Wildlife Department
-
Leopard: చిరుతంటే బెరుకేల!?
సాక్షి, అమరావతి : చిరుతను చూసి మనం భయపడతాం గానీ.. అసలు అంతకన్నా ముందే దానికి మనుషులంటేనే చచ్చేంత భయం. మనుషులపై దాడి చేసే సాహసం చేయదు. మనుషుల్ని చూడగానే చిరుతలు భయంతో దూరంగా పారిపోతాయి. కానీ మనమేమో అది మన మీద దాడి చేస్తుందేమోనని బెంబేలెత్తిపోతాం. ‘జనావాసంలోకి చిరుత పులి..’ అంటూ తరచూ వార్తలు చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి జనం చిరుత పులిని చూసి రాళ్లతో తరిమికొట్టిన ఘటనలూ రాష్ట్రంలో చూశాం. నాలుగు రోజుల కిందట తిరుపతి బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లో ఉన్న కుక్కపై చిరుత దాడి చేసింది. అసలు చిరుతల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదమూ లేదని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అనుకోని రీతిలో దాన్ని చుట్టుముట్టినప్పుడు భయంతో మీదపడటం తప్ప, అది జనంపై దాడి చేసి గాయపర్చిన సందర్భాల్లేవంటున్నారు. ఆహారం, నీరు దొరక్క.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమకు తెలియకుండానే అవి జనారణ్యంలోకి వచ్చేస్తాయి. అడవులు, గడ్డి భూములే చిరుతల నివాస ప్రాంతాలు. పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి గడ్డి భూములు, డంపింగ్ యార్డుల వంటిచోటా అవి జీవిస్తాయి. సరిపడా ఆహారం, నీరు ఉన్నంతకాలం అవి తమ పరిధిలోని ఆవాస ప్రాంతంలోనే సంచరిస్తాయి. ఆ రెండు లేనప్పుడు వాటిని వెతుక్కుంటూ బయటకొస్తాయి. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో వాటి ఆవాస ప్రాంతాలు కుచించుకుపోవడం, నీటి చలమలు తగ్గిపోవడంతో వాటి మనుగడకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అవి ఆహారాన్వేషణలో అనుకోకుండా సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. చిరుతలకు కుక్కలంటే మహాప్రీతి. వాటికోసం అప్పుడప్పుడు జనాలు ఉన్న చోటుకు వచ్చి వాటిని వేటాడతాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 మధ్య చిరుతలు చురుగ్గా ఉంటాయి. అప్పుడే ఇతర జంతువులను వేటాడతాయి. మనుషులకు ఎలాంటి ప్రమాదమూ లేదు.. చిరుత పులులు అన్ని ప్రాంతాల్లోనూ మనుగడ సాగించగలవు. కుక్కలు ఇతర చిన్న జంతువులున్నచోట కూడా అవి బతికేస్తాయి. వాటివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 99 శాతం అవి మనుషులకు కనపడకుండానే తిరుగుతాయి. రాష్ట్రంలో చిరుతల వల్ల మనుషులు గాయపడినట్టు ఎక్కడా రికార్డవలేదు. రాష్ట్రంలో వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. – రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణుల విభాగం, ఏపీ) Cheetahs: చీతా గురించి మీకు ఈ విషయాలు తెలుసా! -
అభయారణ్యాల్లో రోడ్లకు.. రైలు మార్గాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: పులుల అభయారణ్యాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. అయితే మరోవైపు జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ చర్యలవల్ల పులుల సంరక్షణకు నష్టం వాటిల్లుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో (జాతీయరహదారి–363)ని రోడ్డును (94 కి.మీ పొడవు) ‘ఫోర్ లేనింగ్ నేషనల్ హైవే’గా మార్చాలనే ప్రతిపాదనపై ఇటీవల పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర వన్యప్రాణి మండలి ఈ నెల 1న జరిగిన తొలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మాఖుది, రేచ్ని రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య కాగజ్‌నగర్ డివిజన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో (కారిడార్ ఏరియా) పరిధిలో మూడో కొత్త బ్రాడ్‌గ్రేజ్ లైన్‌ను వేసేందుకు 168.43 హెక్టార్ల అటవీభూమిని మళ్లించడంపైనా ఈ భేటీ ఆమోదం తెలిపింది.డబ్ల్యూఎల్ఎం వరంగల్ డివిజన్లోని ఉరాట్టం–ఐలాపురం రోడ్డు అప్‌గ్రెడేషన్‌కు 31.759 హెక్టార్ల అటవీభూమిని మళ్లించేందుకు ఈ బోర్డు అంగీకరించింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో గోదావరి నదిపై తుపాకుల గూడెం గ్రామం వద్ద పి.వి.నరసింహారావు కాంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–1, ప్యాకేజ్–1లో భాగంగా బ్యారేజీ నిర్మాణానికి 27.9133 హెక్టార్ల వన్యప్రాణి ప్రాంతాల్లోని అటవీభూమిని సైతం మళ్లించడంపై వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. పులులకు తీరని నష్టం... అభయారణ్యాల్లో పులుల తిరుగాడే ప్రధాన ›ప్రాంతం (కోర్ ఏరియా), మహారాష్ట్ర సరిహద్దులోని పులులకు కీలకమైన ప్రాంతాల్లో భాగమైన ఆయాచోట్ల రోడ్ల విస్తరణ, కొత్తరైల్వేలైన్ల నిర్మాణం సరికాదని పర్యావరణ వేత్తలు, జంతుప్రేమికులు వాదిస్తున్నారు.మహారాష్ట్రలోని తడోబా ఆంథేరి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణకు పులుల వలస మొదలు కావడంతోపాటు కవ్వాల్ టైగర్ అభయారణ్యం పరిధిలో ఇక్కడే పిల్లలు కూడాపెడుతున్నాయి. ఈ తరుణంలో పులుల వృద్ధికి, వాటి సంచారానికి, వలసలకు కీలకమైన ఈ ప్రాంతంలో నాలుగు లేన్ల రోడ్లు వేయడం, కొత్త రైల్వేలైను వేయడం వల్ల పులులసంఖ్య పెరిగేందుకు ప్రతికూలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో 94 కి.మీ పొడవున నాలుగు లేన్ల రోడ్డు వేయాలనే ప్రతిపాదనపై వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే ఆమోద ముద్ర వేసినట్టుగ రాష్ట్ర వన్యప్రాణి మండలి సభ్యులు చెబుతున్నారు. మిగతా ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఆయా అంశాలు పరిశీలించి, అత్యవసరమైన సందర్భాల్లోనే ఆమోదం తెలుపు తున్నట్టు స్పష్టం చేశారు. -
వ్యక్తి కుర్తాలోకి చొరబడిన పాము
-
కుర్తాలో దూరిన పాము..కదిలితే!!
ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుర్తాలోకి పాము చొరబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన బంధువుల్లోని వ్యక్తి అనారోగ్యపాలైతే చూడటానికి వచ్చిన ఓ ముసలాయన.. హాస్పిటల్ ఆవరణలో నేల మీద పడుకున్నాడు. ఎప్పుడు, ఎలా వచ్చిందో తెలీదు కానీ.. అనూహ్యంగా ఆయన కుర్తాలోకి పాము దూరింది. మొదట ఇది అతను గమనించుకోలేదు. తర్వాత హాస్పిటల్ సిబ్బంది గమనించి ఆ వ్యక్తికి తెలిపారు. భయభ్రాంతులకు గురైన ఆ వ్యక్తి.. కదిలితే పాము ఎక్కడ కాటేస్తుందోనని అలాగే ఉండిపోయాడు. కాగా హాస్పిటల్ సిబ్బంది వన్యప్రాణి సంరక్షణ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది ముసలాయనను లేపకుండానే ఆ పామును బయటకు తీశారు. ఈ పాము గ్రీన్ కీల్ బాక్‌గా గుర్తించారు. ఇది విషరహితమైనదని తెలిపి అనంతరం పామును అడవిలో విడిచి పెట్టారు. కాగా ఇటీవల జనావాసాల్లోకి పాములు చొరబడుతున్న ఘటనలు తరచుగా జరుగుతన్న సంగతి తెలిసిందే. -
చెన్నైకి చిరుత.. వయా థాయిలాండ్
సాక్షి, చెన్నై: చిరుతపులి కూనను దొంగచాటుగా తెచ్చిన ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు అరెస్ట్‌చేశారు. చెన్నైకి చెందిన మొహిద్దీన్(28) శనివారం వేకువజామున బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెన్నైకి చేరుకున్నాడు. చేతిలో చిన్న వెదురుబుట్టతో విమానాశ్రయంలో సంచరిస్తున్న మొహిద్దీన్ను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. వెదురు బుట్టలో ఏముందని ప్రశ్నించగా కుక్కపిల్ల ఉందని బదులిచ్చాడు. పొంతనలేని సమాధానాలివ్వడంతో జంతు సంరక్షణ విభాగం వారిని అధికారులు పిలిపించారు. అది చిరుత కూన అని ఆ అధికారులు తేల్చారు. కూనను తిరిగి బ్యాంకాక్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిని ఇక్కడి ఓ సర్కస్ కంపెనీ కోసం తీసుకొచ్చినట్లు మొహిద్దీన్ చెప్పాడు. -
ఏటూరునాగారంలో వన్యప్రాణి డివిజన్ కార్యాలయం
నాలుగు రేంజ్‌లకు కలిపి ఏర్పాటు రక్షణ కోసం మరిన్ని చర్యలు ఏటూరునాగారం : ఏటూరునాగారంలో వన్యప్రాణి విభాగం జిల్లా డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏటూరునాగారాన్ని వన్యప్రాణి, అడవుల రక్షణ కోసం ప్రత్యేక హోదా కలిగిన అధికారితోపాటు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఏటూరునాగారంలో ఉన్న అటవీశాఖ టెరిటోరియల్ రేంజ్ ఆఫీస్, వన్యప్రాణి రేంజ్ ఆఫీస్, పస్రా, తాడ్వాయి రేంజ్ కార్యాలయాలు వరంగల్ నార్త్ డీఎఫ్ఓ కింద పనిచేసేవి. ఇప్పుడు జయశంకర్ జిల్లా ఏర్పడుతుండటంతో ఏటూరునాగారాన్ని ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేసి ఫారెస్ట్ డిస్టిక్ట్ర్ ఆఫీసర్ (ఎఫ్డీఓ) అధికారిని కూడా నియమించనున్నారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో తాడ్వాయి, ఏటూరునాగారం, ఆకులవారి ఘ ణపురం, పస్రాలోని రేంజ్ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. ఏజెన్సీలో వన్యప్రాణి, టెరిటోరియల్ అనే రెండు శాఖలు అటవీశాఖ పరిధిలో ఉండేవి. నూతన జిల్లా పరిధిలోని ఏ జెన్సీ మండలాలైన తాడ్వాయి, పస్రా, ఏటూరునాగారంను వన్యప్రాణి విభాగంగా ప్రకటించనున్నారు. దీనివల్ల ఏజెన్సీలోని అడవులతోపాటు జంతువుల సంరక్షణ కూడా ఉంటుందని ఈ మార్పులు చేపట్టారు. నలుగురు రేంజ్ అధికారులు, ఒక సబ్ డీఎఫ్ఓ, ఒక ఎఫ్డీఓ అధికారులు ఉంటారని వెల్లడించారు. పటిష్టంగా అమలు కానున్న అటవీ చట్టాలు ప్రస్తుత రేంజ్ అంతా వన్యప్రాణి విభాగం పరి ధిలోకి రాగా అటవీశాఖ చట్టాలు పట్టిష్టంగా అమలు కానున్నాయి. జంతువుల సంఖ్య 15 సంవత్సరాల్లో ఘణనీయంగా తగ్గింది. పులు లు, సింహాలు, దుప్పి, జింక, కొండ గొర్రెలు, ఎలుగుబంటి, మెకం వంటి వన్యప్రాణులు కానరాకుండా పోతున్నాయి. ప్రధాన కార్యాలయం స్థానికంగా ఉండడం వల్ల అధికారు లు, సిబ్బంది స్థానికంగా ఉంటూ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కోసం ఇప్పటికే చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న భవనాలకు మరింత సౌకర్యాలు పెంచే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. -
అడవుల అభివృద్ధికి చర్యలు
వన్యప్రాణి విభాగం ఏపీ సీసీఎఫ్ పృథ్వీరాజ్ హన్మకొండ అర్బన్ : అంతరించిపోతున్న అటవీసంపదను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంటోందని వన్యప్రాణి విభాగం ఏపీ సీసీఎఫ్ ఎం.పృథ్వీరా జ్ అన్నారు. అడవులను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై బుధవారం హన్మకొండ సుబేదారిలోని ఫారెస్ట్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నా రు. కార్యక్రమంలో వరంగల్ సీఎఫ్ అక్బర్, సీఎస్‌ఎస్‌ఎఫ్ రా జారావు, డీఎఫ్ఓలు భీమానాయక్, పురుషోత్తం, ఖమ్మం కరీంనగర్ జిల్లాల ఎఫ్ఆర్ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు పాల్గొన్నారు.