Rakhi celebration
-
రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్ల కాలినడక
మల్యాల(చొప్పదండి): అడుగు తీసి..అడుగు వేయలేని ఏడు పదుల వయసులో చేతిలో ఓ సంచి.. అందులో తమ్ముడికి కట్టే రాఖీ.. ఓ చీరతో అక్క ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి బయల్దేరింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ అనుబంధ గ్రామమైన కొత్తపల్లికి చెందిన సామల భాగ్యవ్వ(70) తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచివెళ్లింది. సామల భాగ్యవ్వ భర్త గణపతి నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. చెల్లెలు లక్ష్మి మహారాష్ట్రలో ఉంటోంది. తమ్ముడు గౌడ మల్లేశం తన సొంతూరు గంగాధర మండలం కొండన్నపల్లిలో జీవిస్తున్నాడు. రాఖీ పండగకు రాఖీ కట్టాలనే తపనతో ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ్ముడి ఇంటికి రాఖీ కట్టేందుకు చెర్లపల్లె, కురుమపల్లెల మీదుగా సుమారు రెండు గంటలపాటు నడిచి వెళ్లి కొండన్నపల్లె చేరుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాఖీ పండుగ రోజు గురువారం తమ్ముడి మల్లేశంకు రాఖీ కట్టి, రాఖీ పండుగ ప్రాముఖ్యతను చాటిచెప్పింది. ఏటా అక్క భాగ్యవ్వ తన కోసం నడుచుకుంటూ తమ ఇంటికి వస్తుందని, రాఖీ కట్టిన అనంతరం బండిపై తీసుకెళ్లి, కొత్తపల్లెలో దింపుతానని మల్లేశం తెలిపాడు. -
మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్
ఈ మధ్యే కాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మొన్న పుట్టినరోజున కూడా ఎక్కడా కనిపించలేదు. అలాంటిది తాజాగా రాఖీ సందర్భంగా తన చెల్లెళ్లతో కలిసి పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు) ఈ వీడియోలో భాగంగా చిరంజీవి కుర్చీలో ఉండగా, ఇద్దరు చెల్లెళ్లు ఆయనకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. అయితే మెగాస్టార్ కాబట్టి.. చెల్లెళ్లు ఇద్దరికీ రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్స్ లేదా డబ్బులు బాగానే ఇచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. 'భోళా శంకర్' సినిమాతో ఈ మధ్యే వచ్చిన చిరు.. బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాలు ప్రకటించారు. వీటిలో కూతురు సుస్మిత నిర్మాణంలో ఒకటి, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వశిష్ట్ దర్శకుడిగా మరో సినిమా చేయబోతున్నారు. త్వరలో ఈ రెండు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్
విద్యానగర్/కరీంనగర్ కల్చరల్: ఆధునికయుగంలో అనుబంధాలు ఇంకా తరిగిపోలేదు. ఉమ్మడి కుటుంబాలు తగ్గినా పేగుబంధాలు ధృడంగానే ఉన్నాయి. ఎక్కడ ఉన్నా పరస్పర యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయత పంచుతూ తోబుట్టువుల బంధాన్ని శాశ్వతంగా నిలిపేది రక్షాబంధన్. సోదరీసోదరుల ఆత్మీయ బంధానికి ప్రతీక అయినా రక్షా బంధన్‌ను గురువారం దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. పండుగ రోజున పుట్టిళ్లు సందడిగా మారుతాయి. అక్కాచెల్లెళ్లు కట్టిన రాఖీలతో సోదరుల ముంజేతులన్నీ వివిధ రంగులు, డిజైన్ల రాఖీలతో కళకళలాడుతాయి. అండగా ఉంటామని హామీ ఇస్తూ అన్నదమ్ములు తమకు తోచిన కట్నకానుకలు సోదరీమణులకు ఇస్తారు. రక్షాబంధన్‌ను రాఖీపౌర్ణమి, జంద్యాల పౌర్ణమిగా పిలుస్తారు. పండుగ ఎలా ప్రారంభమైందంటే.. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం జరిగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రడు పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపా యం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడు సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్గిస్తుంది. సరిగా ఆ రోజు ఽశ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతిపరమేశ్వరులు, లక్ష్మీనారాయణను పూ జించి రక్షాను దేవేంద్రుని చేతికి కడుతుంది. దేవతలందురూ పూజించిన రక్షాలను ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా రాఖీ పండుగా మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. అన్నాతమ్ముళ్లకు కట్టే రక్షాబంధన్ ద్వారా వారు తలపెట్టే కార్యాలు విజయవంతం కావాలని, సుఖసంతోషాలు, సిరి సంపదలు కలగాలని ఆకాంక్షించే విశిష్టత రాఖీ పండుగకు ఉంది. నూతన వస్రాలు, బహుమతులతో ఆనందంగా గడుపుతారు. బ్రిటీష్‌వారు దేశాన్ని పాలిస్తున్న కాలంలో వారి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. సీ్త్రలు రక్షణ కోసం వీరయెధులకు రక్షాబంధన్ కట్టేవారు. సోదరభావంతో యోధులు మహిళలకు రక్షణ కల్పించేవారు. రాణి కర్ణావతి దుర్గాన్ని శత్రువులు ముట్టడించినప్పుడు ఢిల్లీ బాదుషాకు రాఖీ పంపంది. బాదుషా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆమె ఇంట్లో భోజనం చేసి కానుకల సమర్పించినట్టు చరిత్ర. ఆన్లైన్ రక్షాబంధన్ కాలం మారడంతో పాటు రక్షబంధన్ తీరు మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదురులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే కట్టకొని తోబుట్టువులకు కానుకలు పంపుతుండే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతో ఆన్లైన్ ద్వారా రాఖీలను పంపి ఆన్లైన్ ద్వారానే కానుకులు స్వీకరిస్తున్నారు. సామాజికి మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకునే వెసులుబాటు ఉంది. పద్ధతులు మారినా రాఖీ అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కుచెదరలేదు. ఈ సమయాలు అనుకూలం గురువారమే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి. శుభకార్యాలు, పండుగలకు సూర్యోదయ తిథి ప్రమాణంగా పాటించాలి. ఉదయం 6.30 నుంచి 9.45, మళ్లీ 10.50 నుంచి 11.50 నిమిషాల మధ్య, మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6.00 గంటల మధ్య రాఖీలు కడితే శుభకరం. – శ్రీతాటిచెర్ల హరికిషన్శర్మ, పురోహితుడు ముగ్గురు అన్నదమ్ములు నాకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. తమ్ముడు మాత్రం కరీంనగర్లో మాతోనే ఉంటాడు, రైస్‌మిల్లు ఉంది. ప్రతి పండుగకు ఇద్దరు అన్నలు కళ్లముందు లేకున్న రాఖీ పంపిస్తాను. ఇక్కడ ఉండే కృష్ణకు మాత్రం స్వయంగా రాఖీ కడతాను. – సింగిరికొండ మాధవి, తిరుమలనగర్, కరీంనగర్ తమ్ముడంటే ప్రాణం మా ఇంట్లో మేము ముగ్గురం, మాకు తమ్ముడు అన్వేశ్ అంటే ప్రాణం, ప్రస్తుతం వాడు హుస్నాబాద్‌లోని శ్రీనివాస హాస్పిటల్ ఇన్చార్జి. రాఖీపండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా వాడి దగ్గరికి వెళ్లి మేమిందరం కలిసి రాఖీ కడతాం. తమ్ముడు కూడా మా కోసం ప్రతీ పండుగకు ఎదురుచూస్తుంటాడు, వాడి ప్రేమాభిమానాలు ఎప్పటికీ కావాలి. వాడు ఆనందంగా ఉండాలని, ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాం. – స్రవంతి, అమూల్య, కరీంనగర్ -
Rakhi : రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?
సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్ రోజు. తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీ పండగ రోజు తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. శ్రావణ పౌర్ణమి రాఖీ వేడుకలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. పండుగ ఎప్పుడు అన్నదానిపై చాలా మందిలో సంధిగ్థత నెలకొంది. బుధవారం జరుపుకోవాలని కొందరు.. కాదు కాదు గురువారం జరుపుకోవాలని మరికొందరు చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ఎవరికి తోచినట్టు వారు పోస్టింగ్ లు పెడుతున్నారు. గురువారమే సరైన ముహూర్తం : భద్రకాళి ఆలయ సిద్ధాంతి రాఖీ పౌర్ణమిని ఈ నెల 31వ తేదీ గురువారం జరుపుకోవాలని వరంగల్ భద్రకాళి దేవస్థాన ఆస్థాన పండితులు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి తెలిపారు. కాజీపేట పట్టణంలోని స్వయంభు శ్రీశ్వేతార్కమూల గణపతి దివ్య క్షేత్రంలో మల్లయ శర్మ సిద్ధాంతి విలేకరులతో మాట్లాడుతూ 30న పౌర్ణమి తిథి ఉదయం 10.23 నిమిషాల తదుపరి ప్రవేశమై 31న ఉదయం 7.55 నిమిషాల వరకు ఉంటుందన్నారు. 6.02 నిమిషాలకే సూర్యోదయం అవుతున్న నేపథ్యంలో 31న రాఖీ వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఉదయమే నుంచే పౌర్ణమి వేడుకలు : అర్చక సంఘం రాఖీ పండుగపై వస్తున్న అపోహాలను నమ్మవద్దని జిల్లా అర్చక పురోహిత సంఘం ప్రకటించింది. రాఖీ పౌర్ణమి గురువారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రాఖీలు కట్టుకోవచ్చునన్నారు. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు జంజరములు వేసుకోవచ్చునని అర్చక సంఘం జిల్లా నాయకులు మురళీ కృష్ణమాచార్యులు, శ్రీనివాస్ ఆచార్యులు ప్రకటనలో పేర్కొన్నారు. సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన బల్కంపేట ఆలయం హైదరాబాద్/ సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులు మునుపెన్నడూ లేని సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. పురాణాల ప్రకారం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సోదరుడైన కొమురవెల్లి మల్లన్నకు రాఖీ అందించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారికి వెండి రాఖీని, పట్టువస్త్రాలను సమర్పించారు. అంతకముందు రాఖీని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ముందు ఉంచి పూజలు జరిపి తీసుకువెళ్లారు. -
ఎవరన్నారు వైఎస్ ఈ లోకంలో లేరని..
కాశీబుగ్గ : అభిమానించే ప్రతి గుండెలోనూ ఇలా ఆయన ఉనికి కనిపిస్తూనే ఉంది. జన కుటుంబాన్ని వదిలి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజల మనసుల్లో మాత్రం మహానేత రూపం సజీవంగానే ఉంది. అందుకు తార్కాణమే ఈ చిత్రం. కాశీబుగ్గలోని వైఎస్ విగ్రహానికి ఓ మహిళ ఆదివారం ఇలా రాఖీ కడుతూ కనిపించిం ది. స్థానికులు ఆమె వివరాలు ఆరా తీసే లోగానే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కుమారుడికి గుండె ఆపరేషన్ చేయిం చినందుకు కృతజ్ఞతగా ఏటా వేకువజామున వచ్చి ఇలా రాఖీ కట్టి వెళ్తుందని, వర్షం కారణంగా ఈ రోజు ఆలస్యంగా వచ్చిందని కొందరు స్థానికులు తెలిపారు. నాయకుడిగా వైఎస్ సంపాదించిన ప్రేమకు ఇదో మచ్చుతునక అని స్థానికులు చర్చించుకున్నారు. -
రాఖీలు కట్టించుకున్న సైనికులు
-
రాఖీ వేడుకల్లో సైనికులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో భద్రత బలగాలు పాలుపంచుకున్నాయి. నిరంతరం భద్రతలో నిమగ్నమయ్యే సశస్త్ర సీమ బల విభాగానికి చెందిన సైనికులు పాఠశాల విద్యార్థులతో రాఖీ పర్వదినాన్ని జరుపుకున్నారు. గోరఖ్‌పూర్‌లో వివిధ స్కూళ్ల విద్యార్థులతో సమావేశమైన జవాన్లు... విద్యార్థినులతో రాఖీలు కట్టించుకొని సంబరపడ్డారు. విద్యార్థినులు కూడా సైనికుల నుదుటిన తిలకం దిద్ది, మంగళ హారతులిచ్చారు. అనంతరం రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. -
వైఎస్ జగన్ కు రాఖీ కట్టిన రోజా
హైదరాబాద్: లోటస్‌పాండ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నగరి ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రోజాకు స్వీటు తినిపించి ఆశీస్సులు అందజేశారు జగన్. మహిళలు, పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జగనన్నకు రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన అందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. -
ఆకాశమంత..
నా ధైర్యం నా చెల్లెలే అంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్. కంటికి రెప్పలా కాపాడుకునే అన్నంటే నాకు ప్రాణం అంటోంది పూరీ తనయ పవిత్ర. ఆకాశ్ ఇంటర్, పవిత్ర టెన్త్ చదువుతున్నారు. తండ్రికి జిరాక్స్ కాపీలా ఉండే చెల్లికి కాస్త మేకప్ చేసి.. నాన్నలా ముస్తాబు చేయడం ఆ అన్నకు సరదా. అన్నయ్యకు సర్ప్రైజ్ లు ఇవ్వడం చెల్లికి మహా సరదా. లాస్ట్ ఇయర్ ఆకాశ్ బర్త్‌డేకి రేర్ ఫొటోగ్రాఫ్స్‌తో ఏవీ ప్రిపేర్ చేసి కానుకగా ఇచ్చింది. ఇద్దరిలో చెల్లెలిదే డామినేషన్. ‘అన్నయ్యకు కోపం వస్తే బొమ్మలు గాల్లో తేలుతాయి. అప్పుడు ఎవరేం చెప్పినా వినడు. అన్నయ్యను ఎవరేం అన్నా నేను ఊరుకోను’ అంటోంది పవిత్ర. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఓనమాలు దిద్దుతున్న చెల్లిని ప్రోత్సహించడం ఒక్కటే ఆ అన్నయ్యకు తెలుసు. ‘నేను డిజైన్ చేసిన షర్ట్స్‌ను మెచ్చుకోవడమే కానీ.. బాగోలేదని ఎప్పుడూ చెప్పడు. సలహాలు ఇస్తుంటాడు’ అని పవిత్ర కాస్త గర్వంగా చెబుతుంటుంది. ‘రాఖీ రోజు అన్నయ్య నాకిష్టమైన బహుమతి ఇస్తాడు. రాఖీకి అన్నయ్య ప్రజెంట్ చేసిన డైమండ్ ఇయర్ రింగ్స్ అమ్మను కూడా ముట్టుకోనివ్వన’ని చె ప్పుకొచ్చింది. ఈ రాఖీ పండుగకు.. చెల్లికి పర్షియన్ క్యాట్ ఇవ్వబోతున్నానని ఆకాశ్ రహస్యంగా చెప్పాడు. తను హీరో అవ్వాలని కోరుకుంటున్న ఆకాశ్.. చెల్లెలు డెరైక్టర్‌గా రాణించగలద ని నమ్మకంగా చెబుతున్నాడు. -
అన్నయ్యే అన్నీ..
రాజన్న సినిమాలో ‘అమ్మా అవని..’ అంటూ అభినయించిన బాలనటి అనీ అంటే ఆ అన్నకు ప్రాణం. ఎంతలా అంటే ఆ ముద్దుల చెల్లెలు పేరును చేతిపై టాటూ వేయించుకునేంత. అనీ తొమ్మిదో తరగతి చదువుతుంటే.. అన్నయ్య ఆశిష్ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. ఏజ్ గ్యాప్ ఏడేళ్లున్నా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చెల్లెలి వల్లే తమ ఫ్యామిలీకి గుర్తింపు వచ్చిందంటాడు ఆ అన్న. నాకు అన్నీ అన్నయ్యే అంటుంది చెల్లి. అలగడం హాబీగా ఉన్న చెల్లిని ఓదార్చడం అన్నకు ఇష్టం. టీవీలో యాంకర్లను చూసి.. అద్దం ముందు చెల్లెలు చేసే అభినయం మరింత ఇష్టం. చెల్లెలు గిఫ్ట్‌గా ఇచ్చిన షర్ట్ వేసుకుంటే ఎక్కడ పాడైపోతుందోనని.. బీరువాలో భద్రంగా దాచుకోవడం ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే ఎంతో పరిణ తితో ఆలోచించే అనీ.. తనకు అక్కలా మాట్లాడుతుందని మురిసిపోతూ చెప్తాడు ఆశిష్. నటన తన చెల్లికి దేవుడిచ్చిన వరమని చెబుతున్న ఆశిష్.. అనీ పెద్దయిన తర్వాత మంచి నటిగానో.. యాంకర్గానో స్థిరపడాలని కోరుకుంటున్నాడు. షూటింగ్‌లతో అన్నయ్యను మిస్సయినా.. ఆయన పంచే అనురాగాన్ని మాత్రం మిస్సయ్యేది లేదంటోంది అనీ. రాఖీ పండుగ రోజు షూటింగ్‌కు వెళ్లాల్సి రావడం బాధగా ఉంటుందని చెబుతోంది. ‘ఆ రోజు అన్నయ్య నిద్ర లేవక ముందే చేతికి రాఖీ కట్టి ముద్దు పెట్టి షూటింగ్‌కు వెళ్లిపోతాను. నేను షూటింగ్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి మరీ అన్నయ్య మంచి గిఫ్ట్ ఇస్తాడు’ అని ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అనీ మనముందుంచింది. -
ఘనంగా రాఖీ పౌర్ణమి
బళ్లారి అర్బన్/చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలు బుధవారం బళ్లారి నగరంలో ఘనంగా జరిగాయి. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన చెల్లెళ్లు అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఈ బంధం జన్మజన్మలు కొనసాగాలని ఆశీర్వాదం పొందారు. నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీలు విద్యార్థులకు రాఖీలు కట్టి తిలకం దిద్ది మిఠాయిలను ఇచ్చి రాఖీ వేడుకలను జరుపుకున్నారు. మరికొందరు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు చీరలు ఇచ్చి ఒడి బియ్యం పోసి సంతోషంగా ఉండాలని దీవించారు. చిన్నారులు కూడా ఒక రికొక్కరు రాఖీని కట్టుకొని తమ అనుబంధాన్ని చాటారు. నగరంలో సంతోషిమాత ఆలయంలో, కోట ప్రాంతంలోనిసంతోషిమాత ఆలయంలో రాఖీపౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు చేశారు. పంచామృతాభిషేకం, కుంకుమ అర్చన, మహామంగళ హారతి, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం 108 హారతులు వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం ఊయల సేవ, రథోత్సవం, భజన, సంగీత కార్యక్రమం తదితర పూజలను నిర్వహించారు. చిత్రదుర్గం నగరంలో పార్శనాథ పాఠశాలలో విద్యార్థులు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని సోదర భావాన్ని పెంపొందించుకునే విధంగా అధ్యాపకులు ప్రోత్సహించారు.