ఫాంహౌస్‌లో చిరుత.. రక్షించిన అధికారులు | Leopard cub rescued after being discovered chained up in a farmhouse | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో చిరుత.. రక్షించిన అధికారులు

Published Mon, Dec 7 2015 6:27 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

ఫాంహౌస్‌లో చిరుత.. రక్షించిన అధికారులు - Sakshi

ఫాంహౌస్‌లో చిరుత.. రక్షించిన అధికారులు

ఓ ఫాంహౌస్‌లో బంధించిన మూడు నెలల చిరుతపులి పిల్లను అటవీ శాఖ అధికారులు రక్షించారు. గుర్‌గావ్ శివార్లలో ఉన్న ఫాంహౌస్‌లో చిరుత పిల్ల ఉన్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. అక్కడ ఓ ఆడ చిరుత పిల్ల కనిపించింది. దానికి ముందువైపు కుడికాలు బాగా ఫ్రాక్చర్ అయ్యింది. దాన్ని ఇనుప గొలుసులతో బంధించడం లేదా బోనులో పెట్టడం చేసి ఉంటారని, అందుకే కాలు విరిగి ఉంటుందని పశువైద్యులు భావిస్తున్నారు.

అయితే, గుర్‌గావ్ సమీపంలోని గైరత్‌పూర్ బస్ అనే గ్రామంలో పొదల వద్ద ఈ చిరుత పిల్ల కనిపించినట్లు అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆరావళి పర్వతశ్రేణి పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చిరుతలు ఎక్కువగా తిరుగుతుంటాయి. గుర్‌గావ్ వన్యప్రాణి సంరక్షణ విభాగం వాళ్లు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ చిరుత పిల్లను రక్షించారు. వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని గానీ, లేదా ఎవరైనా బంధించడం వల్ల గానీ మాత్రమే ఈ చిరుత పులి పిల్ల ఇంతలా గాయపడి ఉండాలని స్థానికులు వాదిస్తున్నారు. ఇది కనిపించిన ప్రాంతానికి సమీపంలో మూడు ఫాంహౌస్‌లు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.

తమ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆడ చిరుత, మగ చిరుత తిరుగుతుండేవని, ఇది వాటి పిల్లే అయి ఉంటుందని స్థానికులు చెప్పారు. దీన్ని ఎక్కడి నుంచి పట్టుకున్నారో అధికారులు స్పష్టంగా చెప్పడంలేదు కాబట్టి తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో చిరుత పిల్లను అక్కడి నుంచి తరలించేందుకు కూడా వాళ్లు అడ్డుపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement