అడవిలో తిరిగే జంతువులు రోడ్లపై కనిపిస్తే చాలు.. వెంటనే వాటిని కెమెరాల్లో బంధిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో చిరుతపులి, తన రెండు పిల్లలతో కలిసి రోడ్డు దాటుతోంది. ఇంతలో అందులోని ఓ బుల్లి చిరుతకు ఏదో గుర్తొచ్చినదానిలా రోడ్డుపైనే ఆగిపోయింది. అక్కడే తచ్చాడుతూ అటూ ఇటూ దిక్కులు చూడసాగింది. ఇది గమనించిన తల్లి వెనక్కు వచ్చి తీసుకుపోదామని చూసింది. అయితే కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు మరో పిల్ల చిరుత కూడా రోడ్డుమీదకు చేరి గెంతులేయడం ప్రారంభించింది. దీంతో ఈ ఇద్దరు పిల్లలతో వేగలేననుకున్న తల్లి విసుగు చెంది అక్కడ నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నించబోయింది. (వైరల్: ఈ ఫోటోలో పాము కనిపించిందా!)
ఇంతలో వెంటనే ఆ రెండు పిల్లలు పరుగెత్తుకుంటూ తల్లి ఒడిని చేరి తాము అమ్మకూచిలమంటూ చాటుకున్నాయి. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇది మన దేశంలో జరిగుండకపోవచ్చని, ఆఫ్రికాలోని సఫారీ పార్క్‌లో సన్నివేశమని అభిప్రాయపడ్డాడు. నలభై నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. లాక్‌డౌన్ వల్ల ఇంట్లో ఉంటున్న జనాలు చిరుతపులి పిల్లల ఆట చూసి కాస్త సేదతీరుతున్నారు. తల్లితోనే ఆటలాడుతున్న వీటిని మొండి ఘటాలుగా అభివర్ణిస్తున్నారు. (అమెరికాలో పులికీ కరోనా!)
Comments
Please login to add a commentAdd a comment