మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుర్తాలోకి పాము చొరబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన బంధువుల్లోని వ్యక్తి అనారోగ్యపాలైతే చూడటానికి వచ్చిన ఓ ముసలాయన.. హాస్పిటల్ ఆవరణలో నేల మీద పడుకున్నాడు. ఎప్పుడు, ఎలా వచ్చిందో తెలీదు కానీ.. అనూహ్యంగా ఆయన కుర్తాలోకి పాము దూరింది. మొదట ఇది అతను గమనించుకోలేదు. తర్వాత హాస్పిటల్ సిబ్బంది గమనించి ఆ వ్యక్తికి తెలిపారు. భయభ్రాంతులకు గురైన ఆ వ్యక్తి.. కదిలితే పాము ఎక్కడ కాటేస్తుందోనని అలాగే ఉండిపోయాడు. కాగా హాస్పిటల్ సిబ్బంది వన్యప్రాణి సంరక్షణ సిబ్బందికి సమాచారం అందజేశారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది ముసలాయనను లేపకుండానే ఆ పామును బయటకు తీశారు. ఈ పాము గ్రీన్ కీల్ బాక్‌గా గుర్తించారు. ఇది విషరహితమైనదని తెలిపి అనంతరం పామును అడవిలో విడిచి పెట్టారు. కాగా ఇటీవల జనావాసాల్లోకి పాములు చొరబడుతున్న ఘటనలు తరచుగా జరుగుతన్న సంగతి తెలిసిందే.