గోరఖ్‌పూర్: 105కి చేరిన పిల్లల మరణాలు
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పిల్లల మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు చనిపోవటంతో ఆ సంఖ్య 105కి చేరుకుంది. ఈ విషయాన్ని డాక్టర్ పీకే సింగ్ ధృవీకరించారు.
నియోనాటల్ వార్డులో ఐదుగురు, ఏన్కెఫలైటిస్ వార్డులో ఇద్దరు, సాధారణ వార్డులో ఇద్దరు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. చనిపోయిన వారిలో చాలా మంది నవజాత శిశులు ఉన్నారని, అత్యవసర స్థితిలోనే వారిని తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారని సింగ్ తెలిపారు. ఆగస్టు 10 నుంచి ఆగష్టు 11వ వరకు ఆ 48 గంటల్లో 30 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయారంటూ జిల్లా మెజిస్ట్రేట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉంది.
ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం యూపీకి వెళ్లనున్నారు. బీఆర్డీ ఆస్పత్రిని కూడా ఆయన సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోపక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ లో స్వచ్ఛ్‌భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన కూడా ఆస్పత్రిని సందర్శించే పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని సీఎంవో అధికారులు చెబుతున్నారు.