భార్య కోసం సీటు అడిగినందుకు.. | Train Passenger Beaten To Death | Sakshi
Sakshi News home page

భార్య కోసం సీటు అడిగినందుకు..

Published Fri, Feb 14 2020 10:36 AM | Last Updated on Fri, Feb 14 2020 10:39 AM

Train Passenger Beaten To Death - Sakshi

ముంబై : రైలులో సీటు కోసం జరిగిన చిన్న వివాదంలో 26 ఏళ్ల యువకుడిని ఆరుగురు మహిళలు సహా 12 మంది కలిసి చితకబాదడంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ముంబై-లాతూర్‌-బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం వెలుగుచూసింది.  ముంబైలోని కళ్యాణ్‌కు చెందిన సాగర్‌ మర్కంద్‌ తన భార్య, రెండేళ్ల చిన్నారితో కలిసి కళ్యాణ్‌లో రైలు ఎక్కాడు. జనరల్‌ బోగీలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తన భార్య కూర్చున్నేందుకు సీటు సర్దుబాటు చేసుకోవాలని కూర్చున్న మహిళను కోరాడు. ఇందుకు నిరాకరించిన మహిళ సాగర్‌తో వాగ్వాదానికి దిగింది.

క్రమంగా అది ఘర్షణకు దారితీయడంతో మహిళతో ఉన్న 12 మంది అతడిని తోసివేస్తూ దారుణంగా కొట్టారు. బాధితుడి భార్య వారిస్తున్నా వినకుండా వారు గంటపాటు అతడిని చితకబాదారు. పుణే నుంచి దౌండ్‌ స్టేషన్‌ వరకూ బాధితుడిపై వారి దాడి కొనసాగింది. దౌండ్‌ స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సాగర్‌ కుటుంబం షోలాపూర్‌ జిల్లాలో బంధువు అంత్యక్రియలకు హాజరైన క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

చదవండి : రైల్లో మత్తు మందు ఇచ్చి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement