![lions on road](/styles/webp/s3/article_images/2017/10/14/lion.jpg.webp?itok=0gBcYA3x)
నేను మృగరాజును.. నాతోనే పరాచికాలా అన్నట్లు.. సింహం ప్రవర్తిస్తున్నట్లు ఉంది. జూకు వెళ్తేనే ఎంతో జాగ్రత్తగా సింహాలు, పులులను చూస్తాం. అటువంటిది.. నడి రోడ్డుమీద విలాసంగా.. రాజసంతో విశ్రమిస్తున్న ఈ సంహం దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి.
ఆఫ్రికన్ సఫారీ... సింహాలకు, పులులకు పెట్టింది పేరు. రహదారి లో రాజసంతో విశ్రమిస్తుంటాయి.. మృగరాజులు. ఆఫ్రికన్ సఫారీలో వాహనాలకు హారన్‌ను చాలా తక్కువగా ఉపయోగిస్తుంటారు. జంతువులకు ఏ మాత్రం అలజడి కనిపించినా.. అవి చాలా విపరీతంగా ప్రవర్తిస్తాయి.
తాజాగా కొందరు చిన్నారులతో కలిసి ఆఫ్రికన్ సఫారికి వెళ్లారు. రోడ్డు మీద సింహాలు నిద్రిస్తున్నాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా.. తమ వాహనాలను రోడ్డుకు పక్కగా వాహనదారులు ఆపేశారు. ఇద్దరు చిన్నారులు.. కార్ అద్దాలు తెరచి.. సింహాలను ఫొటోలు తీసే ప్రయత్నం చేశారు. ఫొటో క్లిక్, ఫ్లాష్ రావడంతో సింహాలు ఒక్కసారిగా పైకి లేచాయి. అయితే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వాటంతట అవి పక్కకు వెళ్లాయి. ఎవరిమీద దాడి చేస్తాయన్నభయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్షణాలను లెక్కపెట్టుకుంటూ వాహనదారులు సమయం గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment