
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : పాము తలకు కండోమ్ బిగించిన దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ముంబైలోని మిడోస్ హౌసింగ్ సొసైటీ ఏరియాలో నివాసం ఉంటున్న వైశాలి తన్హా అనే యువతికి ఓ పాము.. తలకు చిన్న ప్లాస్టిక్ బ్యాగుతో దిక్కుతోచని స్థితిలో అటుఇటు కదులుతూ కనిపించింది. ఆమె దాని దగ్గరకు వెళ్లి చూసింది. తలపై ఉన్నది ప్లాస్టిక్ బ్యాగు కాదని, కండోమ్ అని గుర్తించింది. వెంటనే మిఠా మల్వంకర్ అనే పాముల సంరక్షకుడికి ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మల్వంకర్ 2.5 అడుగుల నీటి పామును చేతుల్లోకి తీసుకున్నాడు. ( నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్‌ఐఆర్ )
కండోమ్‌ని తీసిపారేసి రక్షించాడు. అయితే కండోమ్ కారణంగా సరిగా ఊపిరి తీసుకోలేకపోయిన పాము అస్వస్థతకు గురైంది. దాన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్కుకు తరలించి చికిత్స అందించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుభవం ఉన్న వ్యక్తే పాము మెడకు కండోమ్ కట్టి ఉంటాడని, అది విషరహితమైనదైనా దాని కాట్లు దారుణంగా ఉంటాయని మల్వంకర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment