
సాక్షి, చెన్నై: చిరుతపులి కూనను దొంగచాటుగా తెచ్చిన ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు అరెస్ట్‌చేశారు. చెన్నైకి చెందిన మొహిద్దీన్(28) శనివారం వేకువజామున బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నైకి చేరుకున్నాడు. చేతిలో చిన్న వెదురుబుట్టతో విమానాశ్రయంలో సంచరిస్తున్న మొహిద్దీన్‌ను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. వెదురు బుట్టలో ఏముందని ప్రశ్నించగా కుక్కపిల్ల ఉందని బదులిచ్చాడు. పొంతనలేని సమాధానాలివ్వడంతో జంతు సంరక్షణ విభాగం వారిని అధికారులు పిలిపించారు. అది చిరుత కూన అని ఆ అధికారులు తేల్చారు. కూనను తిరిగి బ్యాంకాక్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిని ఇక్కడి ఓ సర్కస్ కంపెనీ కోసం తీసుకొచ్చినట్లు మొహిద్దీన్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment