హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ నుంచి హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని మరో రెండు నగరాల నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ వియత్‌జెట్ డైరెక్టర్ జయ్ ఎల్ లింగేశ్వర తెలిపారు. ఒకో ప్రాంతం నుంచి వియత్నాంలోని హనోయ్, హో చి మిన్హ్ తదితర ప్రాంతాలకు వారానికి మూడు–నాలుగు సర్వీసులు ఉంటాయని గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.
ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై నుంచి వియత్నాంలోని ప్రధాన నగరాలకు వారానికి 20 వరకూ సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 60 శాతం మేర పెరిగిందని లింగేశ్వర చెప్పారు. ప్రయాణికులను ఆకర్షించడానికి రూ. 26 బేస్ రేటుకే టికెట్లు వంటి ఆఫర్లు రూపొందిస్తున్నామని వివరించారు. మరోవైపు సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యల ద్వారా అధిక ఇంధన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పరిశ్రమకు సానుకూలాంశమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment