
దిగ్గజ టెక్ కంపెనీ 'గూగుల్'లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు. దీనికి కారణం ఎక్కువ వేతనాలు, ఆఫీసులోనే లగ్జరీ సదుపాయాలు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడవచ్చు.
శివ్‌జీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో గూగుల్ ఆఫీస్ వీడియో షేర్ చేశారు. ఇది గురుగ్రామ్‌లోని గూగుల్ ఆఫీస్ అని తెలుస్తోంది. అద్భుతమైన డోర్స్, హాల్, కావలసినన్ని స్నాక్స్, డ్రింక్స్ వంటివన్నీ ఆఫీసులోనే ఉండటం చూడవచ్చు. మైక్రో కిచెన్, పూల్ టేబుల్ ఉన్న గేమ్స్ రూమ్, ఒక స్నాప్ రూమ్, మసాజ్ కుర్చీలతో కూడిన రూమ్ కూడా వీడియోలో కనిపిస్తాయి. వీడియో షేర్ చేస్తూ.. గూగుల్‌లో మరో అలసిపోయే రోజు! అని క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 4,72,786 లైక్స్ పొందిన ఈ వీడియోను 12.3 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమేనా.. పనిచేసేది ఏమైనా ఉందా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటూ పని చేస్తున్నారు కదా.. మీకు జీతం ఎంత ఇస్తారు అని మరొకరు కామెంట్ చేశారు. నాకు విశ్రాంతి తీసుకునే గది చాలాబాగా నచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: బనస్కాంత నుంచి బోర్డ్‌రూమ్ వరకు: అదానీ పోస్ట్ వైరల్
గూగుల్ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఆఫీసులోనే చాలా సౌకర్యాలను అందిస్తుంది. దీనికోసం కార్యాలయాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆఫీసులోనే ఫిట్‌నెస్ కేంద్రాలు, ఆన్ సైట్ చైల్డ్‌కేర్, గేమ్ రూమ్‌లు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ కంపెనీ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో.. ఓ ఆఫీస్ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment