సాక్షి, న్యూఢిల్లీ : బాబా రాఘవ్‌దాస్ ఆసుపత్రి ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. మెదడు వాపు వ్యాధితో చిన్నారులు ఇక్కడ 40 ఏళ్ల నుంచి మృతి చెందుతూనే ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి మాటమాత్రంగా కూడా స్పందించిన వ్యక్తులు, పార్టీలు నేడు అతిగా ప్రతిస్పందిస్తున్నాయని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. చిన్నారుల మృతి చెందడడం బాధాకరం.. భవిష్యత్‌లో ఇలా జరక్కుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వాన్ని విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది.. గోరఖ్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో బాధపడే చిన్నారులు.. ఆక్సిజన్ కొరతతో 40 ఏళ్లుగా చిపోతూనే ఉన్నారు.. ఇప్పుడే కొందరు కొత్తగా అరుస్తున్నారు అని యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. 40 ఏళ్లు తప్పులను సరిదిద్దడానికి మాకు సమయం పడుతుందని ఆయన చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో మేం అధికారంలోకి వచ్చాక మెదడువాపు వ్యాధి రాకుండా గత మే నెల్లో 92 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి అధికంగా సోకే 20 జిల్లాలో ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ పతనముతోందన్న విమర్శలకు యోగి ఆదిత్యనాథ్ సమాధానమిస్తూ.. మోదీ నేతృత్వంలో దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలించిదని యూపీ సీఎం ఆదిత్యనాథ్ చెప్పారు.