బాల్కొండ, న్యూస్‌లైన్: బాల్కొండలో ప్రభుత్వ వైద్యం వెరీ బ్యాడ్‌గా ఉందని జెడ్పీ సీఈఓ రాజారాం అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ హాలులో బాల్కొండ, ఆర్మూర్, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ఐకేపీ, ఈజీఎస్, హౌసింగ్, హెల్త్, వెటర్నరీ, ఐసీడీఎ స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారి నుంచి ప్రొగ్రెస్ వివరాలను సేకరించారు. బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెరీ బ్యాడ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు.
మార్పు కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించాలన్నారు. బంగారు తల్లి పథకం పై దృష్టి సారించాలన్నారు. బంగారు తల్లి పథకానికి బ్యాంకుల్లో అకౌంట్ తీ యాలంటే తల్లులు తప్పని సరి రావాలని బ్యాంకు అధికారులు షరతులు పెడుతున్నారని అధికారులు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన ఉన్నత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు. ఉపాధి హమీ పథకంలో కూలీలకు పనులు కల్పించాలన్నారు. సంబంధిత అధికారుల నుంచి సం బంధిత శాఖకు చెందిన రిపోర్టును తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడి ప్ర జలకు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో బాల్కొండ, వేల్పూ ర్, మోర్తాడ్, ఆర్మూర్ ఎంపీడీవోలు కిషన్, రాజ్‌వీర్, ప్రవీణ్, రాములు (ఇన్‌చార్జి), నాలుగు మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైద్యం వెరీ బ్యాడ్
Published Fri, Jan 10 2014 4:27 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement