గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ త్వరలో వరల్డ్ క్లాస్ లుక్‌లో కనిపించనుంది. ఈ రైల్వే స్టేషన్‌ను రూ.498 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్‌లో పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నామని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు, రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బడ్జెట్ హోటల్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు చూసేందుకు, షాపింగ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రావెలేటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది ప్రత్యేక తరహా ఎస్కలేటర్. దానిపై నిలబడి నడవకుండానే ఒక చోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. సీనియర్ సిటిజన్‌లు, మహిళలు, వికలాంగులతో సహా ప్రయాణికులంతా ట్రావెలేటర్‌ను వినియోగించుకోవచ్చు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. 2023 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment