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్‌లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాథ్ పాండే ఈసారి హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మీర్జాపూర్... ప్రాంతీయ పారీ్టల హవాఒకప్పుడు బందిపోటు రాణి పూలన్ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్(ఎస్) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.కుషీనగర్... హోరాహోరీగౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్ ఎంపీ విజయ్ కుమర్ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్ ప్రతాప్ సింగ్ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.పోలింగ్ జరిగే మొత్తం స్థానాలు...మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్‌గావ్ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్ (ఎస్సీ)– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు! ఆయన పేరు రాజన్ యాదవ్. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. గమ్మత్తైన హామీలు రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్‌టైం ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! – గోరఖ్‌పూర్ -
త్వరలో తొలి స్లీపర్ వందేభారత్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
దేశంలోని తొలి స్లీపర్ వందేభారత్ త్వరలో పట్టాలపై పరుగులు తీయనుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్- న్యూఢిల్లీ మధ్య స్లీపర్ వందే భారత్‌ను నడపడానికి ఈశాన్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇండియన్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జైపూర్‌లో సమావేశం కానుంది. దీనిలో ఈ రైలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. కొత్త రైళ్లను నడపడం, ట్రిప్పులను పెంచడం, రూట్లను మార్చడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈశాన్య రైల్వే రూపొందించిన ప్రతిపాదన ప్రకారం నూతన స్లీపర్ వందేభారత్ రైలు వారానికి మూడు రోజులు నడవనుంది. గోరఖ్‌పూర్ నుంచి రాత్రి వేళల్లో ఈ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈ రైలు గోరఖ్‌పూర్ నుండి న్యూఢిల్లీకి 12 గంటల్లో చేరుకుంటుంది. ఈ సమావేశంలో ఈ రైలుకు ఆమోదం లభిస్తే 2024, జూలై నుంచి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోరఖ్‌పూర్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు వందే భారత్ రైలు నడుస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. అంటే గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. -
గీతా ప్రెస్‌కు జపాన్ యంత్రం.. ముద్రణ మరింత వేగవంతం!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ గురించి అందరికీ తెలిసిందే. పలు భాషల్లో ఇక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రతమవుతాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గీతా ప్రెస్‌లో పుస్తకాలను వేగంగా ముద్రించేందుకు యంత్రాలను వినియోగిస్తుంటారు. ఇందుకోసం తాజాగా జపాన్ నుంచి కొమోరి యంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ యంత్రం ఏర్పాటుతో గీతా ప్రెస్‌లో మరింత వేగంగా అత్యధిసంఖ్యలో పుస్తకాలను ముద్రించవచ్చు. మరో 10 రోజుల్లో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రంలో పాటు బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్వూండ్ మెషీన్‌ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రం ద్వారా బైండింగ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. జపాన్ నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు వేగంగా చేసే అవకాశం లభిస్తుంది. అలాగే పుస్తకాల కవర్ పేజీలను రంగుల్లో ముద్రించవచ్చు. ఈ యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించవచ్చు. -
‘ఎంపీ రవి కిషన్ భూమిని కబ్జా చేశారు’ : సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ నవ్వులు పూయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీ పార్లమెంట్ స్థానం గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్ తాల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం యోగి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి తన ప్రసంగంతో సభికులతో పాటు ప్రజల్ని నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు సభపై ప్రముఖ నటుడు, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ ఉన్నారు. రవికిషన్ను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడారు. బంగ్లా కబ్జా చేశారంటూ.. భళ్లున నవ్విన ‘ఇంతకుముందు ఓ వీఐపీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భోజ్‌పురి స్టార్ రవికిషన్ ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ బంగ్లాను కబ్జా చేశార'ని భళ్లున నవ్వారు. వెంటనే లేదు.. లేదు.. రవికిషన్ ఆ ఇంటి లాక్కోలేదు. డబ్బుతో కొన్నారు’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ ఏడేళ్ల క్రితం రామ్‌గఢ్ తాల్ దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఇప్పుడు అక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. సెల్ఫీలు దిగుతున్నారు. రవికిషన్ (ఎంపీ సీటును) మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు నగరం మొత్తం కెమెరా నిఘాలో ఉంది. రవికిషన్ సినిమా షూటింగ్ కోసం హడావుడిగా వెళ్లి సిగ్నల్ బ్రేక్ చేస్తే వెంటనే అతని మొబైల్‌కి చలాన్ వెళ్తుందని, అంతలా అభివృద్ది జరిగిందని స్పష్టం చేశారు. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 గోరఖ్‌పూర్ సీటు గెలుస్తా.. చరిత్ర సృష్టిస్తా ఈ నెల ప్రారంభంలో బీజేపీ రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కమలం ప్రకటించిన జాబితాలో గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ రెండోసారి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి–2021ను ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్‌కు ఈ బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలియజేసింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. ఈ బహుమతిని 2020లో బంగ్లాదేశ్‌కు చెందిన బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మన్‌కు ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లో గీతా ప్రెస్‌ను 1923లో స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. 14 భాషల్లో 41.7 కోట్లకుపైగా పుస్తకాలను ప్రచురించింది. వీటిలో 16.21 కోట్ల భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి. గీతా ప్రెస్‌కు అవార్డు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు. -
Sangita Success Story: విజయాన్ని పెట్టెలో పెట్టింది
పిండి కొద్ది రొట్టె ఏమోకాని స్వీటు కొద్ది పెట్టె ఉండాలంటుంది సంగీతా పాండే. స్వీట్ బాక్సులను అందంగా తయారు చేయడం మొదలుపెట్టిన ఈ గోరఖ్‌పూర్ సాధారణ గృహిణి 500 రూపాయల పెట్టుబడితో బయల్దేరి ఆరేళ్లలో 3 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అత్తామామలు, భర్త సహకరించకపోయినా గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పట్టుదలగా విజయం సాధించింది. తనలాంటి 100 మంది స్త్రీలకు ఉపాధి కల్పించడంతో ఆమె పొందుతున్న సంతృప్తి వెల లేనిది. ఆరేడేళ్ల క్రితం. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. మూడవ సంతానంగా కుమార్తె పుట్టాక 9 నెలలు నిండేసరికి ఇక ఇంట్లో ఉంటూ కేవలం అత్తామామల సేవ, వంట వంటి పనులు మాత్రమే చేయకూడదు అనుకుంది సంగీతా పాండే. భర్తకు పోలీసు ఉద్యోగం. బదిలీల మీద తిరుగుతుండేవాడు. ఆర్థికస్థితి అంతంత మాత్రం. తనూ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. భర్త ఒప్పుకోలేదు. అత్తామామలు ఒప్పుకోలేదు. కాని ఎదిరించి తను చదివిన డిగ్రీ అర్హత మీద ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. మొదటిరోజు కూతురితోపాటు హాజరైంది. ఆఫీసువాళ్లు అభ్యంతరం చెప్పడంతో మరుసటి రోజు పాపను ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లింది. మనసు ఒప్పలేదు. పిల్లలను దూరం పెట్టి పని చేసే ఉద్యోగం వద్దు అనుకుని మరుసటి రోజే మానేసింది. కాని ఏదో చేయాలి. ఏం చేయాలి? స్వీట్‌షాపులో డబ్బాలు ఆమె ఒకసారి స్వీట్‌షాపులో స్వీట్స్ కొంటున్నప్పుడు ఎవరో వచ్చి ఖాళీ బాక్సులు స్టాకు పడేసి వెళ్లడం చూసింది. తనక్కూడా అలాంటివి తయారు చేసి అమ్మాలని అనిపించింది. అందుకోసం గోరఖ్‌పూర్‌లో వాటిని తయారు చేస్తున్న ఒకరిద్దరు స్త్రీలను కలిసింది. అయితే వారు ఆమెకు పని గురించి అంతంత మాత్రమే చెప్పారు– పోటీకి వస్తుందని. సంగీతా పాండేకి సృజన ఉంది. కొత్తగా చేసే ఆలోచన ఉంది. అందుకే తానే రంగంలో దిగింది. అప్పటికి తన దగ్గర 1500 ఉన్నాయి. ఓ పాత సైకిలుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ రా మెటీరియల్ కొని తెచ్చింది. 8 గంటల్లో 100 డబ్బాలు తయారు చేసింది. తనే వాటిని సైకిల్ వెనుక కట్టుకుని స్వీట్ షాపులకు అమ్మేందుకు బయలుదేరింది. అవి బాగుండటంతో అమ్ముడుపోయాయి కాని ఇంతకంటే తక్కువకు సరుకు వేస్తున్నారని తెలిసింది. గోరఖ్‌పూర్ రత్న ఇటీవలే ఉత్తరప్రదేశ్ సి.ఎం ఆదిత్యానాథ్ మహిళా అంట్రప్రెన్యూర్‌గా ఎంతో స్ఫూర్తినిస్తున్న సంగీతా పాండేని ‘గోరఖ్‌పూర్ రత్న’ బిరుదుతో సత్కరించాడు. ఇప్పుడు సంగీతా పాండే తయారు చేస్తున్న స్వీట్ బాక్సులు ఢిల్లీ వరకూ వెళుతున్నాయి. స్వీట్లను ఒకదాని మీద ఒకటి కుక్కే విధంగా కాకుండా సంగీతా స్వీట్‌బాక్సులు ఒకదాని పక్కన ఒకటి అంటకుండా అమర్చేలా ఉండటంతో ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయం కోసం కొద్ది స్వీట్లతో ఒక బుట్టను ప్రెజెంట్ చేసేలా కూడా పెట్టెలు తయారు చేస్తోంది. స్వీట్లలోని రకాలను బట్టి ఈ ప్యాకింగ్ బాక్సులు మారిపోతుంటాయి. సృజన, శ్రమ కలిస్తే సక్సెస్ అదే వస్తుందనడానికి మరో ఉదాహరణ సంగీతా పాండే. అసలు కిటుకు రా మెటీరియల్ లక్నో, ఢిల్లీలలో తక్కువకు దొరుకుతుందని, వాటితో కళాత్మకంగా డబ్బాలు తయారు చేసి తక్కువకు ఇవ్వగలిగితే చాలా గిరాకీ ఉంటుందని తెలుసుకుంది సంగీతా పాండే. వెంటనే చురుగ్గా ఉండే నలుగురైదుగురు స్త్రీలను పనిలోకి తీసుకుంది. డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి 2 లక్షలు లోన్ సాధించింది. పనిలోకి దిగింది. కిలో, అరకిలో, పావుకిలో డబ్బాలు మంచి రంగులతో లోపల జలతారు వస్త్రంతో తయారు చేసి గోరఖ్‌పూర్, లక్నోలలో స్టాకు వేయడం మొదలెట్టింది. ‘నాణ్యత విషయంలో ఒక పైసా నష్టం వచ్చినా రాజీ పడకూడదు అనే నియమం పెట్టుకున్నాను’ అంటుంది సంగీతా పాండే. ఆ నాణ్యత, ముస్తాబు వల్ల ఆమె ఖాళీ బాక్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ఆమె నగలు కుదువ పెట్టి మరో 3 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించింది. ఆ తర్వాత బ్యాంకులే వెతుక్కుంటూ వచ్చి 30 లక్షలు లోను మంజూరు చేశాయి. ఒక ఫ్యాక్టరీ ఆవరణ, పని చేసే స్త్రీలు, వీరు కాకుండా ఇళ్ల దగ్గర ఉంటూ పనిచేసే స్త్రీలు వీరంతా ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు. సంగీతా పాండే దూసుకుపోయింది. -
బిడ్డల చెంతకు చేరిన తల్లి
కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్‌స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది. సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్‌పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు. దిశ వన్‌స్టాప్ బృందం ఏఎస్ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది. -
తల్లి మృతదేహాన్ని నాలుగు రోజులు బెడ్ కింద దాచిన కుమారుడు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే బెడ్ కింద దాచాడు. నాలుగు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు ఆ వ్యక్తి ఇంట్లో బెడ్ కింద అతని తల్లి శవాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె నాలుగు రోజుల క్రితమే చనిపోయిందని కుమారుడు పోలీసులకు చెప్పాడు. దుర్వాసన రాకుండా రోజూ అగరొత్తులు వెలిగించినట్లు పేర్కొన్నాడు. మృతురాలిని శాంతి దేవి(82)గా గుర్తించారు. ఆమె విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. కుమారుడు నిఖిల్‌తో పాటు శివ్‌పుర్ సహబాజ్‌గంజ్‌లో నివసిస్తోంది. అయితే నిఖిల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అతను డ్రగ్స్‌కు బానిస కావడంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. శాంతి దేవి అనారోగ్య కారణాలతోనే మరణించి ఉంటుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక నిజా నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
Video: మహిళ చేతివాటం.. అందరి ముందే రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది
లక్నో: ఒక మహిళ బ్లాక్ కళ్లజోడు, మాస్కో ధరించి ఒక జ్యూవెలరీ షాపుకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆ షాపు కూడా కస్టమర్లతో చాలా బిజీగా ఉంది. దీంతో ఆ మహిళ ఇదే అవకాశం అనుకుందో ఏమో గానీ ఆ షాపు అతనితో నెక్లెస్ మోడళ్లను చూపించమంది. దీంతో అతను రకరకాల మోడల్స్‌ను చూపించాడు. ఆమె తెలివిగా ఒక మోడల్ నెక్లెస్‌ని చూస్తున్నట్లుగా పక్కనే ఉన్న మరో నెక్లెస్ బాక్స్‌ని క్లోజ్ చేసి ఆ బాక్స్‌పై తాను చూస్తున్న నగ బాక్స్‌ని పెట్టింది. ఆ తర్వాత షాపు వాడు గమనించడం లేదనుకుని డిసైడ్ అయ్యాక నెమ్మదిగా తన వొడిలో పెట్టుకున్నట్లుగా పెట్టుకుని ఆ క్లోజ్ చేసి ఉన్న నగల బాక్స్‌ని చీర మడతల్లో తెలివిగా దాచింది. ఆ తర్వాత తనకు ఏం నగలు నచ్చలేదున్నట్లుగా కామ్‌గా పైకి లేచి వెళ్లిపోయింది. అక్కడ ఉన్న షాపు అతను ఆమె ఏం కొనక్కుండా ఎందుకలా వెళ్లిపోతుంది అని కూడా అనుమానించ లేదు. ఆమె మాత్రం భలే గమ్మత్తుగా రూ. 10 లక్షలు ఖరీదు చేసే చెవి పోగోలు తోపాటుగా ఉన్న నెక్లెస్ బాక్స్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటన నవంబర్ 17న గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేమండి. (చదవండి: చిన్నారిని గాల్లోకి విసిరే స్టంట్: మండిపడుతున్న నెటిజన్లు) -
కి‘లేడీ’.. చూస్తుండగానే రూ.6.7 లక్షల నెక్లెస్ మాయం
-
చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు: వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జూని సందర్శించి చిరుత పిల్లకు పాలు పట్టించారు. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు. ఇంతలో ఆయన ఒక చిరుత పిల్లకు పాలబాటిల్తో పాలు పట్టించేందుకు దాని ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి యోగికి ఇచ్చారు. ఐతే అది మొదట తాగేందుకు అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆయన వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎట్టకేలకు ఆ చిరుత పిల్లకు పాలు పట్టించగలిగారు. అంతేగాదు ఆ జూలో ఉన్న మిగతా పెద్ద పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ జూని 'షాహిద్ ఆష్పాక్ ఉల్లాల్ ఖాన్ పార్క్' అని కూడా పిలుస్తారు. దీన్ని గతేడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది పుర్వాంచల్ ప్రాంతంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్, అలాగే ఉత్తరప్రదేశ్‌లో మూడవది అని జూ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు) -
ఏకంగా 61 సార్లు ఎన్నికల్లో గెలిచి 106 ఏళ్ల వృద్ధుడిగా గిన్నిస్ రికార్డు
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో కన్హయ్య లాల్ గుప్తా అనే 106 ఏళ్ల వృద్ధుడు ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్యే యూనియన్ నాయకుడిగా రికార్డు సృష్టిచాడు. అతడు యూనియన్ ఎన్నికల్లో ఏకంగా 61 సార్లు గెలిచిన అత్యంత పెద్ద యాక్టివ్ ట్రేడ్ యూనియన్ లీడర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులోకి ఎక్కబోతున్నాడు. గోరఖ్‌పూర్‌కి చెందిన కన్హయ్య లాల్ గుప్తా 1946లో రైల్వేలో చేరిన తర్వాత ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. స్వాతంత్యం వచ్చేంత వరకు 10 ఏళ్లు సైన్యంలో పనిచేశారు. ఆ కొద్దికాలంలోనే ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎన్ఈఆర్ఎంయూ)తో అనుబంధం కలిగి ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో పోటీ చేస్తుండేవాడు. ఆయన 1981లో పదవి విరమణ చేశాడు. అయినప్పటికీ తన సహ రైల్వే యూనియన్ సభ్యులకు ప్రాతినిధ్యం వహించడం ఆపలేదు. అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తాను 1974లో స్వాతంత్య్ర ఉద్యమకారుడు జయప్రకాశ్ నారాయణతో కలిసి పనిచేయడం వల్ల స్ఫూర్తి, నైతిక బలాన్ని పొదినట్లు చెప్పారు. అతను రైల్వేలో అత్యంత పెద్ద వయసు కలిగిన ఫించనుదారుడు. అంతేకాదు అతని కెరీయర్లో కొన్ని ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి. అతను నాలుగుసార్లు పదవి నుంచి తొలగింపబడ్డాడు, ఒక నెల జైలు శిక్ష అనుభవించాడు. కన్హయ్య లాల్‌కి ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయమే నివాసం, అందులోని సభ్యులే తన కుటుంబం అని చెబుతుంటాడు. మీడియా నివేదికల ప్రకారం అతని కార్యాలయం ఏడాది పొడువునా తెరిచే ఉంటుంది. (చదవండి: తల నరికేసే ఊరిలో... రెండు దేశాల బార్డర్) -
భారీ ఆధిక్యంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్
-
యోగి ఆదిత్యనాథ్‌పై మహిళ పోటీ.. ఆమే ఎందుకు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటిసారిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటుగా మహిళా నేత శుభావతి శుక్లాను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దించింది. కాంగ్రెస్ నుంచి చేతనా పాండే, బీఎస్పీ అభ్యర్థిగా ఖ్వాజా శంషుద్దీన్ బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ తరపున యువ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. ఎవరీ శుభావతి? దివంగత బీజేపీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా సతీమణి శుభావతి. ఉపేంద్ర దత్ గుండెపోటుతో 2020లో మరణించారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేశారు. నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు. రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒక లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి గోరఖ్‌పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన 2018 లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఉపేంద్ర దత్ పోటీ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌తో విభేదాల కారణంగానే ఆయన ఓడిపోయారన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. తన భర్త జీవించి ఉన్న సమయంలో శుభావతి రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్‌పూర్‌లోని మరో స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కుమారుడితో కలిసి గత నెలలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. బీజేపీ తమ పట్ల వ్యవహరించిన తీరుపై శుక్లా కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఉపేంద్ర శుక్లా మరణం తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనీసం తమ కుటుంబాన్ని పరామర్శించలేదని వారు వెల్లడించారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన ఉపేంద్ర కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా అవమానించిందని బాధ పడుతున్నారు. (హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ) సానుభూతి పనిచేస్తుందా? సీఎం యోగిపై శుభావతిని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీకి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ బలమైన అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఆమెను ఎంపిక చేయడం విశేషం. ఠాకూర్-బ్రాహ్మణుల ఓటు బ్యాంకును చీల్చి బీజేపీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే శుభావతిని పోటీకి పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె భర్త ఉపేంద్ర శుక్లా గోరఖ్‌పూర్‌లోనే కాకుండా పూర్వాంచల్లోనూ పేరున్న బ్రాహ్మణ నాయకుడు. శుక్లా కుటుంబంపై ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. బీజేపీ తమ కుటుంబానికి చేసిన అన్యాయం గురించే ఎన్నికల ప్రచారంలో శుభావతి, ఆమె కుమారుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆసక్తికర పోటీ చాలా కాలంగా యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యర్థిగా ఉన్న బీఎస్పీ మాజీ నేత హరిశంకర్ తివారీ కుమారుడు గతేడాది డిసెంబర్లో సమాజ్‌వాదీ పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో అంశం. అయితే గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ ఓడిపోని యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం అత్యంత సురక్షితమైందిగా పరిగణించబడుతోంది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మార్చి 3న ఇక్కడ పోలింగ్ జరగనుంది. (క్లిక్: ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు) -
సీఎం యోగిపై పోటీకి రెడీ.. టిక్కెట్ ఇవ్వండి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీకి తాను సిద్ధమని డాక్టర్ కఫీల్ ఖాన్ ప్రకటించారు. ‘గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. ఏ పార్టీ అయినా నాకు టిక్కెట్ ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నాను' అని పీటీఐతో డాక్టర్ ఖాన్ చెప్పారు. (చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు) చర్చలు జరుగుతున్నాయి మీరు ఏదైనా పార్టీతో టచ్‌లో ఉన్నారా, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అని అడిగినప్పుడు.. ‘అవును, సంప్రదింపులు జరుగుతున్నాయి, అన్నీ కుదిరితే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాన’ని సమాధానం ఇచ్చారు. గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో జరిగిన దుర్ఘటనలో తనను బలిపశువు చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. ఇప్పటికీ ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్ పోలీసులు పదే పదే తమ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రెండు సస్పెన్షన్లు.. రెండుసార్లు జైలు గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చోటుచేసుకున్న దుర్ఘటనతో కఫీల్ ఖాన్ జీవితం తలక్రిందులైంది. ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డాక్టర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు జైలు పాలయ్యారు. రెండు పర్యాయాలు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల ఆధారంగా ‘ది గోరఖ్‌పూర్ హాస్పిటల్ ట్రాజెడీ- ఏ డాక్టర్స్ మెమోయిర్ ఆఫ్ ఎ డెడ్లీ మెడికల్ క్రైసిస్' పేరుతో పుస్తకం రాశారు. 5000 కాపీలకు పైగా అమ్ముడవడంతో ఈ బుక్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిందని డాక్టర్ ఖాన్ తెలిపారు. ఇప్పటికీ పోలీసుల వేధింపులు ఆగలేదన్నారు. (చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్..) రౌడీ షీటర్ అంటున్నారు ‘డిసెంబర్ 17, 2021న నా పుస్తకాన్ని లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్ 20న పోలీసులు మా ఇంటికి వచ్చారు. తర్వాత డిసెంబర్ 28న ఒకసారి, మళ్లీ జనవరిలో వచ్చారు. నేను గోరఖ్‌పూర్‌లోని రాజ్‌ఘాట్ పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీటర్ని అని పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిస్టరీ షీటర్లపై కన్నేసి ఉంచామని అంటున్నార’ని డాక్టర్ ఖాన్ వెల్లడించారు. (చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..) నా జీవితం నాశనం చేశారు పాలకులు నిర్లక్ష్యం కారణంగానే గోరఖ్‌పూర్ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఫలితంగా 54 గంటల వ్యవధిలో 80 మంది పసివాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పారు. నిజాలకు పాతర వేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ అయితే ప్రకృతి విపత్తుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆస్పత్రి అథారిటీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు తనను జైలుకు పంపారని, తన సోదరుడిపై దాడికి పాల్పడ్డారని.. కుటుంబ వ్యాపారాన్ని నాశనం చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. తనను జైలు నుంచి విడిపించేందుకు తన తల్లి, భార్య ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తాను రాసిన పుస్తకం చదివితే ప్రస్తుతం మనం ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నామన్న విషయం తెలుస్తుందన్నారు. (చదవండి: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?) -
తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు అనాసక్తి చూపితే.. తొలిసారి ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం కదనరంగంలో తేల్చుకునేందకు సిధ్దమయ్యారు. హిందూ, ధార్మిక భావజాలం ఉండే అయోధ్య లేక మథుర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయనను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగినా బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఆయన్ను తూర్పు యూపీలోని స్వస్థలమైన గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిపింది. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో అక్కడే నుంచే ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నష్ట నివారణచర్యల్లో భాగంగానే.. అయితే యోగిని గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయించడానికి అనేక కారణాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతు న్నాయి. గోరఖ్‌పూర్ తూర్పు యూపీలో ఉంది. తూర్పు యూపీకి చెందిన ఇద్దరు కేబినెట్ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. మౌర్య 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఖుషీనగర్ జిల్లా కేంద్రమైన పద్రౌనా నుంచి గెలుపొందగా, మవూ జిల్లాలో ఉన్న మధుబన్ నుండి దారాసింగ్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరూ స్థానికంగా బలవంతులు. సామాజికవర్గంపై బాగా ప్రభావం చూపుతారు.వీరి రాజీనామాతో పార్టీకి నష్టం కగిలే అవకాశాలున్నాయి. చదవండి: రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి.. గోరఖ్‌పూర్ నుంచి యోగి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఇక్కడ యోగిని నిలపడం ద్వారా సీట్లు తగ్గకుండా చూసుకోవడంతో పాటు, గోరఖ్‌పూర్ పొరుగు జిల్లాలైన బస్తీ, సిద్ధార్థనగర్, ఖుషీనగర్, మహరాజ్‌గంజ్, బలరాంపూర్, సంత్ కబీర్‌నగర్, డియోరియాలలో మద్దతును పెంచుకోవాలన్నది. బీజేపీ వ్యూహంగా ఉంది. అదీగాక యోగి 1998, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో వరుస విజయాలను నమోదు చేసి, గోరఖ్‌పూర్ నుండి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా అ త్యంత ప్రజాదరణ పొందిన గోరఖ్‌నాథ్ మఠానికి అధిపతిగా ఉన్నారు. గోరఖ్‌పూర్ నుండి పోటీ చేయడం ద్వారా, యోగికి యూపీలోని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టడా నికి ఎక్కువ సమయం ఉంటుందని బీజేపీ అంచనా. సీఎం అభ్యర్థులంతా పోటీకి దూరమే యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారపగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు దిగలేదు. శానమండలి సభ్యురాలిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ సైతం పార్లమెంట్‌కు గెలిచినా, 2012లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే బరిలో దిగలేదు. మండలి నుంచి ఎన్నికై సీఎంగా కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చదవండి: Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా ఆయన్ను అసెంబ్లీ బరిలో నిలిపే విషయమై అనేక తర్జనభర్జనలు జరిగాయి. ఒకవేళ పోటీలో నిలిపితే శ్రీకృష్ణ జన్మభూమి అయిన మథుర, రామ జన్మభూమి అయిన అయోధ్యల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ నిలుపుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ మూడ్రోజుల కింద ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో యోగికి గోరఖ్‌పూర్ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఒటమి భయంతోనే యోగీని తిరిగి సొంతింటికి పంపారని ఎస్పీ అప్పుడే ప్రచారాలు సైతం మొదలుపెట్టింది. మథుర, అయోధ్యకు దూరానికి భిన్న కారణాలు.. ఇక మథుర, అయోధ్యలో యోగిని పోటీ దిగకపోవడానికి పార్టీ వర్గాలు అనేక కారణాలను విశ్లేషిస్తున్నాయి. మథురలో ఇప్పటికే బీజేపీ నుంచి బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీకాంత్ శర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన శర్మ విద్యుత్ శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఆయన్ను పక్కనపెట్టి యోగికి టిక్కెట్ ఇవ్వడం అంటే బ్రాహ్మణ వర్గానికి కోపం తెప్పిచ్చినట్లే అవుతుంది. అదీగాక విద్యుత్ సంస్కరణలు తెచ్చామని చెబుతున్న ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రికే టిక్కెట్ నిరాకరించడం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వెనక్కి తగ్గారు. ఇక అయోధ్యలో బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ గుప్తా ఎస్పీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి తేజ్ నారాయణ్ పాండేను 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. దీంతో ఆయనకు టిక్కెట్ నిరాకరించడం సాథ్యం కాదు. ఈ దృష్ట్యానే అయోధ్యలో పోటీపై వెనక్కి తగ్గారు. -
కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వర్సెస్ సమాజ్‌వాదీపార్టీ అన్నట్టుగా నడుస్తోంది ఎన్నికల రాజకీయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో ఆ స్థానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదేక్రమంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు బీజేపీ హైకమాండ్ ఏ సీటు కేటాయిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గోరఖ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరి సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీచేయాలని ప్రతిపాదించారు. ఆయన రావడానికి ఆసక్తిగా ఉంటే,.. గోరఖ్‌పూర్ అర్బన్ సీటును కేటాయించడానికి సిద్ధమని అన్నారు. 2002 నుంచి రాధా మోహన్‌దాస్ గోరఖ్‌పూర్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే ముగ్గురు మంత్రులు, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఫిబ్రవరి 10న మొదలయ్యే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగనుంది. మొత్తం 7 దశల్లో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది. (చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్) -
మరో వ్యక్తితో ప్రేయసి పెళ్లి.. సడెన్‌గా మాజీ ప్రేమికుడి ఎంట్రీ.. చివరికి
లక్నో: నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా స్టోరీలకు ఏమాత్రం తీసిపోవు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో సినిమాను మించి పోయే ఘటన చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో బంధు మిత్రుల సమక్షంలో వివాహా వేడుక జరుగుతోంది. ఇంతలో పెళ్లి మండపంలోకి కండువా కప్పుకున్న ఓ యువకుడు సడెన్‌కు ఎంటర్ అయ్యాడు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటుండగా వెంటనే వారి మధ్యలోకి దూరి వధువు నుదుటిపై కుంకుమ దిద్దడానికి ప్రయత్నించాడు. చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!! ఇది గమనించిన వధువు తన ముఖంపై పరదా కప్పుకునేందుకు ప్రయత్నించగా, బలవంతం ఆమె నుదుటిపై సింధూరాన్ని దిద్దాడు. పెళ్లి వేడుకను ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే వధువుకి కుంకుమ దిద్దిన వ్యక్తి ఆమె మాజీ ప్రేమికుడని తెలిసింది. అతను కొన్ని నెలల క్రితం పని నిమిత్తం వేరే ఊరుకువెళ్లాడు. ఇంతలో తన ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న యువకుడు హుటాహుటినా మండపానికి చేరుకున్నాడు. తన ప్రేయసి పెళ్లి పెళ్లి ఆపేందుకు ఇలా ప్లాన్ చేయగా.. చివరికి యువకుడిని పట్టుకొని బంధువులు చితకబాదారు. అయితే ఈ రచ్చ అక్కడితో ముగియలేదు. ఇదంతా జరిగిన మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన వరుడితోనే యువతి పెళ్లి జరిగింది. మరోవైపు చేసేందేం లేక మాజీ ప్రియుడు సైతం తన ఇంటికి వెళ్లి పోయాడు. చదవండి: గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా? -
ప్రోనింగ్ టెక్నిక్‌తో కరోనాను జయించిన 82 ఏళ్ల బామ్మ
లక్నో: కరోనా సోకడం కంటే ముందే ఎక్కడ మహమ్మారి బారిన పడతామోనన్న ఆందోళనతోనే ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. భయం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి కూడా మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. ధైర్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఇమ్యూన్ సిస్టం కూడా అదే స్థాయిలో పనిచేస్తుందని నిరూపించింది 82 ఏళ్ల బామ్మ. కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న వేళ కాస్త ఊరట కలిగించే వార్త ఇది. డాక్టర్ల సలహాలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహానికి తోడు మనోధైర్యంతో 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించి వార్తల్లో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె కుమారుడు శ్యామ్ శ్రీవాస్తవ డాక్టర్లను సంపద్రించాడు. డాక్టర్ల సలహాలతో కేవలం 12 రోజుల్లోనే హోం ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా శ్యామ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ' ఏప్రిల్ నెలలో మా అమ్మకు కరోనా సోకింది. ఆ సమయంలో ఆమె ఆక్సిజన్ లెవల్స్ 79కి పడిపోయాయి. దీంతో మేం అందరం ఆందోళనకు గురయ్యం. ఆస్పత్రిలో చేర్పించాలని అనుకున్నాం. కానీ ఆస్పత్రుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అందుకే డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాం. ఆక్సిజన్ లెవల్స్ పెరిగేందుకు ప్రోనింగ్ ప్రొజిషన్ ప్రాక్టీస్ చేయిస్తూ లవంగం, కర్పూరం కరోమ్ సీడ్స్‌తో మిశ్రమం తయారు చేసి ఆవిరి పీల్చడంతో ఆరోగ్యం కుదుట పడింది. అలా చేయడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ కేవలం నాలుగు రోజుల్లో 94కి పెరిగాయి. డయాబెటిస్ , అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది’’ అని చెప్పారు. ప్రోనింగ్ అంటే ఏమిటి ? కరోనా వైరస్ సోకిన బాధితులకు ఊపిరి సరిగా అందనప్పుడు పాత కాలం పద్దతిలో బోర్లా పడుకోవాలి. చాలా ఆస్పత్రులలో ఊపరి ఆడని కరోనా పేషెంట్ల ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. వైద్య భాషలో దీన్ని ప్రోనింగ్ అంటారు. ఇలా రోజుకి ఒక సారి 30 నిమిషాల పాటు ప్రోనింగ్ చేయడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ప్రోనింగ్ పొజిషన్ తో బ్రీతింగ్ లెవల్స్ ఎలా కంట్రోల్ అవుతాయి? వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోనింగ్ వ్యాయామం రోజుకు మూడుసార్లు చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ మెరుగ్గా కొనసాగుతాయి. అదే సమయంలో ఈ ప్రోనింగ్ పోజిషన్ వేసిన తరువాత ఎప్పటికప్పుడు పల్స్ మీటర్ సాయంతో ఆక్సిజన్ లెవల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలి. చదవండి: ఆక్సిజన్ కొరత: ప్రోనింగ్ చేయమంటున్న కేంద్రం -
ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా!
ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పోలీసులు ప్రస్తుతం ట్విటర్లో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఇందుకు ఓ నిందితుడితోపాటు అతన్ని పట్టుకున్న పోలీసు ఉన్న ఫోటోకు ఫోటోషాప్ ద్వారా ముఖానికి మాస్కు ధరించినట్లు మార్పింగ్ చేయటమే కారణం. వివరాల్లోకి వెళితే.. భూ వివాద గొడవలో సొంత సోదరుడిని హతమార్చినందుకు గోరఖ్‌పూర్ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకున్న ఓ ఫోటోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరికి కూడా మాస్క్ లేదు. ఇది గుర్తించిన నెటిజన్లు కరోనా ప్రోటోకాల్‌ను పోలీసులు పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. దీంతో ఈ పోస్టును పోలీసులు వెంటనే తొలగించారు. చదవండి: ‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’ తరువాత ఇదే ఫోటోను ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి రీ పోస్టు చేశారు. ఇందులో అరెస్టు అయిన నిందితునితో పాటు పోలీసు ముఖానికి మాస్కు ధరించినట్లు ఫోటోను మార్ఫింగ్ చేశారు. దీనిని మళ్లీ ట్విటర్లో పోస్టు చేశారు. అయితే అంతకుముందు షేర్ చేసిన ఫొటోను, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు పోలీసులను పదే పదే ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘డిజిటల్ మాస్క్@ గోరఖ్‌పూర్ పోలీసులు, మీలాగా డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అంటూ చురకలంటించారు. ఇట్లాంటి జిమ్మిక్కులు ఎప్పుడూ చూడలేని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తప్పిదాన్ని గ్రహించిన పోలీసులు ఆ ఫొటోను వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. Before After pic.twitter.com/p26Z2hIbfn — Piyush Rai (@Benarasiyaa) January 10, 2021 Nobody promotes Digital India like @gorakhpurpolice pic.twitter.com/7ExsHTb3J0 — Joy (@Joydas) January 10, 2021