African safari
-
భారత సైన్యం చేస్తున్న మేలు..!
ప్రపంచం 21వ శతాబ్దంలో ఉంది. విశ్వమంతా అరచేతిలో ఇమిడిపోయినంత టెక్నాలజీతో స్మార్ట్‌గా జీవిస్తోంది ప్రపంచం. మదిలో మెదిలిన సందేహానికి సమాధానాన్ని నిమిషంలో తెలుసుకోగలిగినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయినప్పటికీ గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియని జీవితాలు ఇంకా ఉన్నాయి. భారతీయ సైన్యంలో మహిళల బృందం ఇటీవల వారిని సమావేశపరిచి ప్రెగ్నెన్సీ అవేర్నెస్ సెషన్ నిర్వహించింది. అత్యంత ఆసక్తిగా వినడంతోపాటు ఇంత వరకు తమకు ఈ సంగతులు చెప్పిన వాళ్లు లేరని, మొదటిసారి వింటున్నామని ఆనందం వ్యక్తం చేశారా మహిళలు. ఇంతకీ ఇంతటి వెనుకబాటులో మగ్గిపోతున్న వాళ్లెవరంటే ఆఫ్రికా ఖండంలోని అబేయీ వాసులు. ఆల్ ఉమెన్ ప్లాటూన్ చొరవ సూడాన్, సౌత్ సూడాన్ల మధ్య తలెత్తిన వివాదంలో అబేయీ నలిగిపోతోంది. అబేయీలో శాంతి స్థాపన కోసం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనదేశం నుంచి గత ఏడాది ఆల్ ఉమెన్ ప్లాటూన్ అబేయీలో అడుగుపెట్టింది. ఆ బృందం పేరు ‘యునైటెడ్ నేషన్స్ ఇంటిరిమ్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ అబేయీ (యూనిస్ఫా)’. మన మహిళా సైనికులు అబేయీలో శాంతి స్థాపనతోపాటు ప్రజారోగ్యం కోసం కూడా పని చేస్తోంది. అందులో భాగంగా కెప్టెన్ జస్ప్రీత్ కౌర్, ఇండియన్ బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ మేజర్ అభిజిత్ ఎస్‌లు అబేయీలోని రుమాజక్ గ్రామంలో స్థానిక మహిళలను సమావేశపరిచి వారికి గర్భధారణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణి తీసుకోవాల్సిన పోషకాహారం, ఈ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్‌లు, ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో తీసుకోవాల్సిన శ్రద్ధ మొదలైన విషయాలను వివరించారు. సేఫ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ గురించి బొమ్మలతో వివరిస్తూ ప్రచురించిన చిన్న పుస్తకాలను కూడా పంచారు. భారతీయ సైనిక మహిళల బృందం చొరవను, స్థానిక మహిళల ఆనందాన్ని యూఎన్ మిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. (చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..) -
1,300 కిలోల ఆఫ్రికన్ స్కార్పియన్ చేపలు స్వాధీనం
అన్నానగర్: రామనాథపురంలో బుధవారం వేకువజామున 1,300 కిలోల అరుదైన ఆఫ్రికన్ స్కార్పియన్ చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. రామనాథపురం ఫుడ్‌సేప్టీ ఆఫీసర్ లింగవేల్ పట్టణం ఖాతన్ ప్రాంతంలో ట్రాలీ దుకాణాలు, రోడ్డు పక్కన ఉన్న అంగళ్లపై బుధవారం వేకువజామున దాడులు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో నిలిపివున్న కార్గో వాహనంలో సోదాలు చేశారు. ఈ వాహనంలో మన ప్రభుత్వం నిషేధించిన స్కార్పియన్ చేపలను ఆఫ్రికా నుంచి పెద్ద మొత్తంలో తీసుకెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బార్బర్ టు సైబర్ క్రిమినల్!
సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా లండన్‌లో నివసిస్తున్న కృష్ణకుమార్‌గా నగర యువతికి పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి, కస్టమ్స్ అధికారుల డ్రామా ఆడి రూ.10.65 లక్షలు కాజేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన ఆఫ్రికా జాతీయుడు కాబ్రెల్ ఎడ్మాండో సైబరాబాద్ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. జీడిమెట్లకు చెందిన వ్యాపారి నుంచి గతేడాది రూ.46.35 కాజేసింది కూడా ఇతడేనని ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ గుర్తించారు. దీంతో ఇతడిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబ్రెల్ కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన వ్యాపారి మనోహర్‌కు గతేడాది మే 13న వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. లండన్‌లోని బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన ఎలిజిబెత్ జియోబార్జ్ పేరుతో ఇది వచ్చింది. తమ కంపెనీకి భారత్ నుంచి నిత్యం బయాస్మా యాక్టివ్ లిక్విడ్ సరఫరా అవుతుందని అందులో పేర్కొన్నాడు. దీన్ని తమకు నాగ్‌పూర్ కేంద్రంగా పని చేసే కేఎస్ ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తోందని జియోబార్జ్ చెప్పాడు. అనివార్య కారణాల వల్ల తాము నేరుగా ఖరీదు చేయలేకపోతున్నామన్నాడు. ఆ సంస్థ నుంచి మీరు సమీకరించుకుని మాకు సరఫరా చేస్తే లీటర్ రూ.95 వేలకు ఖరీదు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ 300 లీటర్లకు పర్చేజ్ ఆర్డర్ కూడా పంపాడు. ఇది చూసిన మనోహర్ కేఎస్ ఎంటర్ప్రైజెస్ వివరాలు కోరాడు. జియోబార్జ్ రెండు ఫోన్ నెంబర్లను పంపాడు. బాధితుడు వీటిలో సంప్రదించగా ఆ సంస్థకు చెందిన వారుగా ఇద్దరు మాట్లాడారు. తనకు ఒక లీటర్ బయాస్మా యాక్టివ్ లిక్విడ్ పంపాలని కోరడంతో వాళ్లు పంపారు. దీన్ని ఈయన జియోబార్జ్ చెప్పిన వారికి మహారాష్ట్రలోనే అందించాడు. బరోన్స్ లేబొరేటరీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులుగా చెప్పుకున్న వాళ్లు సదరు ఆయిల్ పరీక్షించామని, నాణ్యమైనదిగా తేలిందని చెప్పారు. తొలిదఫా 300 లీటర్లు పంపితే లండన్ చేరుస్తామన్నారు. దీంతో మనోహర్ మళ్లీ కేఎస్ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించారు. తనకు ఆ పరిమాణంలో బయాస్మా యాక్టివ్ లిక్విడ్ కావాలని ఆర్డర్ చేశాడు. దీని నిమిత్తమంటూ ఆయన నుంచి రూ.46,35,600 ఆన్లైన్లో కాజేసిన నిందితులు ఆపై తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిపై బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది అక్టోబర్ 14న కేసు నమోదైంది. కాబ్రెల్ ఎడ్మాండో ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని విచారించిన నేపథ్యంలోనే అప్పట్లో జియోబార్జ్గా నగదు కాజేసింది సైతం ఇతడేనని బయటపడింది. ఇతడిని తదుపరి దర్యాప్తు నిమిత్తం సిటీ సైబర్ కాప్స్ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇది పూర్తయిన తర్వాత సైబరాబాద్ అధికారులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. (చదవండి: చూసి నేర్చుకుంటున్నారు! పిల్లల మత్తుకు పెద్దలే కారణం) -
పుట్టిన 20 నిమిషాలకే నిలబడి.. గంటకే నడక!!
‘ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగూ.. అంటూ రోజూ ఒకే పాటను యూట్యూబ్‌లో చూసి చూసి విసిగిపోయి ఉన్నాడు చిట్టిగాడు. ఫోన్ పక్కనపడేసి కిచెన్‌లో ఉన్న అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ‘అమ్మా.. మంచి ఏనుగు కథ చెప్పమ్మా? అంటూ మారాం చేశాడు. చిట్టిగాడి అల్లరి భరించలేం అనుకున్న లలిత.. పద్నాలుగు సింహాలను తరిమిన గున్న ఏనుగు కథ చెప్పడం మొదలుపెట్టింది. అనగనగా ఒక అడవి. ఒకనాడు ఒక గున్న ఏనుగు తన తల్లి నుంచి తప్పిపోయింది. ఆకలితో ఉన్న ఓ సింహాల గుంపు కంట పడడంతో.. ఆ పిల్లను తరమడం ప్రారంభించాయి. ఒకేసారి 14 సింహాలను చూసినా అది భయపడలేదు. ధైర్యంగా తన శక్తిమేర ప్రాణాల కోసం పోరాడింది. అక్కడే ఉన్న వాగు నీళ్లలోకి అస్తమానం పరిగెడుతూ.. బయటకు వస్తూ సింహాలను తరిమి కొట్టింది. చేసేది ఏం లేక సింహాలు దూరంగా నిల్చుని చూస్తూ ఉండిపోయాయి.. అంటూ చెప్తూ పోతోంది. ఇంతకీ ఆ గున్న వాళ్ల అమ్మతో కలిసిందా అమ్మా? అని ఆత్రుతగా అడిగాడు చిట్టిగాడు. అయితే ఇది వాస్తవ ఘటన. ఏడేళ్ల క్రితం జాంబియా సౌత్ లువాంగ్వా ‘నార్మన్ కార్’ సఫారీలో జరిగిందని వార్తలో చదివింది లలిత. ఆపద సమయంలో ధైర్యం ప్రదర్శించిన ఆ గున్న ఏనుగు పేరు ‘హెర్క్యులస్’(గ్రీకు పురాణగాథల్లో వినిపించే వీరుడి పేరు)గా ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది కూడా. ఆ వివరాలను సెల్ఫోన్లో వెతుకుతున్నప్పుడు.. ఇవాళ(ఆగష్టు12న) World Elephant Day అని కనిపించింది లలితకు. ‘చిట్టీ.. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే రా. అంటే ఇవాళ ఏనుగుల రోజు. కాబట్టి, వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తా’ అంటూ మొదలుపెట్టింది వాళ్ల అమ్మ. ► ఏనుగును వాళ్ల అమ్మ 22 నెలలు కడుపులో మోస్తుంది. పుట్టిన వెంటనే అవి నడుస్తాయి చిట్టీ(చిట్టీ నోరెళ్ల బెట్టి చూస్తూ.. వింటున్నాడు). అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన 20 నిమిషాలకే లేచి నిలబడతాయి. గంటకే నడుస్తాయి కూడా. రెండు రోజుల తర్వాత మందలో కలిసి ముందుకెళ్తాయి. అలా ఉన్నాయి కాబట్టే అవి గుంపుగా బతకగలుగుతున్నాయి. తిండి-నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్లగలుగుతున్నాయి. చైనాలో వందల కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగుల మంద.. హాయిగా విశ్రాంతి తీసుకున్న ఫొటో ►ఈ భూమ్మీద అతిపెద్ద జీవి.. ఆఫ్రికన్ ఏనుగు చిట్టీ. పుట్టినప్పుడే వాటి బరువు 120 కేజీలు ఉంటుంది. పెద్దవి 3 మీటర్ల ఎత్తు.. 6000 కేజీలకు పైగా బరువు ఉంటాయవి. ఏనుగులు పూర్తిగా ఎదగడానికి 35-40 సంవత్సరాల టైం పడుతుంది. అలాగే అవి 60-70 సంవత్సరాలు బతుకుతాయి. ►ఈ భూమ్మీద ఏనుగులు రెండు రకాలు ఉన్నాయి చిట్టీ. ఒకటి ఆఫ్రికన్ ఏనుగులు.. రెండోది ఆసియన్ ఏనుగులు. ఇవే చాలా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ‘మరి వాటిని ఎలా గుర్తుపట్టడం అమ్మా?’ అంటూ అడిగాడు చిట్టి. ఆఫ్రికన్ ఏనుగుల తొండం చివర రెండు వేళ్ల మాదిరి ఉంటుంది. అదే ఆసియన్ ఏనుగులకు ఒకటే ఉంటుంది. ఇక ఈ తొండంలో ఎనిమిది లీటర్ల నీళ్ల దాకా పడతాయి. తొండం సాయంతోనే నీళ్లు తాగుతాయి. ఆహారం తీసుకుంటాయి. స్నానాలు చేసేటప్పుడు మగ్గులా కూడా వాడుకుంటాయి. ►ఏనుగుల శరీరంపై చర్మం చాలా భాగాల్లో మందంగా(2.5 సెంటీమీటర్ల) ఉంటుంది. దుమ్ము, బురద స్నానాలతో సూర్య కిరణాల నుంచి వేడి నుంచి తమను తాము కాపాడుకుంటాయవి. ►ఏనుగులు మంచి తిండిబోతులు. రోజూలో 18 గంటలు తింటూనే ఉంటాయి. వదిలేస్తే ఒకరోజులో 150 కేజీల ఫుడ్డు తినేస్తాయి. అందులో సగం అరగకుండానే బయటకు వచ్చేస్తుంది. ►ఏనుగుల ఎముకలు భూమి నుంచి వచ్చే శబ్దాలను కూడా గ్రహిస్తాయి తెలుసా?.. చిట్టీ. అవి మాట్లాడుకోవడం అంతా వేరేలా ఉంటుంది. ఏనుగు అరిస్తే(ఘీంకారం) మైళ్ల దూరం వినిపిస్తుంది. వీటి సాయంతోనే అవి మాట్లాడుకుంటాయి. అలాగే వాటికంటూ ఒక వాసన పెట్టుకుంటాయి. కుక్కల కంటే ఇవి వాసనను బాగా పసిగడతాయి. పేడ సాయంతో వాటి మంద ఎటు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకుంటాయి కూడా. ►ఏనుగులు ఎమోషనల్ జీవులు. తొందరగా మనుషులతో కలిసిపోతాయి. ప్రేమగా ఉంటాయి. జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏ విషయాన్నైనా బాగా గుర్తు పెట్టుకుంటాయి.(మెదడులో ఉండే టెంపోరల్ లోబ్ వల్లే ఇదంతా). థాయ్‌లాండ్‌లో ఆ మధ్య ఒక ఏనుగు ఓ ఇంటి వంటగది పగలకొట్టి.. అంతా తినేసింది. ఆ ఏనుగు ఇప్పుడు మళ్లీ అదే ఇంటికి వచ్చి గోడను పగలకొట్టి.. మళ్లీ తినేసింది చూడు. అంత బాగా ఉంటుంది వాటికి మెమరీ. Remember the elephant that went viral in June for smashing through a home in Thailand? Well the same elephant just did it again — to the same people. pic.twitter.com/BxZjHux68n — NowThis (@nowthisnews) August 10, 2021 ►ఏనుగులు మచ్చిక జీవులు. సాధారణంగా వాటికి కోపం రాదు. ఎవరైనా కవ్వించాలని ప్రయత్నిస్తేనే.. అవి ప్రతిదాడులకు దిగుతాయి. పాపం.. ఒక ఏనుగును కాపాడుకోవడానికి.. మిగతావి ప్రాణాలను పణంగా పెడుతుంటాయి కూడా. ►పాపం.. ఎంత పెద్ద జీవి అయినా ఏం లాభం. ఒకప్పుడు ఎంతో పెద్దగా ఉండే ఏనుగుల సంఖ్య.. బాగా తగ్గిపోయింది. ఆఫ్రికన్-ఆసియన్ ఏనుగులు చాలా తగ్గిపోయాయి(90,50 శాతాలు) ఆఫ్రికన్ ఏనుగులు 4 లక్షల దాకా ఉండగా, ఆసియన్ ఏనుగులు కేవలం 45 వేలే ఉన్నాయి!. అందుకే వాటిని కాపాడేందుకు ఆగష్టు 12న వరల్డ్ ఎలిఫెంట్ డే చేస్తున్నారు చిట్టీ. వాటర్ టబ్‌లో ఇరుకున్న గున్న ఏనుగును కాపాడే ప్రయత్నం(పాత ఫొటో) ►‘మరి ఏనుగు తెల్ల కొమ్ముల సంగతి ఏంటమ్మా?’ అంటూ అమాయకంగా అడిగాడు చిట్టి. దానికి లలిత నవ్వుతూ.. వాటిని కొమ్ములు అనరు.. దంతాలు అంటారు. అంటే నీ నోట్లో పండ్లలాంటివి. ఏనుగులకు రెండేళ్ల నుంచి ఇవి పెరగడం మొదలవుతుంది. తినేటప్పుడు కొమ్మల్ని చీల్చడానికి, వేళ్లను పెకలించడానికి సాయపడతాయి. అంతేకాదు ఒకాదానితో మరొకటి కొట్లాడుకున్నప్పుడు ఆత్మ రక్షణ కోసం ఉపయోగించుకుంటాయి. పాపం.. వీటి కోసమే వేటగాళ్లు వాటిని చంపుతుంటారు అనడంతో ‘అయ్యో పాపం’ అంటూ జాలిగా ‘ఊ’ కొట్టాడు చిట్టీ. అన్నట్లు కథలో ముందు చెప్పుకున్న హెర్క్యులస్ వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. తన మందతో ప్రశాంతంగా జీవిస్తోందని చెప్పడంతో చిట్టీ ముఖంలో నవ్వు కనిపించింది. ఏనుగుల సంరక్షణ.. ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చే దేశం థాయ్‌లాండ్. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్=కెనడా ఫిల్మ్‌మేకర్ పాట్రిసియా సిమ్స్ కలిసి ఈ డేను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. సిమ్స్ వరల్డ్ ఎలిఫెంట్ సొసైటీకి అధ్యక్షురాలు కూడా. ఏనుగుల పరిరక్షణ, వేటను అడ్డుకోవడం, వాటి దంతాల అక్రమ రవాణాను నివారించడం, జనావాస ప్రాంతాల్లో వాటి దాడులను ఎలా అడ్డుకోవడం, మదం(హార్మోనుల రిలీజ్) టైంలో ఎలా ప్రవర్తించడం, వాటి మానాన వాటిని ఎలా బతకనివ్వడం.. ఇలాంటి అంశాలపై సుమారు 100కి పైగా పని చేస్తున్న సంస్థలు ప్రజల్లో అవగాహన నింపడానికి ప్రయత్నిస్తుంటాయి ఇవాళ. -సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
‘వరల్డ్‌ఫేమస్’ మృగరాజు, చైనా వరాహం.. ఇక లేవు
ముఖంపై గాటు, క్రూరమైన చూపులు, హుందాగా వ్యవహరించే తీరు.. వెరసి విలక్షణమైన లక్షణాలతో గుర్తింపు పొందిన ఆఫ్రికన్ సింహం ‘స్కార్ఫేస్’ ఇక లేదు. 14 ఏళ్ల మగ సింహం.. అనారోగ్యంతో చనిపోయినట్లు సఫారీ నిర్వాహకులు ధృవీకరించారు. కెన్యాలోని మసాయి మారా గేమ్ రిజర్వ్‌లో ఇది ఇంతకాలం బతికింది. కాగా, కుడికన్ను పక్కన గాటుతో ఉండే ఈ సింహాన్ని.. లయన్‌కింగ్ దుష్ట సింహం ‘స్కార్’ క్యారెక్టర్‌తో పోలుస్తుంటారు చాలా మంది. ఇదే టూరిస్టుల్లో ఈ సింహానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. చనిపోయే ముందు అది తాను పుట్టిన ప్రాంతంవైపు నడిచిందని, దురదృష్టవశాత్తూ గమ్యానికి 15 కిలోమీటర్ల అది చనిపోయిందని సఫారీ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో స్కార్ఫేస్ మీద బీబీసీ, నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ లాంటి చానెల్స్ ఎన్నో డాక్యుమెంటరీలను తీశాయి కూడా. సెన్సేషన్ పిగ్ కూడా.. చైనా హీరో పిగ్ ఇక లేదు. జూన్ 14న అది చనిపోయినట్లు దాని సంరక్షకులు వైబో ద్వారా ప్రకటించారు. 2008లో చైనా భారీ భూకంపం తర్వాత ఓ భారీ పంది ఫేమస్ అయ్యింది. సిచువాన్ ప్రావిన్స్‌లో దాదాపు 36 రోజుల తర్వాత శకలాల నుంచి అది ప్రాణాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జు జియాంగియాంగ్ అనే పేరుతో జనాలు ముద్దుగా పిల్చుకునే ఆ పంది.. అన్నిరోజులపాటు వర్షం నీళ్లు, కాల్చిన బొగ్గు తిని అంతకాలం ప్రాణాల్ని నిలబెట్టుకోగలిగింది. విపత్కరకాలంలో ఎలా బతకాలో జియాంగియాంగ్‌ను చూసి నేర్చుకోవాలని పేర్కొంటూ చైనావాళ్లు దానిని ‘హీరోయిక్ పిగ్’గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత ఓ మ్యూజియం నిర్వాహకులు ఇంతకాలం దాని సంరక్షణ చూస్తూ వచ్చారు. చదవండి: గుంపుగా అడవి దున్నలు-సింగిల్‌గా సింహం, ఆ తర్వాత.. -
ఆటలాడిన చిరుత పులి పిల్లలు
-
రోడ్డుపై ఆటలాడిన చిరుత పులి పిల్లలు
అడవిలో తిరిగే జంతువులు రోడ్లపై కనిపిస్తే చాలు.. వెంటనే వాటిని కెమెరాల్లో బంధిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో చిరుతపులి, తన రెండు పిల్లలతో కలిసి రోడ్డు దాటుతోంది. ఇంతలో అందులోని ఓ బుల్లి చిరుతకు ఏదో గుర్తొచ్చినదానిలా రోడ్డుపైనే ఆగిపోయింది. అక్కడే తచ్చాడుతూ అటూ ఇటూ దిక్కులు చూడసాగింది. ఇది గమనించిన తల్లి వెనక్కు వచ్చి తీసుకుపోదామని చూసింది. అయితే కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు మరో పిల్ల చిరుత కూడా రోడ్డుమీదకు చేరి గెంతులేయడం ప్రారంభించింది. దీంతో ఈ ఇద్దరు పిల్లలతో వేగలేననుకున్న తల్లి విసుగు చెంది అక్కడ నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నించబోయింది. (వైరల్: ఈ ఫోటోలో పాము కనిపించిందా!) ఇంతలో వెంటనే ఆ రెండు పిల్లలు పరుగెత్తుకుంటూ తల్లి ఒడిని చేరి తాము అమ్మకూచిలమంటూ చాటుకున్నాయి. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇది మన దేశంలో జరిగుండకపోవచ్చని, ఆఫ్రికాలోని సఫారీ పార్క్‌లో సన్నివేశమని అభిప్రాయపడ్డాడు. నలభై నాలుగు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉంటున్న జనాలు చిరుతపులి పిల్లల ఆట చూసి కాస్త సేదతీరుతున్నారు. తల్లితోనే ఆటలాడుతున్న వీటిని మొండి ఘటాలుగా అభివర్ణిస్తున్నారు. (అమెరికాలో పులికీ కరోనా!) -
నాతోనే పరాచికాలా..?!
నేను మృగరాజును.. నాతోనే పరాచికాలా అన్నట్లు.. సింహం ప్రవర్తిస్తున్నట్లు ఉంది. జూకు వెళ్తేనే ఎంతో జాగ్రత్తగా సింహాలు, పులులను చూస్తాం. అటువంటిది.. నడి రోడ్డుమీద విలాసంగా.. రాజసంతో విశ్రమిస్తున్న ఈ సంహం దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్రికన్ సఫారీ... సింహాలకు, పులులకు పెట్టింది పేరు. రహదారి లో రాజసంతో విశ్రమిస్తుంటాయి.. మృగరాజులు. ఆఫ్రికన్ సఫారీలో వాహనాలకు హారన్‌ను చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు. జంతువులకు ఏ మాత్రం అలజడి కనిపించినా.. అవి చాలా విపరీతంగా ప్రవర్తిస్తాయి. తాజాగా కొందరు చిన్నారులతో కలిసి ఆఫ్రికన్ సఫారికి వెళ్లారు. రోడ్డు మీద సింహాలు నిద్రిస్తున్నాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా.. తమ వాహనాలను రోడ్డుకు పక్కగా వాహనదారులు ఆపేశారు. ఇద్దరు చిన్నారులు.. కార్ అద్దాలు తెరచి.. సింహాలను ఫొటోలు తీసే ప్రయత్నం చేశారు. ఫొటో క్లిక్, ఫ్లాష్ రావడంతో సింహాలు ఒక్కసారిగా పైకి లేచాయి. అయితే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వాటంతట అవి పక్కకు వెళ్లాయి. ఎవరిమీద దాడి చేస్తాయన్నభయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్షణాలను లెక్కపెట్టుకుంటూ వాహనదారులు సమయం గడిపారు. -
నాతోనే పరాచికాలా..?!
-
సింహాలకు తొడ కొట్టొచ్చు!
ఆఫ్రికన్ సఫారీ సఫారీకి ఆఫ్రికన్ల పేరు గేమింగ్. వేల ఎకరాల్లో విస్తరించిన ప్రయివేటు అరణ్యాలే గేమ్ లాడ్జ్‌లు. కనీసం 10-15 వేల ఎకరాల్లో ప్రైవేట్ అడవి. దాన్నిండా జంతువులు. దాన్లో ఓ ఐదెకరాల్లో చిన్న రిసార్ట్. జంతువులు రిసార్ట్‌లోకి రాకుండా కంచె. ఇదే గేమ్లాడ్జ్ స్వరూపం. దక్షిణాఫ్రికాతో పాటు అక్కడి జాంబియా, తూర్పు ఆఫ్రికన్ దేశాలైన టాంజానియా, కెన్యాల్లో గేమ్ లాడ్జ్‌లకు కొదవ లేదు. దక్షిణాఫ్రికాలో ప్రయివేటు గేమ్ లాడ్జ్‌లు ఎన్నున్నా... 20 వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన క్రూగర్ నేషనల్ పార్క్‌దే ప్రత్యేక స్థానం. ఇక అక్కడికి వెళ్లటమంటూ జరిగితే... అందాల కేప్‌టౌన్ సిటీతో పాటు ప్రపంచ వింతల్లో ఒకటైన టేబుల్ మౌంటెయిన్, పెంగ్విన్స్ బీచ్, ప్రపంచ ప్రఖ్యాత సన్‌సిటీ వంటివి కూడా సందర్శించిన ఖాతాలో వేసేయొచ్చు. సన్‌సిటీలో జిప్‌డ్రైవ్, మౌంటెయిన్ బైకింగ్... జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాల్సిన సాహసకార్యాలే. అదే టాంజానియాకెళితే... గేమింగ్‌కు మక్కా లాంటి సెరెంగెటి నేషనల్ పార్క్‌తో పాటు కిలీమాంజారో పర్వతాలనూ చుట్టేయొచ్చు. పక్కనే ఉన్న కెన్యాలోనూ గేమ్ పార్క్లకైతే కరువేలేదు. ఇవి చూడాలి సుమా! * తమ దగ్గర ‘బిగ్ 5’ ఉన్నట్లు పలు గేమ్లాడ్జ్లు ప్రచారం చేసుకుంటాయి. అంటే... ఏనుగు, సింహం, పులి, బఫెలో, ఖడ్గమృగం ఉన్నట్లన్న మాట. * గేమ్ పార్క్‌లలో దోమల బెడద ఎక్కువే. చాలా పార్క్‌లు తగు చర్యలు తీసుకుని తమది ‘మలేరియా లేని’ పార్క్‌గా చెబుతుంటాయి. వెళ్ళేదెలా? * దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్‌బర్గ్‌కు దేశంలో ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నేరుగా విమానాలున్నాయి. కాకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానం ఢిల్లీ, ముంబైల్లో ఎక్కడో ఓ చోట ఆగుతుంది. * కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే రెండువైపులా కలిపి ఒక వ్యక్తికి విమాన ఛార్జీలు రూ.40వేలు మించవు. * ఆఫ్రికాలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఒకరకంగా జొహన్నెస్‌బర్గ్ విమానాశ్రయం జంక్షన్లాంటిది. అక్కడి నుంచి ప్రతి ఆఫ్రికన్ దేశానికీ విమానాలుంటాయి. * ఇక గేమ్ లాడ్జ్ ఛార్జీలనేవి అక్కడ మనం ఉండే రోజులు... రోజుకు ఎన్ని సార్లు గేమింగ్‌కు వెళతాం? అక్కడ ఏఏ సౌకర్యాల్ని ఆశిస్తాం అనేదానిపై ఆధారపడి ఉంటాయి. * షూగర్ నేషనల్ పార్క్‌లో గేమింగ్ ఫుల్ డే అయితే ఒకరికి రూ.7,000 నుంచి, హాఫ్‌డే అయితే రూ.6,300 నుంచి మొదలవుతాయి. * వసతి విషయానికొస్తే ఒకరికి రూ.3-4వేలలో మొదలయ్యే చిన్న కాటేజీల నుంచి రోజుకు రూ.లక్ష వసూలు చేసే హోటళ్లూ ఈ పార్క్‌లో ఉన్నాయి. చేరుకునేదిలా... * జొహన్నెస్‌బర్గ్ ఎయిర్‌పోర్టు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో క్రూగర్ నేషనల్ పార్క్ ఉంటుంది. సుమారు 4 గంటల ప్రయాణం. అలా కాదనుకున్నవారికి జొహన్నెస్‌బర్గ్ నుంచి క్రూగర్‌కు విమానాలు కూడా ఉన్నాయి. * దక్షిణాఫ్రికా గేమింగ్‌ను ప్యాకేజీలో భాగంగా అందిస్తున్న ట్రావెల్ సంస్థలూ ఉన్నాయి. ఏ సీజన్ బెటర్? * నిజానికి ఏ నెల్లోనైనా దక్షిణాఫ్రికాకు వెళ్లొచ్చు. ఏప్రిల్ - అక్టోబరు మధ్య సీజన్‌ను అత్యుత్తమంగా చెబుతారు. నవంబరు - మార్చి మధ్య కాలం కూడా మరీ ప్రతికూలమైనదేమీ కాదు. * జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉదయం- రాత్రి వేళల్లో కాస్త చలి బాగా ఉంటుంది. ఏప్రిల్-మే, సెప్టెంబరు-అక్టోబరు సమయం సమశీతోష్ణంతో ఉంటుంది.