‘వావ్‌.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’ | Viral Video Of Leopard Cub Drinks From Waterhole With His Mother | Sakshi
Sakshi News home page

‘వావ్‌.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’

Published Fri, Aug 28 2020 9:11 AM | Last Updated on Fri, Aug 28 2020 10:49 AM

Viral Video Of Leopard Cub Drinks From Waterhole With His Mother - Sakshi

జంతు ప్రపంచంలో ఏన్నో వింతలు, ఆశ్చర్యాలు. అడవుల్లో చూసేందుకు అందాలు ఎన్నో. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రతి దాన్ని కెమెరాలో బంధించి వీటన్నింటిని చూసేందుకు వీలవుతోంది. తాజాగా చిరుతపులికి చెందిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత అటవీశాఖ అధికారి సుశాంత నందా గురువారం ఓ వీడియో క్లిప్‌ను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. (మరోసారి చిరుత కలకలం)

14 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పిల్ల చిరుతపులి, దాని తల్లితో కలిసి సరస్సు వద్ద నీటిని తాగుతూ దాహాన్ని తీర్చుకుంటోంది. అంతేగాక చుట్టుపక్కలా ఉన్న పక్షుల కిలకిల రావాలు ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. ఈ వీడియోను ఇప్పటికే 7 వేల మంది వీక్షించారు. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తూ... జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని చూసిన నెటిజన్లు ‘వావ్‌. ఇది చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. మాంసాహారి అయినప్పటికీ ఎంతో అప్రమత్తంగా ఉంది.’ అని  కామెంట్‌ చేస్తున్నారు. (ఇదేం పిచ్చి: చెవుల‌ను క‌త్తిరించి భ‌ద్రంగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement