
ముంబై : పెద్ద శబ్ధంతో గురకపెడుతూ తమ నిద్ర లేకుండా చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు జాగారం చేయించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.. గత గురువారం జబల్పూర్ వద్ద ఎల్టీటీ–దర్భంగ పవన్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. నంబర్–3 ఏసీ కోచ్‌లో రామచంద్ర అనే ప్రయాణికుడు పెద్దగా గురకపెడుతూ నిద్రపోతున్నాడు. ఆ శబ్దంతో తోటి వారికి నిద్రాభంగమైంది. దీంతో వారంతా కలిసి ఆయనతో వాదులాటకు దిగారు. చివరికి రామచంద్ర మెలకువతో ఉండాలని అంగీకారానికి వచ్చారు. దీంతో తోటి వారంతా నిద్రపోతుండగా పాపం రామచంద్ర.. ఆరు గంటలపాటు కునికిపాట్లతో కూర్చోవాల్సి వచ్చింది.