న్యూఢిల్లీ: లాక్‌డౌన్ వల్ల జనాలు నెలన్నర రోజులకు పైగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని సడలింపులు ఇస్తూ ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తున్నారు. అయితే షరతులు వర్తిస్తాయి. అన్ని రంగాల వారికి అనుమతులు లేవు, పైగా రెడ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు వీల్లేదు. "యధా రెడ్ జోన్ తధా లాక్‌డౌన్" అన్నచందంగా అక్కడ కఠిన నిబంధనలు ఎప్పటిలాగే అమల్లో ఉంటాయి. ఇదిలా వుంటే ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు అది కూడా విసుగు తెప్పిస్తోంది. కాబట్టి ఎప్పుడూ ఆడే గేమ్స్, ఫోన్ కాల్స్, వీడియో చాటింగ్ పక్కనపెట్టి సరదాగా ఈ పజిల్‌ను పరిష్కరించండి. (లాక్‌డౌన్: రోడ్లపై అడవి జంతువుల కలకలం)
పైన కనిపిస్తున్న చిరుత ఏం దాస్తుందో చెప్పుకోండి? అయితే మీరు ఫొటోను ఎంత తీక్షణంగా చూసినా అక్కడ ఏమీ కనిపించదు. ఎందుకంటే మీకు సమాధానం దొరకాలంటే పూర్తి వీడియోను చూడాల్సిందే. అటవీ అధికారి సుశాంత్ నందా గురువారం ఉదయం ట్విటర్‌లో చిరుతపులి వీడియోను షేర్ చేశాడు. ఇందులో అది ఓ చెట్టు కింద ఉన్న రాయిపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. ఏదో ఆలోచిస్తున్నదానివలె నిశ్శబ్ధంగా కొన్ని సెకండ్లపాటు రాయిలా ఉండిపోయింది. ఇంతలో వెనక నుంచి పులి పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర గారాలు పోతోంది. దీంతో వాటి మధ్య ప్రేమను చూసిన నెటిజన్ల మనసు పులకరించిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. పదిహేను సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (తోడు కోసం 2వేల కి.మీ నడిచిన పులి)
Comments
Please login to add a commentAdd a comment