రూ.1991కే విమాన ప్రయాణం.. మొదటి సర్వీస్‌ ప్రారంభించిన ఫ్లై91 | FLY91 Begins Commercial Operations From Goa | Sakshi
Sakshi News home page

రూ.1991కే విమాన ప్రయాణం.. మొదటి సర్వీస్‌ ప్రారంభించిన ఫ్లై91

Published Tue, Mar 19 2024 2:59 PM | Last Updated on Tue, Mar 19 2024 3:21 PM

FLY91 Begins Commercial Operations From Goa - Sakshi

ఫ్లై91 సంస్థ తన మొదటి విమాన సర్వీసులను ప్రారంభించింది. తాజాగా గోవాలోని మనోహర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉదయం గం.7.55కు విమాన సర్వీసులను మొదలు పెట్టింది. 

ఈ సందర్భంగా రూ.1991కే ప్రత్యేక ఛార్జీతో ప్రయాణించేలా వెసులుబాటు కల్పిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్లై91 విమాన సర్వీసులన్నింటికీ ఈ ఆఫర్‌ అమలవుతుందని  కంపెనీ పేర్కొంది. తొలుత గోవా, హైదరాబాద్‌, బెంగళూరు, సింధుదూర్గ్‌ మధ్య విమాన సర్వీసులను ప్రారంభించామని, ఏప్రిల్‌లో అగత్తి, జలగావ్‌, పుణెకు ప్రారంభించే యోచనలో ఉన్నామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. 

ఇదీ చదవండి: ‘మళ్లీ డ్రగ్స్‌ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి

గోవా- బెంగళూరు మధ్య సోమ, శుక్ర, శనివారాల్లో విమాన సర్వీసులు ఉంటాయి. బెంగళూరు- సింధుదుర్గ్‌ మధ్య కూడా ఇదే సంఖ్యలో విమాన సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. గోవా- హైదరాబాద్‌, సింధుదుర్గ్‌- హైదరాబాద్‌ మధ్య వారంలో రెండు సార్లు విమాన సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement