new flights
-
రూ.1991కే విమాన ప్రయాణం.. మొదటి సర్వీస్ ప్రారంభించిన ఫ్లై91
ఫ్లై91 సంస్థ తన మొదటి విమాన సర్వీసులను ప్రారంభించింది. తాజాగా గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉదయం గం.7.55కు విమాన సర్వీసులను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా రూ.1991కే ప్రత్యేక ఛార్జీతో ప్రయాణించేలా వెసులుబాటు కల్పిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్లై91 విమాన సర్వీసులన్నింటికీ ఈ ఆఫర్ అమలవుతుందని కంపెనీ పేర్కొంది. తొలుత గోవా, హైదరాబాద్, బెంగళూరు, సింధుదూర్గ్ మధ్య విమాన సర్వీసులను ప్రారంభించామని, ఏప్రిల్‌లో అగత్తి, జలగావ్, పుణెకు ప్రారంభించే యోచనలో ఉన్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి గోవా- బెంగళూరు మధ్య సోమ, శుక్ర, శనివారాల్లో విమాన సర్వీసులు ఉంటాయి. బెంగళూరు- సింధుదుర్గ్ మధ్య కూడా ఇదే సంఖ్యలో విమాన సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. గోవా- హైదరాబాద్, సింధుదుర్గ్- హైదరాబాద్ మధ్య వారంలో రెండు సార్లు విమాన సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. -
ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి!
దేశంలో కొత్త ఫ్లైట్ ఎగిరింది. తొలిసారిగా ఎయిర్‌బస్ A350-900 వాణిజ్య విమానాన్ని ఎయిర్ ఇండియా బెంగళూరు, ముంబైల మధ్య ప్రారంభించింది. అలాగే ప్రత్యేకమైన యూనిఫాంను సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించింది. AI 589 ఫ్లైట్ నంబర్‌తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్దేశిత సమయానికి బయలుదేరిన ఎయిర్‌బస్ A350-900.. కొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు సిద్ధమైన ప్రయాణికులను గమ్యస్థానానికి తీసుకెళ్లింది. మంగళవారం మినహా ప్రతిరోజు ఈ విమాన సర్వీస్‌ను నడపనున్నారు. రోజూ ఉదయం 7.05 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 8.50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. సిబ్బందికి అలవాటు కావడానికి, అలాగే రెగ్యులేటరీ సమ్మతి కోసం తొలుత దేశీయ మార్గాల్లోనే ఈ విమానాన్ని నడపనున్నారు. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎయిర్‌బస్ A350 విమానంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం కలగనుంది. తదుపరి దశలో అంతర్జాతీయ సర్వీసుల్లో వీటిని నడుపుతారు. సౌకర్యాలివే.. ఎయిర్‌బస్ A350లో ఉన్న ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ (IFE) సిస్టమ్, ప్రత్యేకమైన సౌకర్యాలను హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన వింగ్స్ ఇండియా గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో ప్రదర్శించారు. త్రీ-క్లాస్ క్యాబిన్ లేఅవుట్‌తో కాన్ఫిగర్ చేసిన A350లో 316 సీట్లు ఉన్నాయి. ఇందులో 28 ప్రైవేట్ బిజినెస్ సూట్లు, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, 264 విశాలమైన ఎకానమీ సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు లేటెస్ట్ జనరేషన్ పానాసోనిక్ eX3 ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, హెచ్డీ స్క్రీన్లతో అమర్చబడి ఉంటాయి. రోల్స్ రాయిస్ ట్రెంట్ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజన్ల ద్వారా ఆధారితమైన ఈ విమాన ఇంధన సామర్థ్యం, ఇతర విమానాలతో పోల్చితే 20 శాతం మెరుగ్గా ఉంటుంది. ఇంధన ఉద్గారాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది. -
బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం బ్రిటిష్ ఎయిర్వేస్ దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దాదాపు శతాబ్ద కాలంగా దేశానికి సరీ్వసులు నిర్వహిస్తున్న కంపెనీ తాజాగా ఢిల్లీ, ముంబైలకు మరిన్ని విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. విస్తరణకు అవకాశముండటంతోపాటు.. కోవిడ్–19 తదుపరి పలు ప్రాంతాల నుంచి డిమాండు ఊపందుకోవడం ఇందుకు కారణమైనట్లు తెలియజేసింది. కొత్తగా అధికారిక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో పనిచేస్తున్న 1,700 మందితోపాటు మరో 300 మందికి ఉపాధి కలి్పంచినట్లు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశీ అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు చైర్మన్, సీఈవో సీన్ డోయల్ పేర్కొన్నారు. పలు ప్రాంతాల నుంచి సరీ్వసుల వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో కరోనా మహమ్మారికి ముందుస్థాయిలో ప్రస్తుతం వారానికి 56 విమానాలను నడుపుతున్నట్లు తెలియజేశారు. మెట్రో నగరాలకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను కలుపుతూ సరీ్వసులను నిర్వహిస్తున్నట్లు డోయల్ తెలియజేశారు. ఇటీవలి వరకూ 49 విమానాలను నడిపినట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఎయిర్ సర్వీస్ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ, ముంబైలకు విమాన సరీ్వసులను పెంచనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా 2,000 మందికిపైగా ఉద్యోగులను కలిగి ఉన్నట్లు కంపెనీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కేలమ్ లామింగ్ తెలియజేశారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. -
అక్టోబర్ నుంచి హైదరాబాద్–వియత్నాం ఫ్లయిట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ నుంచి హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని మరో రెండు నగరాల నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ వియత్జెట్ డైరెక్టర్ జయ్ ఎల్ లింగేశ్వర తెలిపారు. ఒకో ప్రాంతం నుంచి వియత్నాంలోని హనోయ్, హో చి మిన్హ్ తదితర ప్రాంతాలకు వారానికి మూడు–నాలుగు సర్వీసులు ఉంటాయని గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై నుంచి వియత్నాంలోని ప్రధాన నగరాలకు వారానికి 20 వరకూ సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 60 శాతం మేర పెరిగిందని లింగేశ్వర చెప్పారు. ప్రయాణికులను ఆకర్షించడానికి రూ. 26 బేస్ రేటుకే టికెట్లు వంటి ఆఫర్లు రూపొందిస్తున్నామని వివరించారు. మరోవైపు సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యల ద్వారా అధిక ఇంధన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పరిశ్రమకు సానుకూలాంశమని పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా ఖాతాలో మరో 4 విమానాలు
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ కంపెనీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఖాతాలో కొత్తగా నాలుగు బోయింగ్ 737 రకం విమానాలు జతకూడనున్నాయి. కోవిడ్ సంక్షోభం తరువాత క్రమంగా ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో విమానయాన రంగంలో డిమాండ్ పుంజుకుంది. ఈనేపథ్యంలోనే ఎయిరిండియా తాజా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ప్రయాణ అడ్డంకులు తొలగిపోయిన తర్వాత విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా అధికం అయిందని ఎయిరిండియా తెలిపింది. ఇప్పటికే సంస్థ వద్ద బోయింగ్ 737 విమానాలు 24 ఉన్నాయి. దీనికి మరో నాలుగు విమానాలు తోడు కావడంతో మొత్తం 28 విమానాలకు చేరనుంది.ఆగస్టు 2020లో కోజికోడ్ విమాన ప్రమాదంలో ఒక విమానాన్ని కోల్పోయింది. అన్ని విమాన మార్గాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని వివరించింది. ప్రయాణికుల సంఖ్య పరంగా కాలానుగుణ వ్యత్యాసాలు సహజమని తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ప్రతిరోజు 100 సర్వీసుల ద్వారా భారత్‌లోని 13 విమానాశ్రయాలతోపాటు అంతర్జాతీయంగా 13 ఎయిర్‌పోర్టుల్లో ఎయిరిండియా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్–777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విమానం చేరుకున్నట్టు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు. వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్‌లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. రెండో విమానం మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. గత జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఎయిర్ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకతలివీ ► ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్)ను అమర్చారు. ► అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు. ► అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఇంధనం నింపడానికి కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది. కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ► విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది. ► ఈ విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది. ► ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు. ► ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. -
మార్చి 29 నుంచి 20 కొత్త విమానాలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా కొత్త విమానాలను త్వరలోనే ప్రవేశపెడుతున్నామని స్పైస్‌జెట్ బుధవారం ప్రకటించింది. మార్చి29, 2020నుండి 20కొత్త విమానాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. తద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచే పథకంలో భాగంగా 12 నగరాలను కలిపేలా మొత్తం 52 విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్పైస్ జెట్ వెల్లడించింది. కొత్త విమానాలలో వారణాసి-పాట్నా , అమృత్సర్-పాట్నా ఉడాన్ మార్గాల్లో నాన్-స్టాప్ సేవలు ఉంటాయి. గువహటి-పాట్నా, హైదరాబాద్-మంగళూరు, బెంగళూరు-జబల్పూర్, పాట్నా-వారణాసి, ముంబై- ఔరంగాబాద్ ఉన్నాయి. దీనికి అదనంగా ముంబై-బాగ్డోగ్రా, ముంబై-చెన్నై, హైదరాబాద్-మంగళూరు, గౌహతి-డిల్లీ మార్గాల్లో సేవలను క్రమేపీ పెంచనుంది. 20 కొత్త దేశీయ విమానాలను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తెలిపారు. తమ నెట్‌వర్క్‌ను కొత్త నగరాలుకు విస్తరించి, మరింత ఎక్కువ మందికి సరసమైన ధరల్లో విమాన ప్రయాణ సేవలను అందిస్తామన్నారు. అలాగే మెట్రోలు, నాన్-మెట్రోల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశంలోని అనుసంధానించబడని భాగాలను కూడా అనుసంధానించడంపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. -
విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: దీపావళి పండగ వేళ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి మరో కొత్త సర్వీస్‌ను స్పైస్ జెట్ ప్రారంభించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య స్పైస్ జెట్ సర్వీసు ను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ విశాఖ నుంచి గన్నవరానికి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు పాటు సర్వీసులు నడపనుంది. వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.50 గంటలకు బయలుదేరి 10.50కు వైజాగ్ చేరుకుంటుంది. నేటి నుంచి చెన్నై, సింగపూర్‌లకు కూడా నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల సమయంలో అనివార్య కారణాల వల్ల రద్దయిన విమాన సర్వీసుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. -
స్పైస్‌జెట్ కొత్తగా 14 విమానాలు, బుకింగ్స్ ఓపెన్
న్యూఢిల్లీ : బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ స్పైస్‌జెట్ కొత్తగా 14 దేశీయ విమానాలను ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ కొత్త విమానాలు తిరగనున్నాయని పేర్కొంది. డైరెక్ట్ కనెక్టివిటీని పెంచడానికి, నాన్-మెట్రోలు, చిన్న నగరాల్లో విమాన సర్వీసులను అందజేయడానికి ఈ కొత్త విమానాలను స్పైస్‌జెట్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త విమానాలతో సౌత్, వెస్ట్ ఇండియాలో తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకోనున్నట్టు పేర్కొంది. పుణే-పాట్నా, చెన్నై-రాజమండ్రి, హైదరాబాద్-కాలికట్, బెంగళూరు-తూత్కుడి సెక్టార్లలో ఈ కొత విమానాలను ప్రవేశపెడుతోంది. అదనంగా ఢిల్లీ-పాట్నా(రెండో ఫ్రీక్వెన్సీ), బెంగళూరు-రాజమండ్రి(రెండో ఫ్రీక్వెన్సీ), ముంబై-బెంగళూరు(ఐదో ఫ్రీక్వెన్సీ) సెక్టార్లలో కూడా ఆపరేషన్లను కొనసాగించనుంది. తమ కొత్త బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్, క్యూ400 రీజనల్ టర్బోప్రూప్స్తో తమ సర్వీసులను వేగవంతంగా విస్తరించనున్నామని స్పైస్‌జెట్ చీఫ్ సేల్స్, రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భటియా చెప్పారు. ఢిల్లీ-పాట్నా, ముంబై-బెంగళూరు, చెన్నై-రాజమండ్రి సెక్టార్లలో ప్రవేశపెట్టిన విమానాలు రోజువారీ నడవనున్నాయి. అదేవిధంగా హైదరాబాద్-కాలికట్, బెంగళూరు-తూత్కుడి, బెంగళూరు-రాజమండ్రి రూట్లలో నడిచే విమానాలు మంగళవారాలు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నడుస్తాయి. పాట్నా-పుణే మధ్యలో నడిచే విమానాలు శనివారం మినహాయించి, మిగిలిన అన్ని రోజుల్లో తన కార్యకలాపాలను సాగిస్తాయి. రాజమండ్రి, పాట్నా, తూత్కుడి, కాలికట్ వంటి చిన్న నగరాల ప్రజలు కూడా ఇక నుంచి చాలా తేలికగా ప్రయాణించనున్నారు. స్పైస్‌జెట్ అధికారిక వెబ్సైట్-స్పైస్‌జెట్.కామ్, యాప్‌లలో కూడా ఈ విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇటీవలే స్పైస్‌జెట్ తూత్కుడి నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించింది. -
కొత్త విమాన సర్వీసు
-
విశాఖ టు ఢిల్లీ, ముంబైకి కొత్త విమానాలు
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి జెట్ ఎయిర్వేస్ సంస్థ నూతన సర్వీసులను ప్రకటించింది. విశాఖ-ఢిల్లీ విమాన సర్వీసును ఆదివారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 9.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి రాత్రి 8.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇక, విశాఖ-ముంబై విమాన సర్వీసు ముంబై నుంచి ఉదయం 6.25గంటలకు బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి రాత్రి 9.25 గంటలకు ప్రయాణమై.. 11.25 గంటలకు ముంబై చేరుకుంటుంది. -
విశాఖ నుంచి ఇండిగో సర్వీసులు
ముంబై: విస్తరణ ప్రణాళికలో భాగంగా మరిన్ని నగరాలను కలుపుతూ ఆదివారం నుంచి 6 కొత్త విమాన సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. విశాఖ, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్, రాంచీ, కోల్‌కతాల నుంచి కొత్త సర్వీసులు నిర్వహిస్తామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరు - భువనేశ్వర్, విశాఖ విమాన సేవలు ఆదివారం నుంచి, మిగిలి నవి ఏప్రిల్ 6 నుంచి మొదలవుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 36 నగరాల మధ్య 485 సర్వీసులు నిర్వహిస్తుండడంతో ఈ రం గంలో మరింత బలపడతామని తెలిపింది.