![Viral Video: Yogi Adityanath Feeds Leopard Cub With Bottle - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/5/Leopard.jpg.webp?itok=9ICvr_-W)
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జూని సందర్శించి చిరుత పిల్లకు పాలు పట్టించారు. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు.
ఇంతలో ఆయన ఒక చిరుత పిల్లకు పాలబాటిల్‌తో పాలు పట్టించేందుకు దాని ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి యోగికి ఇచ్చారు. ఐతే అది మొదట తాగేందుకు అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆయన వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎట్టకేలకు ఆ చిరుత పిల్లకు పాలు పట్టించగలిగారు.
అంతేగాదు ఆ జూలో ఉన్న మిగతా పెద్ద పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ జూని 'షాహిద్ ఆష్పాక్ ఉల్లాల్ ఖాన్ పార్క్' అని కూడా పిలుస్తారు. దీన్ని గతేడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది పుర్వాంచల్ ప్రాంతంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్, అలాగే ఉత్తరప్రదేశ్‌లో మూడవది అని జూ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment