leopard cub
-
పిల్ల చిరుత హల్చల్
బెంగుళూరు: బస్సుకి అడ్డంగా వచ్చిన చిరుత పిల్లకు సపర్యలు చేయబోయిన డ్రైవర్‌పై దాడికి యత్నించింది. ఈ ఘటన దొడ్డ సమీపంలో తురహళ్లి అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. బీఎంటీసీ బస్సు ఒకటి తురహళ్లి అటవీ ప్రాంతంలో వెళ్తుండగా పిల్ల చిరుత హఠాత్తుగా బస్సుకి అడ్డం వచ్చింది. డ్రైవర్ బస్సు నిలిపి, నీళ్ల బాటిల్‌తో చిరుత పిల్లకు నీళ్లు తాగించడానికి ప్రయత్నించాడు. అయితే అది డ్రైవర్‌పైకి దాడికి దూకింది. మిగతా వాహనదారులు గదమాయించడంతో అది బస్సు కింద నక్కి కూర్చుంది. అటవీశాఖ సిబ్బంది చేరుకుని దానిని పట్టి తీసుకెళ్లారు. Bengaluru: BMTC staff on the Kengeri-Banashankari route spotted two leopards, including an eight-month-old cub, near Turahalli Forest off Kanakapura Road@BMTC_BENGALURU pic.twitter.com/vVDaxfFwl4 — ChristinMathewPhilip (@ChristinMP_) April 3, 2024 A Leopard was hit by a vehicle (not BMTC bus) at Banashankari 6th Stage near 100feet road close to Turahalli forest in Bengaluru@aranya_kfd, @pfaindia & locals have rescued it & is under treatment now pic.twitter.com/DU8xTXdR4F — Karnataka Weather (@Bnglrweatherman) April 3, 2024 -
సిరిసిల్లలో చిరుత కలకలం.. పొలాల్లో రెండు పిల్లలు లభ్యం
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ పిల్లను చిరుత తీసుకువెళుతుండగా పొలం పనులకు వెళుతున్న రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో చిరుత రైతుల అలజడి విని ఓ పిల్లను వదిలేసి వెళ్ళింది. చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. చిన్న చిరుతతో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాల కోసం ఏడుస్తున్న చిరుత పిల్లలకు పాలు తాగించే యత్నం చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పిల్లను కరీంనగర్‌కు తరలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. అయితే చిరుత పిల్ల లభ్యం కావడంతో శివంగులపల్లితో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
ప్రమాదకర అంటువ్యాధి.. 15 రోజుల్లో ఏడు చిరుత కూనలు మృతి
బెంగళూరు: కర్ణాటకలో చిరుత పిల్లల మరణాలు కలకలం రేపుతున్నాయి. తీవ్రమైన అంటువ్యాధి సోకి బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్‌లో ఏడు చిరుత కూనలు మృతిచెందాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి ‘ఫీలైన్ పాన్ల్యూకోపెనియా బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే 8 పిల్లలు మరణించినట్లు పార్క్ అధికారులు మంగళవారం వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. ఆగస్టు 22న తొలిసారి ఈ వైరస్ బయటపడినట్లు తెలిపారు. 15 రోజుల్లోనే ఎనిమిది చిరుత పిల్లలకు వైరస్ సోకి చనిపోయినట్లు పేర్కొన్నారు. సఫారీ ప్రాంతంలో తొమ్మిది కూనలను వదిలిపెట్టగా వాటిలో నాలుగు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రెస్క్యూ సెంటర్లో ఉండే మరో మూడింటికి కూడా అంటువ్యాధి సోకి చికిత్స పొందుతూ మరణించాయన్నారు. మరణించిన ఏడు పిల్ల చిరుతల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల లోపు ఉంటుందని పేర్కొన్నారు. అన్నీ కూనలకు వ్యాక్సినేషన్ చేయించినప్పటికీ వైరస్ సోకి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. చదవండి: జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం అయితే ప్రస్తుతం వైరస్‌లో నియంత్రణలో ఉందని.. గత 15 రోజులలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, వెటర్నటీ డాక్టర్లో చర్చలు జరిపి వైరస్ కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని చెప్పారు. అలాగే జంతు ప్రదర్శనశాలలో పరిశుభ్రత చర్యలు చేపట్టామని రెస్క్యూ సెంటర్ పూర్తిగా శానిటైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫీలైన్ పాన్ల్యూకోపెనియా అనే అంటువ్యాధి పిల్లి జాతికి చెందిన పార్వేవైరస్ వల్ల కలుగుతుందని.. ఈ వైరస్ ప్రభావం కూనలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీని బారిన పడితే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. తీవ్రమైన విరేచనాలు, వాంతులు డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయని చివరికి మరణానికి దారితీస్తుందన్నారు. ఇది వేగంగా వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన నాలుగైదు రోజుల్లో జంతువు చనిపోతుందని తెలిపారు. -
చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు: వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జూని సందర్శించి చిరుత పిల్లకు పాలు పట్టించారు. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు. ఇంతలో ఆయన ఒక చిరుత పిల్లకు పాలబాటిల్తో పాలు పట్టించేందుకు దాని ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి యోగికి ఇచ్చారు. ఐతే అది మొదట తాగేందుకు అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆయన వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎట్టకేలకు ఆ చిరుత పిల్లకు పాలు పట్టించగలిగారు. అంతేగాదు ఆ జూలో ఉన్న మిగతా పెద్ద పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ జూని 'షాహిద్ ఆష్పాక్ ఉల్లాల్ ఖాన్ పార్క్' అని కూడా పిలుస్తారు. దీన్ని గతేడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది పుర్వాంచల్ ప్రాంతంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్, అలాగే ఉత్తరప్రదేశ్‌లో మూడవది అని జూ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు) -
చిరుత పిల్లను బ్లాంకెట్‌లో చుట్టిన మహిళ.. వైరల్ వీడియో
ముంబై: కొన్ని రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాల వలన ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఒక్కొసారి అడవికి సమీపంలో ఉన్న ప్రాంతాలలోని జంతువులు దారితప్పి రోడ్లపైకి వచ్చిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా, అలాంటి సంఘటన ఒకటి ముంబైలోని ఆర్‌మీల్స్ కాలనీలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆర్మీల్స్కాలనీ అడవికి సమీపంలో ఉంటుంది. ఈ క్రమంలో ఒక చిరుత పిల్ల తన తల్లినుంచి తప్పిపోయి.. జనావాసాల సమీపంలోకి వచ్చింది. పాపం.. ఆ చిరుత పిల్ల తల్లి కోసం అటు ఇటూ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ చిరుత పిల్లను ముంబాలికర్స్ అనే మహిళ గమనించింది. ఆ తర్వాత ఆ కూనను అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లింది. వర్షంలో తడిసిన కూనకు బ్లాంకెట్‌లో చుట్టి సపర్యలు చేసింది. ఆ తర్వాత అటవీ అధికారులకు,పోలీసులకు సమాచారం అందించింది. మహిళ ఇంటికి చేరుకున్న అధికారులు ఆ చిరుత పిల్లను తిరిగి అడవిలో వదిలి.. దాని తల్లి దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేస్తూన్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు చిరుతపిల్ల ప్రాణాలు కాపాడిన మహిళను ప్రశంసిస్తున్నారు. ఎలాగైనా అటవీ అధికారులు చిరుతపిల్లను దాని తల్లి దగ్గరకు చేర్చండని అధికారులను కోరుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Visuals from Aarey forest,Mumbai.. Just besides the former metro 3 carshed area you see the leopard & her cubs while one of the cubs & had lost it way & was rescued.. The so called infra enthuus want the metro carshed to be built here 🙄👇#SaveAareyForest pic.twitter.com/WkxgEITjZo — Save Mumbai's forests (@SaveMumbaifore1) September 28, 2021 చదవండి: ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’ -
నీటి కుంటలో చిరుత పిల్ల
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి సమీపంలోని ఓ నీటికుంటలో శుక్రవారం చిరుత పిల్ల లభ్యమైంది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఆ చిరుత పిల్ల నీటి కుంటలో పడి ఉండటాన్ని గ్రామస్తులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచరమిచ్చారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్‌సింగ్, ఎఫ్ఎస్వో షాన్వాజ్, జగన్నాథ్, సిబ్బందితో వెళ్లి కుంటలో పడిన చిరుత పిల్లను రక్షించి బోనులోకి చేర్చారు. తల్లి జాడ కోసం సుమారు మూడు గంటల పాటు నిరీక్షించారు. అయినా జాడ తెలియలేదు. దీంతో చిరుత పిల్లను కళ్యాణదుర్గంలోని అటవీ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్, సబ్ డీఎఫ్‌వో శామ్యూల్ కళ్యాణదుర్గం చేరుకుని దాన్ని పరిశీలించారు. పశు వైద్యుడు ప్రసాద్ సమక్షంలో దాని వయసు 45 రోజులుగా నిర్ధారించారు. అనంతరం పాలు పట్టించారు. చాలా చిన్న వయసు కావడంతో అడవిలో వదిలిపెట్టలేమని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జంతు ప్రదర్శనశాలకు తరలిస్తున్నామని డీఎఫ్‌వో చెప్పారు. తల్లితో పాటు నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు కుంటలో పడి ఉంటుందని భావిస్తున్నారు. -
ఈ ఫోటోలో మరో చిరుత కూడా ఉందండోయ్.. గుర్తుపట్టారా?
శక్తికి మారుపేరైన చిరుతపులి దాడి చేస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిందే. వెంటాడి, వేటాడి ఎలాంటి జంతువునైనా నిమిషాల్లో తనకు ఆహారం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుతపులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలో ఇది ఆరితేరిన జంతువు. అలాంటి చిరుతకు సంబంధించిన ఓ ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కశ్వన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ఈ చిత్రంలో ఎన్ని చిరుతలు ఉన్నాయో గుర్తించాలంటూ నెటిజన్లకు సవాల్ విసిరాడు. అయితే ముందుగా దీన్ని ఫోటోగ్రాఫర్ మోహన్ థామస్ పోస్ట్ చేసిన ఈ ఫోటోను మళ్లీ రీ ట్వీట్ చేశాడు. ఓ ఫోటోలో చిరుత చెట్టుపై ఎక్కి ఎంచక్కా కూర్చుంది. అయితే ఇందులో చిరుత ఒక్కటే లేదు. మరో చిరుత పిల్ల కూడా దాగి ఉంది. ఫోటోలో దానిని గుర్తు పట్టుకోవాలి. సాధారణంగా కొన్ని చూడగానే టక్కున కనిపిస్తాయి. మరికొన్ని ఏకాగ్రతను కూడగట్టుకొని నిశితంగా పరిశీలిస్తేనే అవి కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫోటోలో బుల్లి చిరుత ఎక్కడుందో కనిపెట్టండి. How many leopards ? https://t.co/lH3nnwnDhG — Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 25, 2021 కావాలంటే మీకు ఓ క్లూ కూడా ఇస్తాము. కింద ఉన్న ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే రెండు తోకలు కనిపిస్తాయి. ఇప్పుడు చెట్టు మధ్యలో పరిశీలిస్తే మీరు కొంచెం సులభంగా గుర్తించవచ్చు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ తోక కనిపించడం వల్ల పిల్ల చిరుతను గుర్తించడం సులభంగా మారిందని, అదే తోక లేకుండా ఉంటే చాలా కష్టమయ్యేదని కామెంట్ చేస్తున్నారు. దీనిపై మరి మీరూ ఓ పట్టు పట్టండి. చదవండి: Cheetahs: చీతా గురించి మీకు ఈ విషయాలు తెలుసా! -
పాపం: తల్లీ, పిల్ల చిరుతల మృతి
సాక్షి, మైసూరు: మూడు చిరుత పులులు అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన బెళవాడి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. వీటిలో ఒకటి 4–5 ఏళ్ల ఆడ చిరుత కాగా, మిగిలిన రెండు 8–10 నెలల మధ్య ఉన్న చిన్నపిల్లలు కావడం గమనార్హం. దీనిని బట్టి తల్లి, పిల్ల చిరుతలుగా భావిస్తున్నారు. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. కళేబరాలను సైన్స్ లేబోరేటరీకి తరలించారు. మరోవైపు మూడు చిరుతలు మరణించిన కొద్ది దూరంలోనే సగం తినేసి వదిలేసి కుక్క కళేబరం ఒకటి కనిపించింది. ఆ మృత కుక్క దేహంపై కీటక నాశని పిచికారీ చేసినట్లు కనిపించింది. ఎవరో కావాలనే కుక్క కళేబరంలోకి పురుగుల మందు కలిపి చిరుతలకు ఎరవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చిరుతల శరీర, రక్త నమూనాలను బెంగళూరు, మైసూరు ప్రయోగశాలలకు పంపించారు. నివేదిక అందిన తర్వాతే అసలు విషయం బయటకు రానుంది. చదవండి: ఎస్సై అమానుషం.. దళితునితో మూత్రం తాగించి.. దారుణం: భర్త అంత్యక్రియలు.. ఆ వెంటనే భార్య ఆత్మహత్య -
‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’
జంతు ప్రపంచంలో ఏన్నో వింతలు, ఆశ్చర్యాలు. అడవుల్లో చూసేందుకు అందాలు ఎన్నో. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రతి దాన్ని కెమెరాలో బంధించి వీటన్నింటిని చూసేందుకు వీలవుతోంది. తాజాగా చిరుతపులికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత అటవీశాఖ అధికారి సుశాంత నందా గురువారం ఓ వీడియో క్లిప్‌ను తన ట్విటర్లో షేర్ చేశారు. (మరోసారి చిరుత కలకలం) 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పిల్ల చిరుతపులి, దాని తల్లితో కలిసి సరస్సు వద్ద నీటిని తాగుతూ దాహాన్ని తీర్చుకుంటోంది. అంతేగాక చుట్టుపక్కలా ఉన్న పక్షుల కిలకిల రావాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. ఈ వీడియోను ఇప్పటికే 7 వేల మంది వీక్షించారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తూ... జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని చూసిన నెటిజన్లు ‘వావ్. ఇది చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. మాంసాహారి అయినప్పటికీ ఎంతో అప్రమత్తంగా ఉంది.’ అని కామెంట్ చేస్తున్నారు. (ఇదేం పిచ్చి: చెవులను కత్తిరించి భద్రంగా..) Mamma leopard with cubs.. And the sound of forests💕 🎬 achintyawildlifephotography pic.twitter.com/hAQM8OthkH — Susanta Nanda IFS (@susantananda3) August 27, 2020 -
పిల్లుల్లా కీచులాడుతున్న పులి పిల్లలు
-
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్పురి ప్రాంతంలో ఓ గుడిసెలో ఆడ చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మంగళవారం భూమ్మీద పడ్డ ఈ పసికూనలు ఆరోగ్యంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు అప్పుడే కళ్లు తెరిచి ఈ లోకాన్ని చూస్తున్న చిరుత పులి కూనలు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. తల్లి మాత్రం అక్కడే ఓ మూలన కూర్చుని ఉంది. పిల్లలు గుడిసంతా కలియదిరుగుతూ పిల్లిపిల్లలా శబ్ధాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (రైల్వే ట్రాక్‌పై చిరుత మృతదేహం) 'పులి పిల్లలే కానీ పిల్లిలా కన్పిస్తున్నాయి', 'ఎంత ముద్దొస్తున్నాయో..', 'మీ కుటుంబం అద్భుతంగా ఉంది' అంటూ నెటిజన్లు వారి స్పందనలను తెలియజేస్తున్నారు. 51 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. మరోవైపు వాటిని ఉన్నఫళంగా అక్కడి నుంచి పంపించివేయడానికి అటవీ అధికారులకు మనసొప్పలేదు. దీంతో తల్లే వాటిని వేరే చోటుకు తీసుకు వెళ్లే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఇగత్పురి ప్రాంతంలో పెద్ద సంఖ్యలోనే పులులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారి గణేశ్ రావు జోలె పేర్కొన్నారు. (చిరుత కోసం రిస్క్, ‘రియల్ హీరో’పై ప్రశంసలు) -
చిరుత ఏం దాస్తుందో చెప్పుకోండి చూద్దాం?
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల జనాలు నెలన్నర రోజులకు పైగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని సడలింపులు ఇస్తూ ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తున్నారు. అయితే షరతులు వర్తిస్తాయి. అన్ని రంగాల వారికి అనుమతులు లేవు, పైగా రెడ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు వీల్లేదు. "యధా రెడ్ జోన్ తధా లాక్డౌన్" అన్నచందంగా అక్కడ కఠిన నిబంధనలు ఎప్పటిలాగే అమల్లో ఉంటాయి. ఇదిలా వుంటే ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు అది కూడా విసుగు తెప్పిస్తోంది. కాబట్టి ఎప్పుడూ ఆడే గేమ్స్, ఫోన్ కాల్స్, వీడియో చాటింగ్ పక్కనపెట్టి సరదాగా ఈ పజిల్‌ను పరిష్కరించండి. (లాక్డౌన్: రోడ్లపై అడవి జంతువుల కలకలం) పైన కనిపిస్తున్న చిరుత ఏం దాస్తుందో చెప్పుకోండి? అయితే మీరు ఫొటోను ఎంత తీక్షణంగా చూసినా అక్కడ ఏమీ కనిపించదు. ఎందుకంటే మీకు సమాధానం దొరకాలంటే పూర్తి వీడియోను చూడాల్సిందే. అటవీ అధికారి సుశాంత్ నందా గురువారం ఉదయం ట్విటర్లో చిరుతపులి వీడియోను షేర్ చేశాడు. ఇందులో అది ఓ చెట్టు కింద ఉన్న రాయిపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. ఏదో ఆలోచిస్తున్నదానివలె నిశ్శబ్ధంగా కొన్ని సెకండ్లపాటు రాయిలా ఉండిపోయింది. ఇంతలో వెనక నుంచి పులి పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర గారాలు పోతోంది. దీంతో వాటి మధ్య ప్రేమను చూసిన నెటిజన్ల మనసు పులకరించిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. పదిహేను సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (తోడు కోసం 2వేల కి.మీ నడిచిన పులి) -
రోడ్డుపై ఆటలాడిన చిరుత పులి పిల్లలు
అడవిలో తిరిగే జంతువులు రోడ్లపై కనిపిస్తే చాలు.. వెంటనే వాటిని కెమెరాల్లో బంధిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో చిరుతపులి, తన రెండు పిల్లలతో కలిసి రోడ్డు దాటుతోంది. ఇంతలో అందులోని ఓ బుల్లి చిరుతకు ఏదో గుర్తొచ్చినదానిలా రోడ్డుపైనే ఆగిపోయింది. అక్కడే తచ్చాడుతూ అటూ ఇటూ దిక్కులు చూడసాగింది. ఇది గమనించిన తల్లి వెనక్కు వచ్చి తీసుకుపోదామని చూసింది. అయితే కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు మరో పిల్ల చిరుత కూడా రోడ్డుమీదకు చేరి గెంతులేయడం ప్రారంభించింది. దీంతో ఈ ఇద్దరు పిల్లలతో వేగలేననుకున్న తల్లి విసుగు చెంది అక్కడ నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నించబోయింది. (వైరల్: ఈ ఫోటోలో పాము కనిపించిందా!) ఇంతలో వెంటనే ఆ రెండు పిల్లలు పరుగెత్తుకుంటూ తల్లి ఒడిని చేరి తాము అమ్మకూచిలమంటూ చాటుకున్నాయి. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇది మన దేశంలో జరిగుండకపోవచ్చని, ఆఫ్రికాలోని సఫారీ పార్క్‌లో సన్నివేశమని అభిప్రాయపడ్డాడు. నలభై నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉంటున్న జనాలు చిరుతపులి పిల్లల ఆట చూసి కాస్త సేదతీరుతున్నారు. తల్లితోనే ఆటలాడుతున్న వీటిని మొండి ఘటాలుగా అభివర్ణిస్తున్నారు. (అమెరికాలో పులికీ కరోనా!) -
చెన్నైకి చిరుత.. వయా థాయిలాండ్
సాక్షి, చెన్నై: చిరుతపులి కూనను దొంగచాటుగా తెచ్చిన ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు అరెస్ట్‌చేశారు. చెన్నైకి చెందిన మొహిద్దీన్(28) శనివారం వేకువజామున బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నైకి చేరుకున్నాడు. చేతిలో చిన్న వెదురుబుట్టతో విమానాశ్రయంలో సంచరిస్తున్న మొహిద్దీన్ను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. వెదురు బుట్టలో ఏముందని ప్రశ్నించగా కుక్కపిల్ల ఉందని బదులిచ్చాడు. పొంతనలేని సమాధానాలివ్వడంతో జంతు సంరక్షణ విభాగం వారిని అధికారులు పిలిపించారు. అది చిరుత కూన అని ఆ అధికారులు తేల్చారు. కూనను తిరిగి బ్యాంకాక్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిని ఇక్కడి ఓ సర్కస్ కంపెనీ కోసం తీసుకొచ్చినట్లు మొహిద్దీన్ చెప్పాడు. -
విమానంలో చిరుత పులి పిల్ల స్మగ్లింగ్
-
విమానంలో పులి పిల్ల.. పాలు పట్టిన సిబ్బంది
చెన్నై : చిరుత పులి పిల్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగేజ్ చెక్ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు ఇంటిలెజిన్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చెన్నైలోని ఆరినగర్ అన్నా జువాలాజికల్ పార్కుకు తరలించారు. కాగా భయంతో వణికిపోతున్న చిరుత పులి పిల్లను ఎయిర్‌పోర్టు సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. అనంతరం దానికి పాలు పట్టించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. -
ఫాంహౌస్‌లో చిరుత.. రక్షించిన అధికారులు
ఓ ఫాంహౌస్‌లో బంధించిన మూడు నెలల చిరుతపులి పిల్లను అటవీ శాఖ అధికారులు రక్షించారు. గుర్గావ్ శివార్లలో ఉన్న ఫాంహౌస్‌లో చిరుత పిల్ల ఉన్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. అక్కడ ఓ ఆడ చిరుత పిల్ల కనిపించింది. దానికి ముందువైపు కుడికాలు బాగా ఫ్రాక్చర్ అయ్యింది. దాన్ని ఇనుప గొలుసులతో బంధించడం లేదా బోనులో పెట్టడం చేసి ఉంటారని, అందుకే కాలు విరిగి ఉంటుందని పశువైద్యులు భావిస్తున్నారు. అయితే, గుర్గావ్ సమీపంలోని గైరత్‌పూర్ బస్ అనే గ్రామంలో పొదల వద్ద ఈ చిరుత పిల్ల కనిపించినట్లు అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆరావళి పర్వతశ్రేణి పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చిరుతలు ఎక్కువగా తిరుగుతుంటాయి. గుర్గావ్ వన్యప్రాణి సంరక్షణ విభాగం వాళ్లు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ చిరుత పిల్లను రక్షించారు. వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని గానీ, లేదా ఎవరైనా బంధించడం వల్ల గానీ మాత్రమే ఈ చిరుత పులి పిల్ల ఇంతలా గాయపడి ఉండాలని స్థానికులు వాదిస్తున్నారు. ఇది కనిపించిన ప్రాంతానికి సమీపంలో మూడు ఫాంహౌస్‌లు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు. తమ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆడ చిరుత, మగ చిరుత తిరుగుతుండేవని, ఇది వాటి పిల్లే అయి ఉంటుందని స్థానికులు చెప్పారు. దీన్ని ఎక్కడి నుంచి పట్టుకున్నారో అధికారులు స్పష్టంగా చెప్పడంలేదు కాబట్టి తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో చిరుత పిల్లను అక్కడి నుంచి తరలించేందుకు కూడా వాళ్లు అడ్డుపడ్డారు.