direct flights
-
థాయ్‌ల్యాండ్‌కు ఎయిర్ ఏషియా మరిన్ని సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా భారత్ నుంచి థాయ్‌ల్యాండ్‌కు డైరెక్ట్ ఫ్లయిట్ సరీ్వసులను విస్తరించింది. కొత్త రూట్లలో హైదరాబాద్–బ్యాంకాక్, చెన్నై–ఫుకెట్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సరీ్వసులు అక్టోబర్ 27న, చెన్నై నుంచి ఫ్లయిట్స్ అక్టోబర్ 30న ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్ కింద హైదరాబాద్–బ్యాంకాక్ రూట్లో వన్–వే టికెట్ చార్జీ రూ. 7,390గా ఉంటుంది. వచ్చే నెల 27 నుంచి 2025 మార్చి 29 వరకు ప్రయాణాల కోసం సెపె్టంబర్ 22 వరకు ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద బుక్ చేసుకోవచ్చు. కొత్తగా 2 సర్వీసుల చేరికతో భారతీయ మార్కెట్లో తాము సరీ్వసులు నిర్వహించే రూట్ల సంఖ్య 14కి చేరుతుందని థాయ్ ఎయిర్ఏషియా హెడ్ (కమర్షియల్) తన్సితా అక్రారిత్పిరోమ్ తెలిపారు. -
వారానికి 250కి పైగా ప్లయిట్స్: ఆకాశ ఎయిర్
న్యూఢిల్లీ: వచ్చే నెల (అక్టోబర్) రెండో వారం నాటికి దేశీయంగా తొమ్మిది రూట్లలో 250 పైగా ఫ్లయిట్స్ నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు, అహ్మదాబాద్‌లకు కొత్తగా సర్వీసులను, అలాగే బెంగళూరు-అహ్మదాబాద్ రూట్లో రోజూ అదనంగా మరో ఫ్లయిట్‌ను నడపనున్నట్లు పేర్కొంది. (Mankind Pharma: అతిపెద్ద ఐపీవో బాట) అప్పటికి తమకు అయిదో విమానం కూడా అందుబాటులోకి వస్తుందని, తద్వారా వారానికి 250 పైచిలుకు సర్వీసులు నిర్వహించగలమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న కార్యకలాపాలు ప్రారంభించింది. 2023 మార్చి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోనుంది. -
అక్టోబర్ నుంచి హైదరాబాద్–వియత్నాం ఫ్లయిట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ నుంచి హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని మరో రెండు నగరాల నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ వియత్జెట్ డైరెక్టర్ జయ్ ఎల్ లింగేశ్వర తెలిపారు. ఒకో ప్రాంతం నుంచి వియత్నాంలోని హనోయ్, హో చి మిన్హ్ తదితర ప్రాంతాలకు వారానికి మూడు–నాలుగు సర్వీసులు ఉంటాయని గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై నుంచి వియత్నాంలోని ప్రధాన నగరాలకు వారానికి 20 వరకూ సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 60 శాతం మేర పెరిగిందని లింగేశ్వర చెప్పారు. ప్రయాణికులను ఆకర్షించడానికి రూ. 26 బేస్ రేటుకే టికెట్లు వంటి ఆఫర్లు రూపొందిస్తున్నామని వివరించారు. మరోవైపు సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యల ద్వారా అధిక ఇంధన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పరిశ్రమకు సానుకూలాంశమని పేర్కొన్నారు. -
హైదరాబాద్ నుంచి దుబాయికి విమాన సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత, యూఏఈ ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ ఒప్పందం ప్రకారం జీఎంఆర్ ఆధ్వర్యంలోని (శంషాబాద్) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఊతమివ్వనుంది. యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రతి ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో వారాని మూడు సర్వీసులను నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయికి టికెట్టును బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులందరూ కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్పోర్ట్ బబుల్స్’’ లేదా ‘‘వాయు రవాణా ఒప్పందాలు’’ అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది. దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన రెగ్యులర్ అంతర్జాతీయ సర్వీసులను పున:ప్రారంభించుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అతి తక్కువ ప్రయాణ సమయంతో, అత్యంత జాగ్రత్తల మధ్య జరిగే విమాన ప్రయాణాలే అత్యంత సురక్షితమైనవిగా తేలింది. మే 25న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేసిన కాంటాక్ట్-లెస్ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తోంది. -
‘బికినీ’ ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్ రూ.9 కే టికెట్
సాక్షి, న్యూఢిల్లీ : వియత్నాంకు చెందిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబరు నుంచి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్ జెట్ మంగళవారం తెలిపింది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది. హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని సంస్థ వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధర రూ. 9 అంతేకాదు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. త్రి గోల్డెన్ డేస్ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్ తన్ సన్ తెలిపారు. కాగా వియత్జెట్ డిసెంబర్ 2011 లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి. మరోవైపు చైనాలో జరిగిన ఆసియా కప్‌పోటీలకు వియత్నాం అండర్ -23 ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో 'బికినీలు ధరించిన మోడల్స్' ఉన్న కారణంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం (సిఎవి) జనవరి 2018 లో వియత్ జెట్‌కు జరిమానా కూడా విధించింది. -
ముంబై-న్యూయార్క్ విమానాలు నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుంచి న్యూయార్క్ విమాన సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మార్గంలో తగినంత డిమాండ్ లేకపోవడంతో ఎయిరిండియా నష్టాల పాలైంది. దీంతో ఈ మార్గంలో తన విమాన సేవలను నిలిపిస్తోంది. డిసెంబర్ 2018 లో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ముంబై-న్యూయార్క్ డైరెక్ట్ విమాన సేవలను ప్రారంభించిన సంస్థ డిమాండ్ తక్కువగా ఉండటంతో ఇకపై ఈ సర్వీసులను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. ముంబై-న్యూయార్క్ మధ్య వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడిపిస్తున్న ఎయిరిండియా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత కారణంగా ఫిబ్రవరిలో తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేసింది. అయితే జూన్‌లో పునఃప్రారంభించాలని భావించినా.. ఇకపై ఈ సర్వీసులను కొనసాగించలేమని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే వింటర్‌కు సంబంధించి అక్టోబర్ మూడవవారం నుంచి మార్చి రెండో వారం వరకు అందించే ఎయిరిండియా విమాన సేవలు ఇందులో భాగం కాదని వివరించారు. -
ఆమ్స్టార్డ్యామ్కు ప్రతిరోజూ నాన్‌స్టాప్ ఫ్లయిట్
సాక్షి, బెంగళూరు : ఆమ్స్టర్డ్యామ్ వెళ్లే విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఈ సుదూర ప్రయాణంలో కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫ్లయిట్స్ అందుబాటులోకి రానున్నాయి. బెంగుళూరు నుంచి నెదర్లాండ్ రాజధాని ఆమ్స్టర్డ్యామ్ కు ప్రతిరోజూ నాన్‌స్టాప్ ఫ్లయిట్ ప్రారంభం కానుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ ఈ మేరకు విమాన సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది. ఈనెల 29 నుంచి ఈ సర్వీసులు అందుబాటులో రానున్నాయి. బెంగళూరులో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రయాణ సమయం దాదాపు తొమ్మిది గంటలు పడుతుంది. ప్రతి రోజూ బెంగళూరు నుంచి రాత్రి 02:25 (ఎల్.టీ) గంటలకు విమానం (జెట్ ఎయిర్ వేస్ 9 డబ్ల్యూ 236) ఆమ్స్టర్డ్యామ్ కు బయలు దేరుతుంది. అదే విధంగా ఆమ్స్టర్డ్యామ్ నుంచి బెంగళూరుకు ఉదయం 10:50 గంటలకు (ఎల్.టీ)కు విమానం (జెట్ ఎయిర్వేస్ 9డబ్ల్యూ 235) బయలు దేరుతుంది. ప్రారంభ ఆఫర్‌గా ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.39,999గాను, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.1,21,000గా నిర్ణయించారు. -
ఎయిర్ ఏషియా డైరెక్ట్ ఫ్లైట్స్: ధర రూ.2299
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా నాలుగు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. దేశీయంగా నాలుగు కొత్త మార్గాల్లో ఎయిర్ ఏషియా డైరెక్ట్ విమానాలను ప్రారంభించనుంది. త్వరలో డెయిలీ డైరెక్ట్ ఫ్లైట్ ను లాంచ్ చేయనున్నామని అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. టికెట్ల ధరలు రూ .2,299 (వన్‌వే) నుంచి ప్రారంభమని తెలిపింది. కొత్త మార్గాల్లో రోజువారీ విమానాలను ప్రారంభించనున్నట్లు ఎయిర్ఏషియా మంగళవారం ప్రకటించింది. రాంచి -బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్‌లకు రోజువారీ విమానాలు నడిపే పథకాన్ని వెల్లడించింది. ఈ ప్రణాళికలో మొదటి విమానం అక్టోబర్ 7, 2017 మొదలు కానున్నట్టు తెలిపింది. సీట్లు పరిమితమని అన్ని విమానాల్లో అందుబాటులో ఉండకపోవచ్చునని ఎయిర్ ఏషియా తెలిపింది. వెబ్సైట్అందించిన అప్డేట్ ప్రకారం విమాన టికెట్ ధరలు భువనేశ్వర్- రాంచి రూ. 2299 ,రాంచి- బెంగళూరు రూ.3299, రాంచి- హైదరాబాద్ రూ.2799గా ఉన్నాయి. ముందుగానే వారి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, www.airasia.com ద్వారా ఆన్లైన్ బుకింగ్‌లకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని తెలిపింది. -
వారణాసి నుంచి కొలంబోకు నేరుగా ఫ్లయిట్
కొలంబో: వారణాసి నుంచి కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం కొలంబోలో జరుగుతున్న 14వ అంతర్జాతీయ వేకాస్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఈ ఏడాది ఆగస్ట్ నుంచి వారణాసి నుంచి కొలంబోకు నేరుగా విమాన సేవలు మొదలు అవుతాయని తెలిపారు. కొలంబోలో ఉన్న తమిళులు...వారణాసితో పాటు గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడు తొలి ప్రవచనం చేసిన పుణ్యస్థలం సార్నాథ్ను సందర్శించుకోవాలని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బుద్ధుడి నడయాడిన గడ్డపై పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని మోదీ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రముఖుల నుంచి వచ్చినవే అని ఆయన అన్నారు. బుద్ధుని బోధనలను శ్రీలంక ముందుకు తీసుకు వెళుతోందని అన్నారు. భారత్-శ్రీలంకల మధ్య హద్దులు లేని స్నేహం ఉందని ఇరు దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులు, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరిస్తామని మోదీ వెల్లడించారు.