కుర్తాలో దూరిన పాము..కదిలితే!! | Rescued a Snake From Sleeping Mans Kurta in Maharashtra | Sakshi
Sakshi News home page

వ్యక్తి కుర్తాలోకి చొరబడిన పాము

Published Tue, Jun 25 2019 4:50 PM | Last Updated on Tue, Jun 25 2019 6:09 PM

Rescued a Snake From Sleeping Man’s Kurta in Maharashtra - Sakshi

ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుర్తాలోకి పాము చొరబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన బంధువుల్లోని వ్యక్తి అనారోగ్యపాలైతే చూడటానికి వచ్చిన ఓ ముసలాయన.. హాస్పిటల్‌ ఆవరణలో నేల మీద పడుకున్నాడు. ఎప్పుడు, ఎలా వచ్చిందో తెలీదు కానీ.. అనూహ్యంగా ఆయన కుర్తాలోకి  పాము దూరింది. మొదట ఇది అతను గమనించుకోలేదు. తర్వాత హాస్పిటల్‌ సిబ్బంది గమనించి ఆ వ్యక్తికి తెలిపారు. భయభ్రాంతులకు గురైన ఆ వ్యక్తి.. కదిలితే  పాము ఎక్కడ కాటేస్తుందోనని అలాగే ఉండిపోయాడు. కాగా  హాస్పిటల్‌ సిబ్బంది వన్యప్రాణి సంరక్షణ సిబ్బందికి సమాచారం అందజేశారు.

ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది  ముసలాయనను లేపకుండానే ఆ పామును బయటకు తీశారు. ఈ పాము గ్రీన్‌ కీల్‌ బాక్‌గా గుర్తించారు. ఇది విషరహితమైనదని తెలిపి అనంతరం పామును అడవిలో విడిచి పెట్టారు. కాగా ఇటీవల జనావాసాల్లోకి పాములు చొరబడుతున్న ఘటనలు తరచుగా జరుగుతన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement