Government Hosiptal
-
అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ దందాపై ప్రభుత్వం సీరియస్
-
‘పోస్ట్’ మార్టమ్... శవాలగదిలో ఉద్యోగమా?
మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటి అని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురీ. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్ట్‌మార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం రామ్ప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామ్‌ప్రసన్న... ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడం ఏమిటి!!’ అనే లింగవివక్షతతో కూడిన మాటలు... ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా!’లాంటి వెక్కిరింపులు ఎదుర్కొన్నా... ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. వృత్తి జీవితంపై గౌరవాన్ని తగ్గించుకోలేదు... ఇచ్చోటనే...నిండా పాతికేళ్లు కూడా నిండని యువకుడి శవం. ‘బహుశా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు’ అని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి... తన పిల్లల్ని తలుచుకొని కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నట్లు అనిపిస్తుంది. ‘ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయాలి. వారి పెళ్లి చూడకుండానే వరద నన్ను మింగేసింది’... మధ్యతరగతి తండ్రి శవం అదేపనిగా రోదిస్తున్నట్లుగా ఉంటుంది. శవాలు మౌనంగా చెప్పే కథలు ఎన్నో విన్నది రామ్‌ప్రసన్న. అలా అని శ్మశాన వైరాగ్యంలాంటిది తెచ్చుకోలేదు. వృత్తిని వృత్తిలాగే ధైర్యంగా నిర్వహిస్తోంది.‘నాకు ఉద్యోగం వచ్చింది అనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు...అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు. వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా’ అంటుంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అసిస్టెంట్ (శవపరీక్ష సహాయకురాలు)గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న.ఆసుపత్రి వెనుక వైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తిజీవితం ముడిపడివుంది. ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు... నిత్యం ఆసుపత్రికి వస్తూనే వుంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహాన్ని సిద్ధం చేయటం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రామ్‌ప్రసన్న ఉద్యోగం.భర్త ప్రోత్సాహంతో...ప్రమాదాల్లో రక్తమోడుతున్న మృతదేహాలూ, నీటిలో ఉబ్బిపోయినవీ, డీ కంపోజింగ్‌కు చేరువైనవి... చూడటమే కష్టం. నెలకు పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చే ఇలాంటి మృతదేహాలను శవపరీక్షకు సిద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? సన్నగా, రివటలా ఉండే రామ్‌ప్రసన్న ఆ విధులను వస్త్రాలకు అతుకులు కుట్టినంత శ్రద్ధగా, అలవోకగా చేస్తోంది.రామ్‌ప్రసన్న దూరవిద్యలో బీఏ చేసింది. కూలి పనులకు వెళుతుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది. డీసీహెచ్ఎస్ నుండి వెలువడిన నోటిఫికేష¯Œ లో పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్ పోస్టు కనిపించటంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండాప్రోత్సహించాడు.భయం అనిపించలేదు... ఆసక్తిగా అనిపించింది!తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో పోస్టుమార్టమ్ సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించే వారు కొందరు. ఇలాంటి వారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడడం చాలామందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్తసంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు. ‘ఈ ఉద్యోగంలోకి వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణానికి కారణాలు తెలుసుకోవటం ఆసక్తిగా అనిపించింది. భయం అనిపించలేదు. ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నాను.’ అంటుంది రామ్‌ప్రసన్న. ‘మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి’ అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రామ్‌ప్రసన్న వృత్తిజీవితం, అంకితభావం చెంపపెట్టులాంటిది. ఈ ఉద్యోగం నాకు గర్వకారణంనేను చేస్తున్న ఉద్యోగంపై కొందరి సందేహాలు, భయాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వేరే లోకంలో ఉద్యోగం చేయడం లేదు. గ్రహాంతర జీవులు, ప్రమాదకర వ్యక్తుల మధ్య ఉద్యోగం చేయడం లేదు. నిన్నటి వరకు వాళ్లు మనలాంటి మనుషులే. మన మధ్య ఉన్న వాళ్లే. ్రపాణదీపం ఆరిపోగానే వారిని పరాయి వాళ్లుగా చూసి భయపడడం తగదు. నేను భయపడుతూ ఉద్యోగం చేయడం లేదు. గర్వంగా చేస్తున్నాను. అంకితభావంతో చేస్తున్నాను.– రామ్‌ప్రసన్న – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం
-
షాకింగ్: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్
ముంబై: వైద్యులను దేవుడితో పోలుస్తున్నారు. ఆ దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటుంటారు. కేవలం డబ్బుల కోసమే కాకుండా, మానవతా హృదయంతో తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షిస్తున్న ఘనత వైద్యులకే దక్కుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా వైద్యవవస్థ వ్యాపారంగా మారింది. అలాంటి ఓ షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి ధర్మం మరిచిన ఓ వైద్యుడు రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యహరించాడు. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు సదరు వైద్యుడు. నాగ్‌పూర్‌లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మౌడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎనిమిది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు మహిళలకు ఆపరేషన్ చేసిన వైద్యుడు తేజ్‌రంగ్ భలవి.. మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ఓ కప్ చాయ్ తీసుకురావాలని వైద్యుడు కోరాడు. కానీ ఎవరూ అతనికి టీ తీసుకోని రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్ భల్వాయి.. మిగతా నలుగురికి కు.ని శస్త్రచికిత్స చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బంది జిల్లా వైద్యాధికారికి ఈ విషయం తెలపగా.. ఉన్నపళంగా మరో వైద్యుడిని మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. అనంతరం క్టర్ భలవి ప్రవర్తనపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై విచారణ చేపట్టినట్లు నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు -
నాందేడ్ ఘటన: ఆసుపత్రి టాయిలెట్స్ క్లీన్ చేసిన డీన్‌పై కేసు నమోదు
ముంబై: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాల ఘటన దేశవ్యాప్తంగాచర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నాందేడ్ శంకర్ రావ్ చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 48 గంటల్లోనే 31 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపింది. మృతుల్లో 18 మంది చిన్నారులు కూడా ఉండటంతో మరింత వివాదం రాజుకుంది. తాజాగా ఈ వ్యవహారంలో ఆసుపత్రి డీన్‌పై పోలీసు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆసుపత్రి డీన్ డాక్టర్ ఎస్ వాకోడ్‌తోపాటు మరో వైద్యుడిపై నేరపూరితమైన హత్య కేసు నమోదైంది. మృతిచెందిన నవజాత శిశువు బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాందేడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయ్యింది. శిశువు మృతికి డీన్, చైల్డ్ స్పెషలిస్ట్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో మందులు లేకపోవడంతో, బయట నుంచి కొనుక్కొచ్చినా.. డాక్టర్లు సకాలంలో వైద్యం అందించలేదని ఆరోపించారు. సాయం కోసం డీన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు. వారిని దూరంగా వెళ్లగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వార్త: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 31 మంది మృతి Shiv Sena MP Hemant Patil on Tuesday made the acting dean of the government hospital in Nanded, where 31 patients have died in 48 hours, clean a dirty toilet and urinals, a video of which has gone viral. अगर ये सब करने से बच्चो की जान वापिस आ जायेगी तो हम सब ये करने को तैयार है… pic.twitter.com/ykQOJGYasb — Dr Manoj Chaudhary (@MK_Chaudhary04) October 3, 2023 కాగా తనతో ఆసుపత్రి టాయిలెట్స్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీపై డీన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం వెలుగుచూడటం గమనార్హం. నాందేడ్ శివసేన(షిండే వర్గం) ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం శంకర్రావు చావన్‌ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితని సమీక్షించారు. అక్కడి టాయ్‌లెట్ అత్యంత అపరిశుభ్రంగా ఉండటం గమనించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ఆసుపత్రిలో మరుగుదొడ్ల దుస్థితిని చూసి బాధగా ఉందన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇక్కడ పరిస్థితిని చూసి బాధేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లోని టాయిలెట్స్‌కు తాళాలు వేసి ఉండటం, మరికొన్ని మురికిగా ఉండటంపై ఎంపీ హేమంత్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి డీన్ ఆర్ఎస్ వాకోడ్తో టాయిలెట్ క్లీన్ చేయించారు. ఎంపీ కూడా అక్కడే ఉండి నీళ్ళపైపుతో నీళ్లు వేశారు. చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంపీ హేమంత్ పాటిల్‌పై ఆసుపత్రి డీన్ వాకోడ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి విధులు అడ్డుకోవడం, పరువు తీయడం వంటి సెక్షన్ల కింద ఎంపీ హేమంత్ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఆసుపత్రిలో మరణాలపై విచారణ చేసేందుకు కమిటీని నియమించినట్లు వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మైసెఖర్ స్పష్టం చేశారు. #WATCH : MP Makes Dean Clean Toilet of a Hospital Where 31 children Died In 48 Hours.#Nanded #NandedHospital #NandedHospitalDeaths #India #latestnews #latest #LatestUpdate #BREAKING #Maharashtra #MaharashtraNews #MaharashtraHospitalHorror pic.twitter.com/NGE2VMj2TZ — upuknews (@upuknews1) October 3, 2023 -
ఆకలికి వైద్యం అన్నం పొట్లం
హాస్పిటల్‌లోని పేషెంట్లకు వైద్యులు వైద్యం చేస్తారు. కాని వారి ఆకలికి ఎవరు వైద్యం చేస్తారు? కేరళలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పేషెంట్ల కోసం, వారిని చూసుకుంటూ ఉండిపోయిన బంధువుల కోసం ఎందరో గృహిణులు వంట చేస్తారు. ‘అన్నం పొట్లం’ కట్టి అందిస్తారు. ఇలా దాదాపు రోజూ 40 వేల అన్నం పొట్లాలు అక్కడి యూత్ ఫెడరేషన్ ద్వారా నిత్యం సరఫరా అవుతూనే ఉంటాయి. ఉదయాన్నే లేచిన సౌమ్య ఆఫీసుకు వెళ్లే భర్త కోసం క్యారేజీ కట్టే హడావిడిలో ఉంది. అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్సులు కట్టాలి. ఒకటిన్నర గ్లాసుల బియ్యం పడేస్తే సరిపోతాయి. కాని ఆమె ఆ రోజు రెండు గ్లాసులకు పైనే వండింది. భర్తకు, పిల్లలకు కట్టగా తను తినాల్సింది గిన్నెలో పెట్టి మిగిలింది పొట్లంగా కట్టింది. అన్నంతో పాటు పప్పు, పచ్చడి, తాలింపు, ఒక ఆమ్లెట్టు... చక్కగా అరిటాకులో వేసి న్యూస్పేపర్లో చుట్టింది. ఆ పొట్లాన్ని కాసేపటికి ఒక కార్యకర్త వచ్చి సేకరించుకుని వెళ్లాడు. అలా ఆ కార్యకర్త ఆ వీధిలో అన్నం పొట్లం కట్టమని చెప్పిన ఇళ్లన్నింటికీ వెళ్లి అన్నం పొట్లాలను సేకరించాడు. ఇలా సేకరించినవి మధ్యాహ్నానికి ఊళ్లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతాయి. లోపల ఉన్న పేద పేషెంట్లకూ వారి కోసం బయట కాచుకుని ఉన్న అటెండర్ల కోసం పంచుతారు. ‘ఏ తల్లి కట్టిచ్చిన అన్నమో’ అని తిన్నవారు ఆ గృహిణులను ఆశీర్వదిస్తారు. ఇలా కేరళలో గృహిణుల వల్ల గత నాలుగేళ్లుగా రోగుల ఆకలి తీరుతోంది. వారి ఆరోగ్యం బాగుపడుతోంది. ఇంటి నుంచి ఆస్పత్రికి కేరళలోని డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ) 2017లో 300 అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే పెద్దాస్పత్రులకు పంచే కార్యక్రమం మొదలు పెట్టింది. దీనికి వారు పెట్టిన పేరు ‘హృదయపూర్వం పొత్తిచోరు’. అంటే ‘హృదయపూర్వకంగా అన్నం పొట్లం’. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు అన్నం కొనుక్కునే స్తోమత అన్ని వేళలా ఉండదు. అలాగే వారిని చూసుకోవడానికి వచ్చే బంధువులు కూడా అన్నం కొనుక్కోలేరు. పేదవారు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా అని డివైఎఫ్ఐ కార్యకర్తలకు అనిపించింది. ‘ప్రతి ఇంట్లోనూ ఓ అమ్మ అన్నం వండుతుంది. ఒక గుప్పెడు అదనంగా వండమని కోరుదాం. ఒకరికి భోజనం పొట్లం కట్టి ఇవ్వమని అడుగుదాం. ఇస్తారు’ అని స్త్రీల కరుణ మీద ఉండే విశ్వాసంతో ధైర్యంగా రంగంలోకి దిగారు. కార్యక్రమ ప్రారంభం రోజున 300 అన్నం పొట్లాలు వచ్చాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 40,000 అన్నం పొట్లాలు పంపిణీ అవుతున్నాయి. పకడ్బందీగా సేకరణ కేరళ అంతా డివైఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారు. వారు తమ తమ ఊళ్లలో ఎన్ని అన్నం పొట్లాలు అవసరమో లెక్కించి తమ ఏరియాలో ఉన్న గృహిణులను ముందు రోజే రిక్వెస్ట్ చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం అన్నం పొట్లం ఇవ్వమంటారు. అలా ఒకోరోజు ఒక ఏరియాలో కొన్ని ఇళ్లను ఎంపిక చేసుకుని అడుగుతారు. మళ్లీ ఆ ఇళ్లలోని గృహిణులను అడగడానికి వారం పదిరోజులు పట్టొచ్చు. అందుకని స్త్రీలు సంతోషంగా అన్నం పొట్లం కట్టి ఇస్తారు. కొందరు స్త్రీలు రెండు మూడు పొట్లాలు కట్టిచ్చి సంతోష పడతారు. సారీ అంకుల్! ఈ అన్నం పొట్లాల పంపిణిలో ఎన్నో ప్రేమమయ సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఒక రోగికి తన వంతుగా అందిన అన్నం పొట్లంలో చిన్న చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది. ‘అంకుల్.. అమ్మకు వీలు కాలేదు. నేనే స్కూల్‌కు వెళ్లే హడావిడిలో వంట చేశాను. అంత రుచిగా లేవు. క్షమించండి. మీరు తొందరగా కోలుకోండి’ అని ఒక అమ్మాయి రాసింది. దానిని అందుకుని ఆ రోగి ఆ చీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ‘బంగారుతల్లీ... నువ్వు పంపిన భోజనం ఎంతో రుచిగా ఉంది. మెతుకు మెతుకులో నీ ప్రేమ ఉంది’ అని రాశాడు. అన్నం పొట్లం కట్టివ్వడానికి అమ్మలాంటి స్త్రీలు ఎందరో ఉంటారు. చేయవలసిందల్లా ప్రయత్నమే. -
అమ్మకానికి ఆడ శిశువు
సిద్దిపేటఅర్బన్: పేగు బంధం తెంచుకొని పుట్టి రెండు రోజులు కాకముందే ఆడపిల్లను అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. ఘటనకు సంబంధించి బాలల పరిరక్షణ విభాగం అధికారులు రాము, శిశుగృహ మేనేజర్ ఝాన్సీ, సామాజిక కార్యకర్త రాజారాం తెలిపిన వివరాల ప్రకారం..మిరుదొడ్డి మండలం మోతే గ్రామానికి చెందిన గొడుగు మంజులకు నాలుగో సంతానంగా సోమవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువు జన్మించింది. మంజులకు గతంలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా మరో ఇద్దరు పుట్టి చనిపోయారు. కాగా మంజుల భర్త సైతం ఆదివారం చనిపోగా అంత్యక్రి యలు పూర్తి చేసిన అనంతరం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. చేసేదేమి లేక తల్లి బూరుగుపల్లి శివారుకు చేరుకొని ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు గజ్వేల్‌కు చెందిన ఎండీ జామీన్, ముంతాజ్ దంపతులకు రూ. 20 వేలకు అమ్మేసింది. దీన్ని గమనించిన స్థానికులు 1098కు సమాచారం ఇవ్వడంతో బాలల పరిరక్షణ అధికారులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించి శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి బాలసదనంకు తల్లిని, శిశువును తరలించారు. తన భర్త రెండు రోజుల క్రితం చనిపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడం, ఆడపిల్లను పోషించే పరిస్థితి లేక విక్రయించినట్టు తల్లి మంజుల తెలిపింది. బుధవారం శిశువును కొనుగోలు చేసిన వారిని, తల్లిని, శిశువును సీడబ్ల్యూసీ ముందు హాజరుపర్చనున్నట్టు బాలల పరిరక్షణ అధికారులు తెలిపారు. -
జగిత్యాల పెద్దాసుపత్రి వైద్యుల నిర్లక్ష్య వైఖరి
-
సర్కారీ వైద్యం సూపర్
మదనపల్లె: గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యం అంటే ప్రజలు భయపడే పరిస్థితి. ప్రాణాపాయ స్థితిలో అత్యవసరంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే వైద్యులు అందుబాటులో లేకపోవడం, ప్రమాదకర పరిస్థితుల్లో వైద్యం అందించలేమంటూ తిరుపతి, బెంగళూరు, వేలూరు ఆస్పత్రులకు రెఫర్ చేసేవారు. అరకొర వసతులతో సామాన్యులకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యరంగానికి మహర్దశ పట్టింది. పేదవాడికి కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పథకంతో మౌలికవసతులు, కోట్లాదిరూపాయలు వెచ్చించి అధునాతన పరికరాలు, ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు కల్పించారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాల ప్రజల వైద్య అవసరాలకు ఏకైక పెద్దదిక్కు మదనపల్లె జిల్లా ఆస్పత్రి. 2019 వరకు మదనపల్లె జిల్లా వైద్యశాలలో 15 నుంచి 20 మంది మాత్రమే డాక్టర్లు ఉండేవారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ గిరీషా.పీఎస్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా, ఎమ్మెల్యే నవాజ్‌బాషా కో చైర్మన్‌గా ఉన్నారు. ఆస్పత్రి సమస్యలను ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషిచేయడంతో నేడు జిల్లా ఆస్పత్రిలో 34మంది వైద్యులు సేవలందిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో లభించే ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతిరోజు 700 నుంచి 800 వరకు ఔట్పేషెంట్లు వైద్యచికిత్సలు పొందుతున్నారు. 150 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆప్తాల్మజీ, ఆర్థో, ఈఎన్టీ, సైకియాట్రి, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజీషియన్ మెడిసిన్, గైనకాలజీ, రేడియాలజీ, పిడియాట్రిక్, ఏ.ఆర్.టి.(హెచ్ఐవీ) సెంటర్, టీబీ, డీ–అడిక్షన్ సెంటర్లకు సంబంధించి అనుభవజ్ఞులైన వైద్యులు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలోనే మంచిపేరున్న బ్లడ్‌బ్యాంక్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. ప్రతిరోజు నాలుగు షిఫ్ట్‌లలో నెలకు 100మందికి పైగా కిడ్నీవ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు డయాలసిస్ సెంటర్ ఉంది. పాయిజన్, హార్ట్‌స్ట్రోక్స్, ఇతర అత్యవసరాలకు సంబంధించి 10 బెడ్లతో ఐసీయూ, పుట్టిన పిల్లలకు తక్షణ వైద్యసేవలకు సిక్ న్యూ బార్న్ యూనిట్లో 10 బెడ్లను ఏర్పాటు చేశారు. డీఎన్బీ కింద గైనిక్, అనస్థీషియా విభాగాలకు సంబంధించి ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులను ప్రభుత్వం కేటాయించింది. 24 గంటలు అత్యవసర వైద్యసేవలు అందేలా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈసీజీ, వెంటిలేటర్లు, కంప్లీట్ ఆటోఅనలైజర్, డయాలసిస్, హార్మోన్ ఎనలైజర్ మిషన్లు, స్కానింగ్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా వైద్యశాలలో త్వరలో బ్రెస్ట్ క్యాన్సర్, ఇతరాలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 8కోట్ల రూపాయల అభివృద్ధి పనులు గడచిన రెండున్నరేళ్లలో జిల్లా వైద్యశాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎంపీ మిథున్‌రెడ్డి సొంత నిధులతో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లను హైదరాబాదు నుంచి తెప్పించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఎంపీ సహకారంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్–1, పీఎస్ఏ ప్లాంట్లు–2 మొత్తం మూడింటిని ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా వీటిద్వారా 100 బెడ్లకు ఆక్సిజన్ అందించే అవకాశం ఉంది. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 10 ఐసీయూ బెడ్లు, 0–8 సంవత్సరాల పిల్లలకు సేవలందించేందుకు డీఐసీకు శాశ్వత భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. కరోనా టెస్టులు చేసేందుకు వీఆర్డీఎల్ ల్యాబ్ ఉంది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాము. సిబ్బంది కొరత లేకుండా అన్ని విభాగాలకు డాక్టర్లను నియమించాం. జిల్లా ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్వయంగా పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన పేదవాడు ఇక్కడ అందే ఉచిత వైద్యంతో ఆరోగ్యంగా ఇంటికెళ్లాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నాం. –నవాజ్‌బాషా, ఎమ్మెల్యే అందుబాటులో స్పెషాలిటీ వైద్యసేవలు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది కొరత లేదు. గైనకాలజీ విభాగంలో నెలకు 300 వరకు కాన్పులు, ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యసేవలకు సంబంధించి అక్టోబర్‌కు సంబంధించి 2వ ర్యాంకును సాధించాం. – డాక్టర్ ఆంజనేయులు, మెడికల్ సూపరింటెండెంట్ రోగులకు మంచి వైద్యం అందుతోంది మాది నిమ్మనపల్లె మండలం దిగువపల్లె గ్రామం. పక్షవాతంతో బాధపడుతున్నాను. ఐదురోజుల క్రితం ఆయాసం, గొంతు, వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ గతంతో పోలిస్తే ప్రస్తుతం మంచి వైద్యం అందుతోంది. సౌకర్యాలు బాగున్నాయి. – శివకుమార్ సింగ్, దిగువపల్లె, నిమ్మనపల్లె -
మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు
మోర్బీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) మోర్బీకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. తీగల వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడి మోర్బీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలవనున్నారు. అయితే మోదీ సందర్శన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టారు. సోమవారం అర్థరాత్రి హడావిడీ సృష్టించి ఆసుపత్రికి మెరుగులు దిద్దారు. ఆసుపత్రి గోడలు, పైకప్పు భాగాలకు పెయింట్ వేశారు. టైల్స్ మార్చారు. కొత్త కూలర్లను తీసుకువచ్చారు. వంతెన దుర్ఘటనలో గాయపడిన 13 మందిని చేర్చుకున్న రెండు వార్డులలో బెడ్షీట్లు ఉన్నపళంగా మార్చేశారు. సిబ్బంది అంతా అర్థరాత్రి ప్రాంగణాన్ని ఊడ్చి క్లీన్‌గా చేశారు. మొత్తంగా ఆసుపత్రిని తళతళ మెరిసేలా చేశారు. కాగా ఆసుపత్రికి మెరుగులు దిద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాడైన గోడలు, పెచ్చులూడిన పైకప్పుకు పెయింటింగ్ వేయడం వంటి ఫోటోలు చూస్తుంటే ఆసుపత్రిలో అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అద్దం పడుతుంది. చదవండి: మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్, కమలా హారిస్ મોરબીમાં કાલે કમા ની મુલાકાત હોવાથી અત્યારે રાત્રે સિવિલ હોસ્પિટલ માં કલર કામ કરી રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. #Morbi #મોરબી #morbihospital pic.twitter.com/OS6EFlHyxf — Baraiya Nikunj (@NIKKUGAMING11) October 31, 2022 అయితే కేవలం మోదీ సందర్శన ముందు ఆసుపత్రి పునర్నిర్మాణ పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రి దృశ్యాలను షేర్ చేస్తూ.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కాషాయ పార్టీపై విరుచుకుపడ్డాయి. ప్రధానమంత్రికి ఫోటోషూట్ కోసం బీజేపీ ఈవెంట్ మేనేజ్మెంట్లో బిజీగా ఉందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా వ్యంగ్యసత్రాలు ఎక్కుపెట్టాయి. त्रासदी का इवेंट कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं। PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है। इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC — Congress (@INCIndia) October 31, 2022 ఓ పక్క బ్రిడ్జి కూలిన విషాద ఘటనలో వందలాది మంది చనిపోతే మరో పక్క మోదీ ఫోటోషూట్‌లో ఎలాంటి లోపం లేదని నిర్ధారించడానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని మండిపడ్డాయి. మోదీ కోసం పెయింటింగ్ వేస్తూ, టైల్స్‌ను మెరిపిస్తూ బిజీగా ఉన్న వారికి సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 27 ఏళ్లగా బీజేపీ సరిగా పని చేసి ఉంటే, అర్ధరాత్రి ఆసుపత్రిని అలంకరించాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశాయి. Morbi Civil Hospital का दृश्य... कल प्रधानमंत्री के Photoshoot में कोई कमी ना रह जाए इसलिए अस्पताल की मरम्मत की जा रही है। अगर भाजपा ने 27 वर्षों में काम किया होता तो आधी रात को अस्पताल को चमकाने की जरूरत न पड़ती।#BJPCheatsGujarat pic.twitter.com/h83iUmPzKA — AAP (@AamAadmiParty) October 31, 2022 గుజరాత్లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన పెను విషాద ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉండటం మరింత బాధకర విషయం.మరో 100 మంది గాయాలపాలయ్యారు. నదిలో గల్లంతైన వారికోసం సంఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటి వరకు దీనితో సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టు పొందిన ఒరివా కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో 123 ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు బయట ప్రైవేటుగా మందులు కొనాల్సిన అవసరం రాకుండా.. అవసరమైన ఔషధాలన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అత్యవసర, సాధారణ మందుల సంఖ్యను పెంచాలని.. కొత్తగా 123 రకాల మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తుండగా.. ఈ జాబితాను 843కు పెంచింది. ఇందులో అత్యవసర మందుల జాబితా (ఈఎంఎల్)లో 311, ఇతర సాధారణ (అడిషనల్) మందుల జాబితా (ఏఎఎల్)లో 532 మందులు ఉన్నాయి. తమిళనాడులో పరిశీలన జరిపి.. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. మందుల జాబితాను సంస్కరించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. దీనితో ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర జాబితా రూపొందించడంపై వైద్యారోగ్య శాఖ కసరత్తు చేసింది. ఇందులో భాగంగా టీఎస్ఎంఎస్ఐడీసీ బృందం తమిళనాడుకు వెళ్లి అక్కడి విధానంపై అధ్యయనం చేసింది. ఏఎంఎల్, ఈఎంఎల్ జాబితాలో ఎన్ని రకాల మందులున్నాయి, ప్రొక్యూర్మెంట్ విధానం ఎలా ఉంది వంటి అంశాలను పరిశీలించింది. పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ.. మందుల తుది జాబితాను రూపొందించింది. మొత్తం మందులను 30 కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీలో మందుల ఎంపిక కోసం ఆయా విభాగాల్లోని ఇద్దరు వైద్య నిపుణులను నియమించింది. తుది జాబితాను సిద్ధం చేసింది. ప్రొక్యూర్మెంట్ విధానంలో మార్పులు ఇప్పటివరకు అత్యవసర జాబితాలోని మందులు కావాలంటే ఇండెంట్ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడీ విధానాన్ని మార్చేశారు. అత్యవసర జాబితాలోని 311 మందులను ఇక మీద వినియోగం ఆధారంగా సేకరించనున్నారు. ప్రతి ఆస్పత్రి కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ జాబితాలోని 532 మందుల్లో 313 మందులను కేంద్రీకృత సేకరణ కింద టీఎస్ఎంఎస్ఐడీసీ సేకరిస్తుంది. దీనికోసం ఆయా విభాగాల హెచ్వోడీలు, సూపరింటెండెంట్లు ముందుగానే ఇండెంట్ పెడుతుంటారు. మరో 219 రకాల మందులను డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ కింద ఆస్పత్రులు నేరుగా సేకరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మొత్తం 843 రకాల మందుల్లో టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా 624 రకాలను సేకరిస్తారు. అవసరమైన మందులన్నీ అందుబాటులో.. చికిత్సలో భాగంగా అవసరమయ్యే ప్రతీ ఔషధాన్ని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచి.. రోగులకు పూర్తి ఉచితంగా అందించేందుకు సర్కారు కృషి చేస్తోంది. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా పెద్ద మొత్తంలో మందుల సేకరణ చేస్తూనే.. వికేంద్రీకృత విధానంలో భాగంగా అవసరమైన, అరుదైన మందులను ఆస్పత్రులు తక్షణమే కొనుగోలు చేసి రోగులకు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో పేద ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కొత్త విధానాన్ని వెంటనే అమలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల చేయనున్నట్టు సమాచారం. బయట మందులు కొనే అవసరం రాకుండా.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు అవసరమైన మందులను బయట ప్రైవేటుగా కొనే అవసరం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని.. అందులో భాగంగానే మందుల సంఖ్యను పెంచుతోందని అధికారులు చెప్తున్నారు. కొత్తగా పెంచిన మందుల్లో యాంటీ బయాటిక్స్, శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు, వివిధ రోగాల చికిత్సలో ప్రత్యేకంగా అవసరమయ్యే మందులు, చిన్న పిల్లలకు ఇచ్చే సిరప్లు ఉన్నట్టు సమాచారం. బీ1, బీ2, బీ 6, బీ12, కె, ఈ, డీ, సీ విటమిన్లు, ఐరన్ మాత్రలు, వివిధ విటమిన్ల కాంబినేషన్ మాత్రలు, క్లాక్సాసిల్లిన్, సిప్రొఫ్లాక్సిన్, క్లావులనేట్, సెపోడాక్సిన్, ఓ ఫ్లాక్సాసిల్లిన్ వంటి యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఉన్నట్టు తెలిసింది. వీటిని వివిధ మోతాదులలో అందుబాటులో ఉంచనున్నారు. అధికారికంగా జీవో విడుదలైన తర్వాత ఏయే రకాల మందులు, ఏయే మోతాదులలో సిద్ధంగా ఉంచుతారన్న పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
అధిక ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలి: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం రాకముందు 30 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేవని.. ప్రస్తుతం ఇది 60 శాతానికి చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 75 శాతానికి పెంచాలని ఆయన వైద్యులకు సూచించారు. అలాగే సహజ ప్రసవాలు జరిగేందుకు ఆశ కార్యకర్తలు, క్షేత్ర స్థాయిలోని సిబ్బంది కృషి చేయాలన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలో ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5,500 హెల్త్ సబ్ సెంటర్లు ఉండగా వాటిలో 202 సెంటర్ల పనితీరు బాగా లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది, మందుల కోసం నిధులను రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచామని, ఆస్పత్రిలో మందులు లేవని తెలిస్తే సంబం ధిత డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. బీపీ, షుగర్ ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తుందన్నారు. మూడు రంగుల బ్యాగుల్లో ఈ మందులు అందజేస్తామని అందులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే మందులు నెలకు సరిపడేవి ఉంటాయన్నారు. తనకు కూడా షుగర్, బీపీ ఉందని రోజూ మందులు వేసుకుని తిరుగుతున్నా అని తెలిపారు. రాష్ట్రంలోనే ఆశ కార్యకర్తల వేతనాలు అధికం బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఆశ కార్యకర్తలకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. ప్రతి నెలా 3వ తేదీన ఆశ కార్యకర్తలు మొదలు జిల్లా వైద్య అధికారి వరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమయపాలన పాటించని, విధిని ర్వహణలో అలసత్వం వహించే వైద్యులు, ఉద్యోగులపట్ల చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. దించిన తల ఎత్తొద్దు సిద్దిపేట టీఆర్ఎస్ కార్యాలయంలో టెట్‌కు సంబంధించి కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ఈ రెండు నెలలు దించిన తల ఎత్తొద్దన్నారు. అప్పుడే జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారన్నారు. హైదరాబాద్ కంటే ఇక్కడ అద్భుతంగా కోచింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. -
ఆర్థోపెడిక్ అంతా ఆరోగ్యశ్రీలో
సాక్షి, హైదరాబాద్: అన్నిరకాల ఆర్థోపెడిక్ చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రైవేట్‌కు పోటీ గా ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్ వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆరోగ్యశ్రీ కింద నిధులను విడుదల చేశామని, ఈ నిధులను స్థానిక సూపరింటెండెంట్లు వాడుకొని ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థోపెడిక్ వైద్యులతో మంత్రి ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్ సేవలపై సమీక్షించారు. ఈ విభాగంలో ప్రజలకు మెరు గైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని ఆస్పత్రులకు తగినంత బడ్జెట్ ఇచ్చామని, పేద ప్రజలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో చేయలేనివే హైదరాబాద్‌కు రిఫర్ చేయాలి ‘మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి అన్ని వసతులను ప్రభుత్వాస్పత్రుల్లో సమకూర్చాం. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్ మెషీన్లు ఏర్పాటు చేశాం. మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడాలి. దీనివల్ల పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది’అని మంత్రి అన్నారు. సూపరింటెండెంట్లు ఆర్థోపెడిక్ వైద్యులకు సహకారం అందించాలని కోరారు. ‘జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేశాం. అధునాతన వైద్య పరికరాలు సమకూర్చాం. జిల్లాల్లో అందించలేని చికిత్సలనే హైదరాబాద్‌కు రిఫర్ చేయాలి’అని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. బడ్జెట్లో వైద్య పరికరాలకు రూ. 500 కోట్లు, సర్జికల్‌కు రూ. 200 కోట్లు, వైద్య పరీక్షలకు రూ. 300 కోట్లు, మందులకు రూ. 500 కోట్లు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 1,250 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ వైద్య సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు, ఇతర సిబ్బందికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. అందరూ మరింత కష్టపడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రణాళికతో ముందుకెళ్తే మరింత ప్రయోజనం: గురువారెడ్డి తమ ఆస్పత్రుల్లో ప్రణాళికాబద్ధమైన విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి చికిత్స అందించగలుగుతున్నామని, ఇదే పద్ధతిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాటిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం జరుగుతుందని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు గురువారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఏ సమయంలోనైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైద్యులు అంకితభావంతో పేషెంట్ల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందించడం సాధ్యమవుతుందని మరో ఆర్థోపెడిక్ వైద్యుడు అఖిల్ దాడి అన్నారు. కొత్త చికిత్స విధానాలపై పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, దీని వల్ల వైద్యులకు ఆసక్తి పెరుగుతుందని డాక్టర్ నితిన్ చెప్పారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరోనా పాజిటివ్.. అయినా బుద్ధి మారలేదు.. చివరకు!
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నీరటి రమేశ్ థియేటర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో 22 నెలలు మెడికల్ లీవ్ పెట్టాడు. తిరిగి విధుల్లో చేరిన రమేశ్ మెడికల్ లీవులకు సంబంధించిన బిల్లు తీసుకునేందుకు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్.సురేందర్ వద్దకు ఫైలు వెళ్లింది. ఫైలును పరిశీలించిన సురేందర్ అందులో చాలా లోపాలున్నాయని, వాటిని మార్చాల్సి ఉందని చెప్పాడు. ఫైలును పట్టించుకోకుండా పలుమార్లు రమేశ్‌ను అతడి చుట్టూ తిప్పుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు సురేందర్ వద్దకు వెళ్లిన రమేశ్ పని తొందరగా చేసి పెట్టాలని బతిమిలాడాడు. మొదట రూ.15 వేలు ఇస్తే చేసిపెడతానని రమేశ్‌కు చెప్పగా, అప్పటికే సురేందర్ వద్దకు చాలాసార్లు తిరిగి విసిగిపోయిన అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తర్వాత సురేందర్ వద్దకు వెళ్లి అంత ఇచ్చుకోలేనని రూ.12 వేలు ఇస్తానని తెలిపాడు. మంగళవారం రూ.12 వేలు సురేందర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చదవండి: అవన్నీటితో సంబంధం లేదు.. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ... అయితే.. సురేందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధులు దూరంగా వెళ్లారు. కాగా, అతడి వద్ద నుంచి రికార్డులు స్వాధీనం చేసుకొని పరిశీలించిన అనంతరం ఇంట్లో సోదాలు జరిపామని, సురేందర్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. లంచం ఇవ్వాలని ఎవరైనా ఉద్యోగి డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని కోరారు. -
Khammam: ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న అదనపు కలెక్టర్ స్నేహలత, ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌లను రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి.. స్నేహలతకు జన్మించిన చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. భార్యాభర్తలిద్దరూ ఉన్నతాధికారులైనా.. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. చదవండి: కాళ్లు కడిగి.. కన్యాదానం చేసి.. ఆదర్శంగా నిలిచిన ముస్లిం దంపతులు చిన్నారిని ఎత్తుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. చిత్రంలో స్నేహలత, ఆమె భర్త శబరీశ్ తదితరులు కాగా ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత , భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీ శబరీస్ దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. స్నేహలత సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. డెలివరీ టైం అని వైద్య సిబ్బంది కలెక్టర్ స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. తల్లిబిడ్డా క్షేమమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ కలెక్టరమ్మ డెలివరీ న్యూస్ నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడుపోసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ స్నేహలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. చదవండి: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’ -
యాదాద్రి: వైద్యం అందక రిక్షాలోనే వృద్ధురాలి మృతి
సంస్థాన్ నారాయణపురం: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ నిరుపేద వృద్ధురాలు ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్యం కోసం వేచి చూసి ప్రాణాలొదిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన పూస బాలమ్మ(80) ఆలనాపాలనా చూసేవారు లేరు. దీంతో కొద్దిరోజుల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నివసిస్తున్న కూతురు సైదమ్మ వద్దకు వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలమ్మ 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించింది. దీంతో సంస్థాన్ నారాయణపురం పీహెచ్‌సీకి తీసుకొచ్చి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. వైద్యం కోసం గంటపాటు రిక్షాలోనే ఎదురుచూసింది. వైద్యురాలు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. తన తల్లి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సైదమ్మ ఆరోపించింది. ‘ఆహారం తీసుకోకపోవడంతో బాలమ్మ నీరసంగా ఉంది, పల్స్ పడిపోవడంతోనే మృతి చెందింది. నేను సిబ్బందితో నెలవారీ సమావేశంలో ఉన్నా. తెలిసిన వెంటనే వచ్చి పరిశీలించాను’అని వైద్యురాలు దీప్తి వివరణ ఇచ్చారు. -
ఇక సాధారణ చికిత్సలు షురూ
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో గణనీయంగా కేసులు పెరగడంతో చాలావరకు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకే పరిమితమైన సంగతి తెలిసిందే. అత్యవసర చికిత్సలు మినహా సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను సైతం ఆస్పత్రులు వాయిదా వేస్తూ వచ్చాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, కొత్తగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు కూడా బాగా తగ్గడంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ చికిత్సల పునరుద్ధరణకు అనుమతి ఇస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని కోవిడ్ చికిత్సను పూర్తిగా నిలిపివేసి సాధారణ కేసులను అడ్మిట్ చేసుకుంటున్నాయి. కరోనా చికిత్స అందిస్తున్నారంటే సాధారణ రోగులు రావడానికి వెనుకాడతారనే ఉద్దేశంతో చాలా ఆసుపత్రులు కోవిడ్ చికిత్సను విరమించుకున్నాయి. కరోనా పడకల్లో 91.11 శాతం ఖాళీ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 55,442 పడకలను కరోనా సేవల కోసం కేటాయించారు. వాటిల్లో ప్రస్తుతం 4,931 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారు. అంటే 91.11% పడకలు ఖాళీగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా సాధారణ ఐసొలేషన్ పడకలు 96.02 శాతం ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వెయ్యి లోపుగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని పడకలను ఇప్పుడు సాధారణ చికిత్సలకు కేటాయించడం ప్రారంభించారు. తమ ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు ప్రారంభించినట్లు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రచారం కూడా చేస్తున్నాయి. ఇలా కోవిడేతర రోగులు ఆసుపత్రులకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అదనపు చెల్లింపులకు కోత కరోనా కేసులు బాగా పెరిగిన సమయంలో డాక్టర్లు, నర్సులకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర అలవెన్సులు ఇచ్చిన ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పుడు వాటిని గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుతం కరోనా చికిత్సలో పాల్గొనే వారికి మినహా మిగిలినవారి అదనపు వేతనాల్లో కోత విధించాయి. నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా ఎక్కువ జీతాలతో తీసుకున్న కొన్ని యాజమాన్యాలు ప్రస్తుతం వారిని విధుల నుంచి తొలగించాయి. ‘కేరళ సహా ఇతర రాష్ట్రాల నుంచి కొందరు నర్సులను ప్రత్యేకంగా తీసుకొచ్చాం. వారిలో కొందరికి నెలకు రూ. 50 వేల వరకు ఇచ్చాం. ఇప్పుడు వారితో అవసరం లేదు. కాబట్టి వారిని పంపించాం. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం’ అని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రులకు పోస్ట్ కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైద్యం అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల తాజా పరిస్థితి 1. మొత్తం కరోనా పడకలు – 55,442 కరోనా రోగులతో ఉన్నవి – 4,931 ఖాళీగా ఉన్నవి – 50,511 2. ఇందులో సాధారణ పడకలు – 21,846 కరోనా రోగులు ఉన్నవి – 871 ఖాళీగా ఉన్నవి – 20,975 3. ఆక్సిజన్ పడకలు – 21,751 కరోనా రోగులు ఉన్నవి – 2,266 ఖాళీగా ఉన్నవి – 19,485 4. ఐసీయూ పడకలు – 11,845 కరోనా రోగులు ఉన్నవి – 1,794 ఖాళీగా ఉన్నవి – 10,051 -
నా బదిలీ వెనుక మంత్రి సత్యవతి కుట్ర
సాక్షి, మహబూబాబాద్: పదవీ విరమణకు 16 నెలల సమయమే ఉన్నప్పటికీ తనను అకారణంగా బదిలీ చేశారని, ఇందుకు మంత్రి సత్యవతి రాథోడే కారణమని డాక్టర్ ఎస్.భీంసాగర్ ఆరోపించారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను తాజాగా హైదరాబాద్ లోని టీవీవీపీ రాష్ట్ర జాయింట్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్‌గా బదిలీ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన కన్నీరు మున్నీరయ్యారు. మంత్రి బంధువుకు సూపరింటెండెంట్ పదవి కట్టబెట్టేందుకే తనను బదిలీ చేయించారని పేర్కొన్నా రు. మంత్రి కుమారుడు, ఛాతీ వైద్య నిపుణుడు సతీష్ రాథోడ్ నెలలో వారం రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని, అయినప్పటికీ పూర్తి జీతం ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను లక్ష్యంగా చేసుకుని బదిలీ చేయించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పదోన్నతి ఇవ్వకపోగా, కేవలం డిప్యుటేషన్‌పై బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పని హైదరాబాద్‌లో చేస్తూ వేతనం మహబూబాబాద్‌లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమేనన్నారు. కాగా, సూపరింటెండెంట్ డాక్టర్ భూక్యా వెంకట్రాములు మాట్లాడుతూ, భీంసాగర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి సత్యవతి, ఆమె కుమారుడు డాక్టర్ సతీ‹Ùతో పాటు తనపై వ్యతిరేక ప్రచారం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. -
చేయి నరికి.. ఎత్తుకెళ్లి
నిజామాబాద్ అర్బన్: ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆపై చేయి నరికి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆస్పత్రి ఆవరణలోని మార్చురీ విభాగం ఎదుట మహిళా మృతదేహం ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు విచారణ చేపట్టారు. నగరంలోని గోసంగి కాలనీకి చెందిన శైలజ (28)గా గుర్తించారు. చేతిని నరకడంతో తీవ్ర రక్తస్రావం అయి ఘటనా స్థలంలోనే మహిళ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, రాత్రి 10 గంటల సమయంలో తన భార్య ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినట్లు భర్త శివానంద్ పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని తీసుకొచ్చి పడేశారా? ఈ హత్య కేసులో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళను వేరేచోట హత్య చేసి ఇక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నారు. ‘చేతిని నరికితే తీవ్ర రక్తస్రావం అవుతుంది. అయితే..మృతదేహం వద్ద పెద్దగా రక్తం లేదు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారు’అని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆస్పత్రి చుట్టుపక్కల డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోకి ఎవరెవరు ప్రవేశించారు. మార్చురీ వైపు ఏ మైన వాహనాలు వెళ్లాయా..? అనే కోణాలపై సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్నారు. అయితే.. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీ సులు గుర్తించారు. మహిళకు సంబంధించిన ఫోన్ కాల్స్, ఎవరైన శత్రువులు ఉన్నారా అని అతని కుటుంబీకుల ద్వారా విచారణ చేపడుతున్నారు. ఆస్పత్రి వెనుక భాగంలో మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చి పడేసిన ఘటన ఎస్పీఎఫ్ దృష్టికి రాకపోవడం విశేషం. -
గంటల వ్యవధిలో 9 మంది చిన్నారుల మృతి
జైపూర్: రాజస్తాన్‌లోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే 9 మంది నవశాత శిశువులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. ఈ ఏడాది కూడా ఇదే రీతిన నవజాత శిశువులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి జేకే లోన్ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు మరణించగా, గురువారం మరో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన చిన్నారులంతా 1-4 రోజుల వయస్సులోపు వారే అని రాజస్తాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. (చదవండి: 480 గ్రాముల శిశువు) ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా చిన్నారుల మరణాలు సాధారణమైనవేనని తెలిపారు. డివిజనల్ కమిషనర్ కేసీ మీనా, జిల్లా కలెక్టర్ ఉజ్జవల్ రాథోర్ గురువారం సాయంత్రం ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు. చిన్నారుల మరణాలపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. శిశువుల చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. కాగా కోటా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆరోగ్య మంత్రికి పంపిన నివేదిక ప్రకారం, పుట్టుకతోనే వైఫల్యాలు రావడంతో ముగ్గురు శిశువులను జేకే లోన్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వీరికి చికిత్స అందిస్తుండగా.. మరణించారు. మిగితా శిశువులవి ఆకస్మిక మరణాలు అని నివేదికలో తెలిపారు. -
అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
సాక్షి, అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కోవిడ్ వార్డులో పక్కనే ఉన్న రికార్డు రూమ్‌లో అర్థరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్, రికార్డులు దగ్ధం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఐడీ వార్డులో ఉన్న 24మంది కోవిడ్ పేషెంట్లను మరో వార్డులోకి తరలించారు. జిల్లా కలెక్టర్ సత్య యేసుబాబు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రిని ఏపీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని బుధవారం ఉదయం పరిశీలించారు. స్టేషనరీ గదిలో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, డీఎం అండ్ హెచ్ఓల నుంచి ఆళ్లనాని వివరాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ పేషెంట్లకు ఏలోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆళ్ల నాని తెలిపారు. ఖైదీ ఆత్మహత్య అనంతపురం : జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్బర్ బాషా లుంగీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వార్డెన్లు వెంకటకృష్ణ, నవీన్‌కుమార్‌పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. -
‘ఊపిరాడటం లేదు.. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండి’
లక్నో : చనిపోయే కొన్ని నిమిషాల ముందు కరోనా పేషెంట్ ఆస్పత్రిలో రికార్డు చేసిన ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని సౌకర్యాల కొరత కారణంగా తను అనుభవిస్తున్న బాధను వీడియో రూపంలో పంచుకున్నాడు. ఇందులో అతడు ఊపిరిపీల్చుకోడానికి ఇబ్బంది పడుతూ, షర్ట్ రక్తంతో తడిసిపోయినట్లు కన్పిస్తోంది. ఇక సోమవారం బాధితుడు మరణించడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కరోనా రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల కల్పనపై యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు. (పేరుకు పెద్ద సాయం.. కానీ, అంతా మోసం ) 52 సెకన్ల ఈ వీడియోను ఝాన్సీ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేరిన కరోనా బాధితుడు సోమవారం చిత్రీకరించాడు. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘ఆస్పత్రిలో నీటికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నా నోరు పొడిబారుతోంది. వెంటిలేటర్ వల్ల ఊపిరాడటం లేదు. నన్ను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండి. ఇక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఏ విధమైన ఏర్పాట్లు లేవు. నా మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’. అని కరోనా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాక అతను మొబైల్ కెమెరాలో కోవిడ్ వార్డును చూపించినప్పుడు, అతని చుట్టూ ఎంతో మంది ఇతర రోగులు ఆసుపత్రి పడకలపై పడి ఉన్నట్లు తెలుస్తోంది. (చివరి ప్రయాణానికి చేయూత) అయితే దీనిపై స్పందించిన ఝాన్సీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ అధికారి జీకే నిగమ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. చిత్రీకరించిన వీడియోకు అతని మరణానికి మధ్య ఉన్న సమయ అంతరం స్పష్టంగా లేదని అన్నారు. మృతి చెందిన వ్యక్తి భార్య, కుమార్తె సైతం కోవిడ్ బారిన పడినట్లు.. వారు మరో వార్డులో వైద్యం పొందుతున్నట్లు వెల్లడించారు. కానీ వీడియోలో చేసిన ఆరోపణలపై మాత్రం అధికారి నోరు విప్పకపోవడం గమనార్హం. (టీ పెట్టుకుంటున్నా.. బట్టలు ఉతుక్కుంటున్నాను: సీఎం) -
ఆసుపత్రి ప్రమాణాలు ప్రపంచ స్థాయికి పెంచాం
న్యూఢిల్లీ : ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్‌గా ఉన్న దశ నుంచి ఇప్పుడు కరోనాపై విజయం సాధిస్తోన్న స్థాయికి ఢిల్లీ చేరిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం బురారీలో 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వ ఆసుత్రుల్లో మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసిపోకుండా పెంచామని రానున్న కాలంలో మరిన్ని ఆసుప్రతులు నిర్మించనున్నట్లు తెలిపారు. గత నెలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని, మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. (‘త్వరలో కరోనా లక్షణాలకు ఐఐటీ బ్యాండ్’) జూన్ 23న ఒక్కరోజే అత్యధికంగా 3947 కేసులు నమోదవగా ప్రస్తుతం వెయ్యికి తక్కువగానే కేసులు నమోదవుతున్నాయన్నారు. పరీక్షల సామర్థ్యం పెంచడం, సాధ్యమైనంత త్వరగా ట్రేసింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా కరోనా కేసులు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు. ప్రతీ ఒక్కరి కృషి, సామాజిక స్పృహతో ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక 24 గంటల్లో 1025 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 32 మంది మరణించారు. ఇప్పటివరకు దేశ రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,28,389కు చేరుకోగా, 3777 మంది మరణించారు. (ఇక రూ.400 లకే కరోనా పరీక్షలు!) -
ఆక్సిజన్ అందక బాధితుడి మృతి
-
వైరల్: ఆపరేషన్ చేస్తుండగా టిక్‌టాక్!
సాక్షి, హుజురాబాద్: వైద్యులు ఆపరేషన్ చేస్తుండగా తీసిన టిక్‌టాక్ వీడియో ఒకటి కలకలం రేపింది. ఈ ఘటన తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గం హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది. డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, మరికొందరు సిబ్బంది ఓ పేషంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా టిక్‌టాక్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బిగిల్ చిత్రంలోని ఓ డైలాగ్‌తో నడిచే ఈ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో స్థానికులు, పేషంట్ల ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే ఆస్పత్రిలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ డాక్టర్‌ను గతంలో సస్పెండ్ చేయడం గమనార్హం. ఆ టిక్‌టాక్‌తో సంబంధం లేదు.. కాగా, టిక్‌టాక్ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ‘ఆపరేషన్ చేస్తుండగా సాధారణంగా వీడియో తీసి పేషంట్ తరపు వారికి ఇస్తాం. అరుదైన శస్త్ర చికిత్సల సమయంలో వీడియో తీసి మీడియాకు అందచేస్తాం. ఎవరో కావాలనే ఆపరేషన్ థియేటర్లో మామూలుగా తీసిన వీడియోను ఎడిట్ చేసి టిక్‌టాక్‌లో పెట్టారు. నేను టిక్ చేసినట్టు రుజువైతే దేనికైనా సిద్ధం. అది నా ఐడీ కూడా కాదు’అని శ్రీకాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. -
డాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల తీరుపై వైఎస్సార్సీపీ స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమయానికి అనస్థీషియా డాక్టర్ లేకపోవడంతో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నట్టు గమనించారు. దీంతో ఆపరేషన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే డాక్టర్‌ను రప్పించాలని ఆదేశించారు. దీంతో స్పందించిన యాజమాన్యం హుటాహుటిన చర్యలు ప్రారంభించింది. అనకాపల్లి నుంచి అనస్థీషియా డాక్టర్‌ను రప్పిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, డాక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటానంటూ ఎమ్మెల్యే ఆస్పత్రిలోనే కూర్చున్నారు. -
ఆసుపత్రిలో కేటీఆర్ ఆకస్మిక తనిఖీ
-
'టైంపాస్ ఉద్యోగాలు వద్దు'
సాక్షి, సిరిసిల్ల : టైంపాస్ ఉద్యోగాలు వద్దని..చిత్తశుద్ధి, అంకితభావం, సేవాభావంతో పని చేసే వారు కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కేటీఆర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులతో కేటీఆర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజల్లో నమ్మకాన్ని పెంచామన్నారు. కేసీఆర్ కిట్ల పథకంతో సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపు అయిందన్నారు. ప్రజారోగ్య మెరుగుకు సీఎం కేసీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో ఐసీయూ సెంటర్, బ్లడ్‌బ్యాంక్, డయాలసిస్ సెంటర్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని ఇంత చేస్తున్నా..ఎందుకు చెడ్డపేరు వస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసలు ఉన్నవాళ్లు ఎటైనా పోతరు..కానీ పేదలు సర్కారు ఆస్పత్రికి వస్తే.. కరీంనగర్ పొమ్మని చెప్పడం సరికాదన్నారు. పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. నలుగురు గైనకాలజిస్ట్‌లను నియమిస్తాం.. సిరిసిల్ల ఆస్పత్రిలో ఏడుగురు గైనకాలజిస్ట్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లేకపోవడం సరికాదన్నారు. సిరిసిల్లకు పోస్టింగ్ ఇస్తే..కొద్ది రోజులు పని చేసి వెళ్లిపోతున్నారని ఇది సరికాదన్నారు. నలుగురు గైనకాలజిస్ట్‌లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమార్‌తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి సిరిసిల్ల ఆస్పత్రికి గైనకాలజిస్ట్‌లను నియమించాలని కోరారు. ఎవరైనా సిరిసిల్లలో వైద్యసేవలు అందించేందుకు ఆసక్తితో ఉన్న మహిళాడాక్టర్లు ఉంటే వారి వివరాలు సేకరించాలని వైద్యులను కోరారు. గతంతో పోల్చితే ఆస్పత్రిలో ఎంతో మార్పు వచ్చిందని ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. తక్షణ అవసరాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రిలో పని చేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్ల పేర్లు అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించగా..రోజూ 450 నుంచి 600 మంది వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. 300 పడకల ఆస్పత్రిగా విస్తరిస్తాం.. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిని వంద పడకల నుంచి 300 పడకల ఆస్పత్రిగా విస్తరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. కోర్టు భవనం స్థలాన్ని సేకరించేందుకు కలెక్టర్ మాట్లాడుతున్నారని, వారిని ఒప్పించి కోర్టుకు మరోచోట విశాలమైన స్థలాన్ని అప్పగిస్తామన్నారు. ప్రజలకు ఆస్పత్రి అందుబాటులో ఉండేలా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా విస్తరిస్తామన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో సిటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సిరిసిల్ల ఆస్పత్రిని సందర్శించాలని కోరుతామని కేటీఆర్ అన్నారు. నర్సింగ్ కాలేజీ పూర్తి అవుతుందన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. భవనం ఊరుస్తున్న విషయాన్ని గుర్తించిన కేటీఆర్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి రిపేరు చేయించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతికి సూచించారు. పారిశుధ్యం ఎలా ఉంది.. బెడ్షీట్లు మార్చుతున్నారా..? ఆస్పత్రిలో పారిశుధ్యం ఎలా ఉంది.. రోజూ బెడ్షీట్లు మార్చుతున్నారా అని కేటీఆర్ ఆరా తీశారు. ఏడు రకాల బెడ్షీట్లు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. రెండురకాలు ఉన్నాయని డాక్టర్లు వివరించారు. రోజూ బెడ్షీట్లు మార్చాలని, పారిశుధ్యం బాగుండాలని కేటీఆర్ సూచించారు. సిరిసిల్లలో ఇంత మంది డాక్టర్లు ఉండి.. ప్రసూతికోసం వచ్చే వారిని కేవలం గైనకాలజిస్ట్ లేరనే కారణంతో కరీంనగర్‌కు పంపడం సరికాదని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలోని ఖాళీలను భర్తీ చేయిస్తామని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రం..పేదలు ఎక్కువగా ఉండే ఇక్కడ ప్రభుత్వ వైద్యం బాగుండాలని కేటీఆర్ కోరారు. అధికారుల హడావుడి సిరిసిల్ల ఆస్పత్రికి చంద్రంపేటకు చెందిన స్వప్న అనే గర్భిణి గురువారం రాగా కడుపులో పాప మరణించింది. ఆస్పత్రిలో మహిళా డాక్టర్ లేక ప్రసూతి సేవలు అందడం లేదని శుక్రవారం పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆస్పత్రి సలహా సంఘం అధ్యక్షుడైన ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీకి వచ్చారు. కేటీఆర్ వస్తున్నట్లు తెలియడంతో అధికారులు హడావుడిగా ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్ రాగానే ముందుగా డాక్టర్లతో సమీక్షించి ఆస్పత్రిలో కలియతిరిగారు. పారిశుధ్య సిబ్బంది జీతాలు రావడం లేదని కేటీఆర్‌కు విన్నవించారు. ప్రసూతి వార్డులో బాలింతలతో కేటీఆర్ మాట్లాడారు. ఆస్పత్రిలోని బాలింత మహిళ కేటీఆర్‌తో సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ ఆర్.తిరుపతి, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ డాక్టర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో టిక్‌టాక్ కలకలం
సాక్షి, కదిరి టౌన్: కదిరి ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం టిక్‌టాక్ వీడియోలు కలకలం రేపాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిపై జిల్లా వైద్య శాఖతో పాటు కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగినితోపాటు సహకరించిన మరో ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. వివరాల్లోకెళితే.. కదిరి ప్రభుత్వాస్పత్రిలో సద్గుణ, శైలజ మెడాల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు ల్యాబ్‌లోనే కాలక్షేపానికి టిక్‌టాక్ వీడియోలు చిత్రీకరించుకుని పోస్ట్ చేసేవారు. అందులో భాగంగానే శుక్రవారం కూడా వీడియోలు తీశారు. దీంతో ల్యాబ్‌లో పరీక్షల కోసం వచ్చిన కొందరు రోగులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఆయన ముందుగా వారికి మెమో ఇచ్చారు. అనంతరం జిల్లా వైద్యాధికారులు, కలెక్టర్ సత్యనారాయణలు ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వీడియోతో నాకు సంబంధం లేదు టిక్‌టాక్ వీడియోతో తనకు సంబంధమేమీ లేదని ల్యాబ్‌టెక్నీషియన్ సద్గుణ రోదించింది. ఆస్పత్రి క్యాంటీన్లో కావాలనే శైలజ తనను వీడియోలో కనపడేటట్లు చేసిందని తెలిపింది. క్యాంటీన్ వీడియోలో మాత్రమే తానున్నానని, ల్యాబ్‌లో చిత్రీకరించిన వీడియోలో తాను లేనని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరింది. -
వ్యక్తి కుర్తాలోకి చొరబడిన పాము
-
కుర్తాలో దూరిన పాము..కదిలితే!!
ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుర్తాలోకి పాము చొరబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన బంధువుల్లోని వ్యక్తి అనారోగ్యపాలైతే చూడటానికి వచ్చిన ఓ ముసలాయన.. హాస్పిటల్ ఆవరణలో నేల మీద పడుకున్నాడు. ఎప్పుడు, ఎలా వచ్చిందో తెలీదు కానీ.. అనూహ్యంగా ఆయన కుర్తాలోకి పాము దూరింది. మొదట ఇది అతను గమనించుకోలేదు. తర్వాత హాస్పిటల్ సిబ్బంది గమనించి ఆ వ్యక్తికి తెలిపారు. భయభ్రాంతులకు గురైన ఆ వ్యక్తి.. కదిలితే పాము ఎక్కడ కాటేస్తుందోనని అలాగే ఉండిపోయాడు. కాగా హాస్పిటల్ సిబ్బంది వన్యప్రాణి సంరక్షణ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది ముసలాయనను లేపకుండానే ఆ పామును బయటకు తీశారు. ఈ పాము గ్రీన్ కీల్ బాక్‌గా గుర్తించారు. ఇది విషరహితమైనదని తెలిపి అనంతరం పామును అడవిలో విడిచి పెట్టారు. కాగా ఇటీవల జనావాసాల్లోకి పాములు చొరబడుతున్న ఘటనలు తరచుగా జరుగుతన్న సంగతి తెలిసిందే. -
కడుపులో కత్తెర మరచినందుకు భారీ జరిమానా
సాక్షి, అమరావతి: ఆపరేషన్ సమయంలో కడుపులో కత్తెర పెట్టి అలాగే మరచిపోయినందుకు గాను జాతీయ మానవహక్కుల కమిషన్ ఏపీ ప్రభుత్వానికి రూ.3 లక్షల జరిమానా విధించింది. బాధితుడికి రూ.3 లక్షలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నెల్లూరు జిల్లా కొత్తకలువకు చెందిన పి.చలపతికి కొద్ది నెలల క్రితం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులోనే కత్తెర మరచి కుట్లు వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తీవ్రంగా కడుపునొప్పి వచ్చి అతను మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా కడపులో కత్తెర ఉన్నట్టు గుర్తించి తిరిగి ఆపరేషన్ చేసి తీశారు. దీనిపై బాధితుడు హెచ్చార్సీని ఆశ్రయించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తనకు అన్యాయం జరిగిందని, తనకు పరిహారం వచ్చేలా చూడాలని విన్నవించారు. దీనికి స్పందించిన హెచ్చార్సీ... బాధితుడికి రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు బాధితుడికి రూ.3 లక్షలు మంజూరు చేస్తూ శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. -
ప్రసవం కోసం వెళ్తే ప్రాణం తీశారు
కోల్‌సిటీ(రామగుండం): సర్కారు ఆస్పత్రిపై నమ్మకంతో ప్రసవం కోసం వెళ్తే... వైద్యుల నిర్లక్ష్యంతో లేబర్ రూం(ప్రసూతీ కేంద్రం)లోని టేబుల్‌పైనే, గర్భిణీ లింగంపల్లి విజయ(30), కడుపులోని బిడ్డ ప్రాణాలు విడిచారు. డాక్టర్లకు బదులు సిబ్బంది ప్రసవం చేస్తున్న సమయంలో బిడ్డ బయటకు వచ్చిందని చెప్పినప్పటికీ మూడు గంటలపాటు వైద్యులు రాకుండా నిర్లక్ష్యం వహించి నిండుచూలాలును పొట్టనపెట్టుకున్నారు. దీంతో మృతురా లి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. నార్మల్ డెలివరీ కోసం అడ్మిట్... గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన రేణికుంట సుగుణ, రాజయ్యల కూతురు లింగంపల్లి విజయ(30)కు కరీంనగర్ జిల్లాలోని చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన రేణికుంట శ్రీనివాస్‌తో వివా హం జరిపించారు. ప్రస్తుతం మహారాష్ట్రంలోని నాగపూర్ ప్రాంతంలో శ్రీనివాస్ పని చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. విజయ రెండోసారి గర్భం దాల్చింది. గత నెల రాఖీపౌర్ణమికి గోదావరిఖనిలోని పుట్టింటికి వచ్చింది. ఈనెల 9న డెలివ రీ చెయ్యాల్సి ఉంది. పురుటి నొప్పులు రాకపోవడంతో 12న గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. మొదటి కాన్పు సాధారణ ప్రసవం జరిగిందని, ఇప్పుడూ నార్మల్ డెలివరీ చేస్తామని పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. సకాలంలో స్పందించని వైద్యులు... శుక్రవారం ప్రసూతి కేంద్రంలోని డెలివరీ టేబుల్‌పై విజయను పడుకోబెట్టారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే నర్సింగ్ సిబ్బంది, శిక్షణ పొందడానికి వచ్చిన స్టూడెంట్స్‌తో సాధారణ ప్రసవానికి సిద్ధమయ్యారు. పురిటినొప్పులు రావడానికి ఇంజక్షన్లు ఇచ్చారు. కాసేటికి శిశువు తల బయటకు కనిపించడంతో, విజయతో ఉన్న మహిళ వెంటనే సిబ్బందికి చెప్పింది. డాక్టర్లతో ఫోన్లో మాట్లాడుతూ ప్రయత్నించిన సిబ్బంది ఇంజక్షన్ వేశారు. విజయ అపస్మారకస్థితిలో ఉండడంతో డాక్టర్లను పిలుచుకొస్తామని చెప్పిన సిబ్బంది మూడుగంటలపాటు పత్తాలేకుండా పోయారు. తర్వాత హడావుడిగా వచ్చిన డాక్టర్లు, విజయను పరీక్షించి వెంటనే వెళ్లిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా పోలీసులు వచ్చారు. ఏం జరిగిందని నిలదీస్తే విజయ చనిపోయిందని చెప్పారు. ఆస్పత్రిలో సమాధానం చెప్పడానికి ఒక్క డాక్టర్ కూడా లేకుండా మాయమయ్యారు. మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని మార్చురీలో భద్రపరిచారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో... విజయ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు ప్రధానరహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసుల జోక్యంతో విరమించి, ఆస్పత్రి ఆవరణలోని మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి శాప్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అండగా నిలిచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామని సీఐ వాసుదేవరావు హామీ ఇవ్వడంతో ఆందోళన వివరమించారు. అనంతరం బంధువుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినందుకు..
సాక్షి, చిత్తూరు : ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. వివరాలు.. పుత్తూరు పట్టణం ఆచారి వీధికి చెందిన నిఖిలను డెలివరీ కోసం శనివారం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆదివారం రాత్రి ఆమె మరణించింది. ప్రసవానంతరం సరైన చికిత్స చేయకుండా నిఖిల మరణానికి కారణమయ్యారంటూ ఆస్పత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. -
కార్పొరేట్ వైద్యం ప్రజావ్యతిరేకం
ఒక అర్థశతాబ్ది క్రితం అన్ని తరగతుల వారికి ఉన్నవారికి లేనివారికి వైద్య సదుపాయం సర్కారీ దవాఖానాల్లోనే దొరికేది. వైద్యులు రోగుల నుంచీ, వారి బంధువుల నుంచీ కొంత మొత్తాన్ని వసూలు చేసేవారు. నాల్గవ తరగతి ఉద్యోగులూ మామూళ్ల కోసం పీడించేవారు. దీంతో నాలాంటి వాళ్లం ప్రైవేటు రంగంలో వైద్య సదుపాయాలు విస్తరిస్తే మెరుగైన వైద్యం లభించే అవకాశం ఉంటుందని భావించాము. ఆ క్రమంలో దేశంలో ప్రప్రథమంగా అపోలో ఆసుపత్రుల సముదాయం మొదలైంది. ఈ 50 ఏళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులు సంపన్నులకు, పేదలకు కూడా వైద్య సదుపాయాలు కల్పించే ప్రధాన కేంద్రాలుగా ఏర్పడ్డాయి. అయితే కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ, వాటి అనైతిక కార్యక్రమాలు చూసిన తర్వాత సర్కారీ దవాఖానలే కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా వెయ్యిరెట్లు నయం అనే భావన మాలాంటి చాలామందిలో ఈనాడు కలుగుతున్నది. ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో తమ బాధ్యతను పూర్తిగా వదిలేసిన ప్రభుత్వాలు, ఎటువంటి నియంత్రణ లేక అనైతిక కార్యక్రమాలకు నెలవైన ప్రైవేట్ కార్పొరేట్ వైద్య రంగం, పూర్తిగా పరిణతి చెందని వైద్య బీమా రంగం కలిసి ఒక అసంపూర్ణ ఆరోగ్య వ్యవస్థ రూపుదిద్దుకోవటానికి దోహదం చేశాయి. దీంతో ప్రజల ఆరోగ్య ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నది. 2014–15 ఆరోగ్య గణాంక అంచనాల ప్రకారం ఆరోగ్యపరమైన ఖర్చులు 71% ప్రజలే భరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం 8%, రాష్ట్ర ప్రభుత్వాలు 13% భరించగా ఆరోగ్య బీమా వ్యవస్థ కేవలం 3.7 శాతం మాత్రమే భరించింది. ఇక ఆరోగ్యం మీద చేసిన ఖర్చులలో 26% ప్రైవేటు ఆసుపత్రులకు 14శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు 29 శాతం మందుల మీద ఖర్చయింది. స్థూల జాతీయోత్పత్తిలో 3.89% ఆరోగ్య రంగంపై ఖర్చు కాగా జాతీయోత్పత్తిలో కేవలం 1.3 శాతం మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక ఆరోగ్యబీమా రంగం నుంచి జరిగిన ఖర్చు పైన పేర్కొన్న విధంగా చాలా స్వల్పం మాత్రమే. పై గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యాలలో మార్పులు తప్పనిసరి అనిపిస్తోంది. ముఖ్యంగా మందులపై ప్రజలు చేస్తున్న ఖర్చు చాలా జాస్తిగా ఉన్నది కనుక జనరిక్ మందులు ప్రచారంలోకి తీసుకు రాగలిగి దేశమంతటా వాటి సరఫరాను జరిగేటట్లు చూడగలిగితే ప్రజలు మందులపై చేసే ఖర్చులో బాగా ఆదా చేసుకునే అవకాశం కన్పిస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయంగా బలోపేతం చేయడం తప్పనిసరైంది. 14వ ఆర్థిక సంఘం విభజింప తగిన పన్నులలో రాష్ట్రాల శాతాన్ని 42 శాతానికి పెంచింది. దీనివల్ల ఎటువంటి నిబంధనలకు లోబడని ఆదాయం రాష్ట్రప్రభుత్వాలకు ఉంటుందని దానిని తాము నిర్దేశించుకున్న ప్రాధాన్యతలను అనుసరించి ఖర్చు చేసే అవకాశం ఉంటుందని భావించడమైంది. తదనుగుణంగా విద్య వైద్యరంగాలపై కేటాయింపులు పెరిగే అవకాశం ఉంటుందని భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు ఈ భావనకు అనుగుణంగా లేవు. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు విద్య వైద్యంపై ఎక్కువ ఖర్చు చేయగా ఎక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు ఈ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉదా‘‘కు 2016–17 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటిపారుదల రంగంపై ఖర్చు ముందు ఏడాదితో పోలిస్తే 57 శాతం పెరిగింది. ఆరోగ్య రంగంపై 13 శాతం మాత్రమే పెరి గింది. బీహార్ చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఆరోగ్య రంగంపై ఖర్చు వరుసగా 64%, 51% పెరిగింది. రాష్ట్రాలకు షరతులు లేని నిధులు బదలాయిస్తే సామాజిక ప్రాధాన్య రంగాలపై ఖర్చు చేస్తారని అనుకోవటం సరికాదని రుజువయింది. ప్రధానంగా నీటి పారుదల రంగంలో కేటాయిం పులు పెంచి తద్వారా ఎన్నికలకు కావలసిన నిధులను సేకరించుకోటానికి ఫార్ములాను కనిపెట్టిన రాష్ట్రాలలో వైద్య ఆరోగ్యరంగాల కేటాయింపులు పెరిగే అవకాశం తక్కువ. వాస్తవానికి తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలు విద్యా వైద్య రంగాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. విద్య వైద్య రంగాలకు కేటాయింపులు పెంచాలనే అంశాన్ని 14వ, 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలలో పొందుపరచలేదు. ఇప్పటికైనా 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలను సవరించి ఈ అంశాన్ని పొందుపరిస్తే భవిష్యత్తులోనైనా విద్య వైద్య రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఐవైఆర్ కృష్ణారావు, వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
రాలిపోతున్న పండుటాకులు
నాయుడుపేటటౌన్ : వడదెబ్బకు పండుటాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజులుగా ప్రచండ భానుడి తాపానికి వృద్ధులు తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. వందలాది మంది వృద్ధులు విపరీత ఉష్ణోగ్రత కారణంగా చనిపోయారు. విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ కురుప్పుస్వామి కళాయప్పన్(50), నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కల్లూరు ఢిల్లీ ప్రసాద్(42), ఆంధ్రాబ్యాంకు వీధిలో నివాసముంటున్న షేక్ చెహతాబీ (70)చనిపోయారు. కావలిఅర్బన్: కొత్తసత్రం పంచాయతీలో కాటంగారి పార్వతయ్య(55), గొట్టిపాటి ప్రసాద్(58), గాయత్రినగర్‌లోని ఎస్కె నిజిమిని(71) వడదెబ్బతో చనిపోయారు. బుచ్చిరెడ్డిపాళెం: ఖాజానగర్‌కు చెందిన ఫాతిమాబీ(80), కట్టుబడిపాళేనికి చెందిన షేక్. మస్తాన్‌బీ(68), పగడాల లలిత(69) వడదెబ్బతో చనిపోయారు. జలదంకి: పోలిశెట్టి చిన మాలకొండయ్య (82 ), యాటగిరి సుబ్బారావు ( 55 ) , గట్టుపల్లికి చెందిన దివి తులశమ్మ ( 75 ) మృతిచెందారు. నెల్లూరు(బారకాసు) : దేవరపాళెంకు చెందిన ఎగ్గోలు పెంచలయ్య(43), శ్రీలంకకాలనికి చెందిన కమలమ్మ(55), అంబాపురానికి చెందిన తాటిపర్తి రమణమ్మ(69) మృతి చెందారు. సైదాపురం: ఊటుకూరు గ్రామానికి చెందిన ముత్యాల బాబయ్య, ఆదూరుపల్లి గ్రామానికి చెందిన అమ్మినేని రాజమ్మ (67), గిద్దలూరు గ్రామానికి చెందిన మల్లవరపు అదెమ్మ(70) వడదెబ్బతో చనిపోయారు. దొరవారిసత్రం: శింగనాలత్తూరు గ్రామానికి చెందిన మీజూరు నాగమ్మ(63), వెదురుపట్టు గ్రామం చెందిన చిలకల వెంకటయ్య(61) వడదెబ్బతో మృతిచెందారు. కోట: కోట తూర్పువీదికి చెందిన పురిణి లక్ష్మమ్మ(60), కొక్కుపాడు చెందిన వెంకటేశ్వర్లు(61) వడదెబ్బకు గురై చనిపోయారు. వరికుంటపాడు: ఇస్కపల్లి గ్రామంలో డబ్బుగొట్టు చిన్నమాలకొండయ్య (75), చిన్నక్క(70) వడదెబ్బతో చనిపోయారు. గూడూరు టౌన్: తూర్పువీధికి చెందిన నాగబోతు వెంకట శేషమ్మ(80), చెన్నూరు గమళ్ళపాళెంకు చెందిన గీత కార్మికుడు బట్టికాల సెల్వరాజ్(55) చనిపోయారు. పొదలకూరు: అగచాట్లపురంలో నివాసం ఉంటున్న లక్కు వెంకటరాజా(47) బుధవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. కొడవలూరు: నార్తురాజుపాలెంలో చౌకచర్లకు చెందిన ఎల్లు వెంకయ్య(46) చనిపోయారు. ఉదయగిరి: కుర్రపల్లి బీసీ కాలనీకి ఇ.బ్రహ్మయ్య(60) వడదెబ్బ తగిలి చనిపోయాడు. బాలాయపల్లి: సుబ్రమణ్యం గ్రామానికి చెందిన బొల్లినేని రమాదేవి(46),నిడిగల్లు గ్రామం చెందిన పద్మమ్మ(73) చనిపోయారు. దుత్తలూరు: తురకపల్లికి చెందిన అంకినపల్లి ఈశ్వరమ్మ(69) వడదెబ్బతో చనిపోయింది. రాపూరు: తూమాయి గ్రామానికి చెందిన మార్కాపురం రాగయ్య(48) చనిపోయారు. దగదర్తి: కొత్తూరులో కడియాల చెంచమ్మ (75) వడదెబ్బకు గురై చనిపోయింది. వెంకటగిరిటౌన్:బీసీకాలనీకి చెందిన గజ్జల కృష్ణమ్మ (70) చనిపోయింది. అర్లపాడు(పెళ్లకూరు): గ్రామానికి చెందిన చిన్నపెంచలయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఆత్మకూరు: సత్రం సెంటర్లో చేవూరు సుశీలమ్మ (80) చనిపోయింది. డక్కిలి:మాటుమడుగు గ్రామానికి చెందిన పిల్లి శంకరమ్మ (67) వడదెబ్బతో మృతిచెందింది. మనుబోలు:యాచవరం గ్రామానికి చెందిన చల్లా లక్ష్మమ్మ(65) మృతి చెందింది. చిట్టమూరు:గునపాడు గ్రామానికి చెందిన దేశిరెడ్డి బాలకృష్ణారెడ్డి(80) చనిపోయాడు. చేజర్ల: మడపల్లి గ్రామానికి చెందిన వంటేరు నాగరాజు (54), నాగులవెలటూరులో మాలేటి ఆదెమ్మ వడదెబ్బతో మృతి చెందారు. గూడూరు టౌన్: మహాలక్ష్మమ్మవీధికి చెందిన అంతోటి రమణయ్య(65) మరణించారు. నెల్లూరు(క్రైమ్): ఇందిరానగర్‌లో రామలింగం కనకమ్మ(70), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కాంతమ్మ, మహేంద్ర షోరూం వద్ద యాచకురాలు (70) మృతిచెందారు. కావలిఅర్బన్: ముసునూరులో మంద పిచ్చమ్మ(70) వడదెబ్బతో మృతి చెందింది. చిల్లకూరు: ఎస్సీ కాలనీకి చెందిన భూపయ్య(60) చనిపోయాడు. వరికుంటపాడు:పెద్దిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సుబ్బమ్మ (72) చనిపోయింది. ఇందుకూరుపేట:కుడితిపాలెం గ్రామానికి చెందిన రాసాని పోలయ్య(60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రసవ వేదన
♦ పెద్దాస్పత్రికి కాన్పు కష్టాలు ♦ చాలీచాలని పడకలు, సరిపోని వైద్యులు ♦ సీఎం చూసి వెళ్లినా ఫలితం శూన్యం ♦ సర్కారు వైఫల్యంపై జనం మండిపాటు లబ్బీపేట : రెండు దశాబ్దాల కిందట నగర పరిసర ప్రాంతాల జనాభా సుమారు ఆరున్నర లక్షలుంటే.. ప్రస్తుతం 12 లక్షలకు చేరింది. అంటే నగరీకరణ నేపథ్యంలో దాదాపు రెట్టింపయింది. అదే ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో రెండు దశాబ్దాల కిందట 60 పడకలు, పది మంది వైద్యులు ఉంటే.. నేటికీ అదే పరిస్థితి నెల కొంది. జనాభా పెరిగినప్పుడు ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాల్సి ఉండగా, ప్రభుత్వాలు ఆ దిశగా కృషిచేయడం లేదు. ఫలితంగా నిండు గర్భిణులకు ప్రసూతి కష్టాలు తప్పడం లేదు. నగరం, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం నుంచి కూడా నిత్యం గర్భిణులు ప్రసూతి కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుం టారు. ఒక్కో సమయంలో సాధారణ కేసులను కూడా ఇక్కడికి రిఫర్ చేస్తుండడంతో ఈ విభాగంలో ఉన్న పడకలు చాలక కారిడార్, వరండాల్లో వేసిన పడకలపై ఉంచాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించినా, వైద్య శాఖ మంత్రి దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. చాలని పడకలు.. పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగానికి నిత్యం 150 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. 110 నుంచి 115 మంది వరకు గర్భిణులు, గర్భకోశ వ్యాధులతో బాధపడే వారు చికిత్స పొందుతుంటారు. ఈ విభాగంలో అధికారికంగా రెండు యూనిట్లు ఉండగా 60 పడకలు ఉన్నాయి. అనధికారికంగా నిర్వహిస్తున్న మరో యూనిట్‌తో (30 పడకలతో) కలిపితే 90 పడకలున్నాయి. మరి 115 మంది ఇన్ పేషెంట్స్ ఉంటే మిగిలిన 25 మందిని ఎక్కడ ఉంచాలనే విషయమై వైద్యులు, వైద్య నిఫుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం తెలియని మంత్రులు ఒకే బెడ్‌పై ఇద్దరిని ఎందుకుంచుతున్నారంటూ హడావుడి చేస్తున్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం చూసినా ఆరు యూనిట్లు ఉంటే కాని సరైన వైద్యం అందించలేమని గతంలోనే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి రాసిన లేఖను బుట్టదాఖలు చేశారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు యూనిట్లు పెంచి ఉంటే 180 పడకలు, 30 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చే అవకాశముండేది. వచ్చారు.. చూశారు.. వెళ్లారు.. గత ఏడాది నవంబరులో ముఖ్యమంత్రి నగర పర్యటనలో భాగంగా పాత ఆస్పత్రి ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణుల కష్టాల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో చికిత్స పొందుతున్న వారికి ప్రోత్సాహక నగదు అందించి చేతులు దులుపుకొన్నారు తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దీంతో సమస్యలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా మారాయి. లక్ష్యం ఘనం..సౌకర్యాలు శూన్యం.. ఒకవైపు మాతాశిశు మరణాల రేటును వంద శాతం నివారించాలంటూ వాడవాడలా సమావేశాలు పెడుతూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి రక్తపరీక్షలు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితిలో సకాలంలో వైద్యం ఎలా అందించగలుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్యుల నియామకాలు చేపట్టాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు అంటున్నారు. -
వైద్యం మిథ్య!
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనాభాకు సరిపోయే విధంగా వైద్యులు లేక రోగులు పడిగాపులు కాస్తున్నారు. రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. అధునాతన పరికరాలు ఉన్నా.. వైద్యులు లేక సేవలు అందడం లేదు. కనీసం 20 ఏళ్ల నాటి ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన సంఖ్యలో కూడా వైద్యులు లేరు. ఉన్న వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం ప్రజలకు శాపమవుతోంది. జిల్లాలో 27.88 లక్షల జనాభా ఉండగా, వీరికి కేవలం 170 మంది మాత్రమే వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఏళ్లు గడిచినా, జనాభా పెరిగినా అరకొర సిబ్బందితోనే ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 72 పీహెచ్‌సీలు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 20 ఏళ్లక్రితం నాటి ప్రమాణాలు తీసుకున్నా 184 మంది వైద్యులు ఉండాలి. కానీ 152 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. సెలవుపై వెళ్లేవారు, పోస్టు గ్రాడ్యుయేట్ చేయడం కోసం దీర్ఘకాలిక సెలవు తీసుకున్నవారు కూడా ఈ లెక్కల్లో ఉన్నారు. ఇక అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య 120 వరకు ఉంటుంది. వీరే లక్షల మంది గ్రామీణులకు ప్రాణాధారం. దీంతో అత్యవసర సమయాల్లో, వరదలు, వర్షాలు వచ్చే సీజనల్ వ్యాధులు విజృంభించే సమయాల్లో దేవుడిపైనే భారం వేయాల్సి వస్తోంది. వైద్య విధాన పరిషత్‌లో.. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్మల్, బైంసా, మంచిర్యాల ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్-టి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లలో సీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఐదుగురు వైద్యులు, ఏరియా ఆస్పత్రిలో పది మంది వైద్యులు ఉండాలి. వీరితోపాటు ఒక్కో ఏరియా ఆస్పత్రికి ముగ్గురు సివిల్ సర్జన్లు, సీహెచ్‌సీకి ఇద్దరు సివిల్ సర్జన్లు ఉండాలి. మొత్తం 21 మంది సివిల్ సర్జన్లకు ప్రస్తుతం ఆరుగురు అందుబాటులో ఉన్నారు. 20 ఏళ్ల నాటి జనాభా ప్రాతిపదికన ఆయా ఆస్పత్రుల్లో నిర్దేశించిన వైద్యుల సంఖ్య 81 మంది వరకు ఉండాలి. ఇప్పటికి అక్కడ 66 మంది మాత్రమే పోస్టులు భర్తీ అయ్యాయి. వారిలో కోర్టు కేసుల నిమిత్తం వెళ్లేవారు. సెలవులపై వెళ్లేవారిని మినహాయిస్తే ప్రజా సేవలో ఉండేవారు చాలా తక్కువమందే అని చెప్పవచ్చు. ఉన్నవారిలో నిపుణులైన వైద్యులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ప్రస్తుతం 17 వేల మందికి ఓ డాక్టరు చొప్పున ఉన్నారు. ప్రభుత్వ సేవలకు నిపుణులైన వైద్యులు ముందుకు రాకపోవడంతో ఎంబీబీఎస్ వైద్యులతోనే సరిపెట్టుకొని సర్కారు వైద్యసేవలు నెట్టుకొస్తోంది. రిమ్స్‌కు వచ్చేలోపు పరిస్థితి విషమం జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల ఉంది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఆత్మహత్యలు, పాముకాటుతోపాటు ఏదైనా ప్రమాదం జరిగితే తప్పనిసరిగా రిమ్స్‌కు రావాల్సిన పరిస్థితి. జిల్లా విస్తీర్ణంలో పెద్దదిగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి రిమ్స్‌కు వచ్చేలోపే పరిస్థితి చేజారుతోంది. తీరా రిమ్స్‌కు వచ్చిన తర్వాత పరిస్థితి విషమించడంతో ఇక్కడి వైద్యులు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్‌పూర్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. ఆ పరిస్థితిల్లో చాలా మందికి వైద్యం అందక మార్గమధ్యమంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పీహెచ్‌సీలతోపాటు, రిమ్స్‌లో కూడా వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. -
వైద్యం వెరీ బ్యాడ్
బాల్కొండ, న్యూస్‌లైన్: బాల్కొండలో ప్రభుత్వ వైద్యం వెరీ బ్యాడ్‌గా ఉందని జెడ్పీ సీఈఓ రాజారాం అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ హాలులో బాల్కొండ, ఆర్మూర్, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ఐకేపీ, ఈజీఎస్, హౌసింగ్, హెల్త్, వెటర్నరీ, ఐసీడీఎ స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారి నుంచి ప్రొగ్రెస్ వివరాలను సేకరించారు. బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెరీ బ్యాడ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. మార్పు కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించాలన్నారు. బంగారు తల్లి పథకం పై దృష్టి సారించాలన్నారు. బంగారు తల్లి పథకానికి బ్యాంకుల్లో అకౌంట్ తీ యాలంటే తల్లులు తప్పని సరి రావాలని బ్యాంకు అధికారులు షరతులు పెడుతున్నారని అధికారులు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు. ఉపాధి హమీ పథకంలో కూలీలకు పనులు కల్పించాలన్నారు. సంబంధిత అధికారుల నుంచి సం బంధిత శాఖకు చెందిన రిపోర్టును తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడి ప్ర జలకు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో బాల్కొండ, వేల్పూ ర్, మోర్తాడ్, ఆర్మూర్ ఎంపీడీవోలు కిషన్, రాజ్వీర్, ప్రవీణ్, రాములు (ఇన్చార్జి), నాలుగు మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు సమ్మె చీకట్లు
చీరాల, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విద్యుత్ జేఏసీ చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరడంతో కరెంట్ కష్టాలు తీవ్రమయ్యాయి. రోజూ ఉదయం 6 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. అలాగే రాత్రుళ్లు మధ్యమధ్యలో కరెంట్ తీయడంతో చేతివృత్తులు, చిరువ్యాపారులు, వ్యాపార సముదాయాలు, వైద్యశాలలు, మంచినీటి కేంద్రాలు, రైతులు, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో డీజిల్ కొరతతో జనరేటర్లు నిలిపి వేశారు. అత్యవసర వార్డుల్లో ఉన్న ఇన్వర్టర్లు సైతం పని చేయడం లేదు. గర్భిణులు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన సీమాంక్ సెంటర్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఉన్న బాలింతలు, పసి పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. గదుల్లోకి గాలి రాకపోవడంతో ఉక్కపోత, ఊపిరి ఆడకపోవడంతో బాలింతలు, చిన్న పిల్లలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దీంతో వార్డుల్లో ఉండాల్సిన వారు ఆరుబయటకు వచ్చి చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రోగుల పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది. ప్రభుత్వ వైద్యశాలల్లోని వార్డుల్లో ఉండలేక చాలా మంది రోగులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ చీరాల ఏరియా వైద్యశాలే దిక్కు. పేదలు, మధ్య తరగతి వారు నిత్యం వివిధ రకాల చికిత్సల కోసం చీరాల ఏరియా వైద్యశాలకు వస్తుంటారు. వంద పడకల ఆస్పత్రయినా చీరాల ఏరియా వైద్యశాలలో ప్రసూతి, కాన్పుల విభాగం, చిన్న పిల్లలకు ఐసీయూకేర్ యూనిట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పలు రకాల శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు రోగులకు ప్రత్యేకంగా వార్డు సదుపాయాలున్నాయి. పదుల సంఖ్యలో వైద్యులు, వందల సంఖ్యలో వివిధ విభాగాల సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. ధర్మాస్పత్రయినా చీరాల ఏరియా వైద్యశాలలో వసతులు మాత్రం ఆశించిన మేర రోగులకు అందడం లేదు. విద్యుత్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. విద్యుత్ కోతలతో జనరేటర్ ఉన్నప్పటికీ దాన్ని వినియోగించకపోవడంతో శస్త్ర చికిత్సలు, కాన్పులు చేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలను కూడా సక్రమంగా అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలానే వ్యవసాయ సీజన్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా వరి సాగవుతోంది. అయితే విద్యుత్ సరఫరా లేక రైతులు సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.