‘బికినీ’ ఎయిర్‌లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ రూ.9 కే టికెట్‌ | Bikini Airline VietJet kicks off this December with tickets from Rs 9 | Sakshi
Sakshi News home page

‘బికినీ’ ఎయిర్‌లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ రూ.9 కే టికెట్‌

Published Wed, Aug 21 2019 12:35 PM | Last Updated on Wed, Aug 21 2019 12:47 PM

Bikini Airline VietJet kicks off this December with tickets from Rs 9 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వియత్నాంకు చెందిన వియత్‌ జెట్‌ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే  ప్రారంభం కానున్నాయి. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబరు నుంచి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్‌ జెట్‌ మంగళవారం తెలిపింది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది.  హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని  సంస్థ వెల్లడించింది. 

టికెట్ల ప్రారంభ ధర రూ. 9 
అంతేకాదు మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ఉంది.  త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో  భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్‌జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్‌ తన్ సన్  తెలిపారు. 

కాగా వియత్‌జెట్ డిసెంబర్ 2011 లో పనిచేయడం ప్రారంభించింది.  ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో  సిబ్బంది  బికినీలు ధరించి  ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్‌లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి.  మరోవైపు చైనాలో జరిగిన ఆసియా కప్‌పోటీలకు వియత్నాం అండర్ -23 ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో 'బికినీలు ధరించిన మోడల్స్'  ఉన్న కారణంగా  సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం (సిఎవి) జనవరి 2018 లో వియత్‌ జెట్‌కు జరిమానా  కూడా విధించింది. 


   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement