ఆమ్‌స్టార్‌డ్యామ్‌కు ప్రతిరోజూ నాన్‌స్టాప్‌ ఫ్లయిట్‌ | Jet Airways launching Bangalore to Amsterdam Direct flights | Sakshi
Sakshi News home page

డైరెక్ట్‌ ఫ్లయిట్‌: బెంగళూరు టు ఆమ్‌స్టర్‌డ్యామ్‌

Published Wed, Oct 4 2017 4:52 PM | Last Updated on Thu, Oct 5 2017 3:16 PM

Jet Airways launching Bangalore to Amsterdam Direct flights

సాక్షి, బెంగళూరు : ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వెళ్లే విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఈ సుదూర ప్రయాణంలో కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు డైరెక్ట్‌ ఫ్లయిట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. బెంగుళూరు నుంచి నెదర్లాండ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కు ప్రతిరోజూ నాన్‌స్టాప్‌ ఫ్లయిట్‌ ప్రారంభం కానుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఈ మేరకు విమాన సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది.

ఈనెల 29 నుంచి ఈ సర్వీసులు అందుబాటులో రానున్నాయి. బెంగళూరులో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వినయ్‌ దూబే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రయాణ సమయం దాదాపు తొమ్మిది గంటలు పడుతుంది. ప్రతి రోజూ బెంగళూరు నుంచి రాత్రి 02:25 (ఎల్‌.టీ) గంటలకు విమానం (జెట్‌ ఎయిర్‌ వేస్‌ 9 డబ్ల్యూ 236) ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కు బయలు దేరుతుంది. అదే విధంగా ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి బెంగళూరుకు ఉదయం 10:50 గంటలకు (ఎల్‌.టీ)కు విమానం (జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 235) బయలు దేరుతుంది. ప్రారంభ ఆఫర్‌గా ఎకానమీ క్లాస్‌ టికెట్‌  ధర రూ.39,999గాను, బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,21,000గా నిర్ణయించారు.




 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement