లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో భద్రత బలగాలు పాలుపంచుకున్నాయి. నిరంతరం భద్రతలో నిమగ్నమయ్యే సశస్త్ర సీమ బల విభాగానికి చెందిన సైనికులు పాఠశాల విద్యార్థులతో రాఖీ పర్వదినాన్ని జరుపుకున్నారు.
గోరఖ్‌పూర్‌లో వివిధ స్కూళ్ల విద్యార్థులతో సమావేశమైన జవాన్లు... విద్యార్థినులతో రాఖీలు కట్టించుకొని సంబరపడ్డారు. విద్యార్థినులు కూడా సైనికుల నుదుటిన తిలకం దిద్ది, మంగళ హారతులిచ్చారు. అనంతరం రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు.
రాఖీ వేడుకల్లో సైనికులు
Published Sun, Aug 10 2014 1:39 PM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement
Advertisement