
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా భారత్ నుంచి థాయ్‌ల్యాండ్‌కు డైరెక్ట్ ఫ్లయిట్ సరీ్వసులను విస్తరించింది. కొత్త రూట్లలో హైదరాబాద్–బ్యాంకాక్, చెన్నై–ఫుకెట్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సరీ్వసులు అక్టోబర్ 27న, చెన్నై నుంచి ఫ్లయిట్స్ అక్టోబర్ 30న ప్రారంభమవుతాయి.
లాంచ్ ఆఫర్ కింద హైదరాబాద్–బ్యాంకాక్ రూట్లో వన్–వే టికెట్ చార్జీ రూ. 7,390గా ఉంటుంది. వచ్చే నెల 27 నుంచి 2025 మార్చి 29 వరకు ప్రయాణాల కోసం సెపె్టంబర్ 22 వరకు ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద బుక్ చేసుకోవచ్చు. కొత్తగా 2 సర్వీసుల చేరికతో భారతీయ మార్కెట్లో తాము సరీ్వసులు నిర్వహించే రూట్ల సంఖ్య 14కి చేరుతుందని థాయ్ ఎయిర్‌ఏషియా హెడ్ (కమర్షియల్) తన్సితా అక్రారిత్‌పిరోమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment