
సాక్షి, ముంబై: ముంబై లోకల్ ట్రెయిన్‌లో పాము కలకలం సృష్టించింది. సబర్బన్ రైలులో సీలింగ్ ఫ్యాన్ నుంచి వేలాడుతూ ప్రయణీకులను షాక్‌కు గురి చేసింది. రైలులోని ఫస్ట్ క్లాస్ కోచ్‌లో దర్శనమిచ్చిన పసిరిక పాము రైలులోని వందల మంది ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసింది. టిట్వాలా -సిఎస్ఎంటీ లోకల్ రైలులో థానే స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. చెయిన్‌లాగి అధికారులకు సమాచారం అందించారు. దాదాపు మూడు అడుగులున్న ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటనపై స్పందించిన సిఆర్ చీఫ్ ప్రతినిధి సునీల్ ఉడిసి మాట్లాడుతూ ఈ రైలు ఇప్పటికే రెండు ట్రిప్‌లు తిరిగిందనీ, మూడవ రౌండ్‌లోమాత్రమే అకస్మాత్తుగా పాము ఎలా కనిపించిందో, వీడియో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. దీనిపై మరిన్ని వివరాలకోసం సర్ప మిత్రాస్, స్నేక్ క్యాచర్ల సహాయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment