ఎయిర్‌ ఏషియా డైరెక్ట్‌ ఫ్లైట్స్‌: ధర రూ.2299 | AirAsia announces direct flights on four new routes, offers tickets at starting price of Rs 2,299 | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఏషియా డైరెక్ట్‌ ఫ్లైట్స్‌: ధర రూ.2299

Published Tue, Sep 19 2017 8:18 PM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

ఎయిర్‌ ఏషియా డైరెక్ట్‌ ఫ్లైట్స్‌: ధర రూ.2299

ఎయిర్‌ ఏషియా డైరెక్ట్‌ ఫ్లైట్స్‌: ధర రూ.2299

సాక్షి, న్యూఢిల్లీ:  ఎయిర్‌ ఏషియా నాలుగు కొత్త విమాన సర్వీసులను  ప్రకటించింది. దేశీయంగా నాలుగు కొత్త మార్గాల్లో ఎయిర్ ఏషియా డైరెక్ట్‌ విమానాలను ప్రారంభించనుంది.   త్వరలో డెయిలీ డైరెక్ట్‌ ఫ్లైట్‌ ను లాంచ్‌ చేయనున్నామని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. టికెట్ల ధరలు  రూ .2,299 (వన్‌వే)  నుంచి ప్రారంభమని తెలిపింది.

కొత్త మార్గాల్లో రోజువారీ విమానాలను ప్రారంభించనున్నట్లు ఎయిర్ఏషియా  మంగళవారం ప్రకటించింది. రాంచి -బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్‌లకు   రోజువారీ విమానాలు నడిపే  పథకాన్ని వెల్లడించింది. ఈ ప్రణాళికలో మొదటి విమానం అక్టోబర్ 7, 2017 మొదలు కానున్నట్టు తెలిపింది.   సీట్లు పరిమితమని అన్ని విమానాల్లో అందుబాటులో ఉండకపోవచ్చునని ఎయిర్ ఏషియా తెలిపింది.

వెబ్‌సైట్‌అందించిన అప్‌డేట్‌ ప్రకారం విమాన టికెట్‌ ధరలు భువనేశ్వర్‌- రాంచి రూ. 2299 ,రాంచి- బెంగళూరు రూ.3299, రాంచి- హైదరాబాద్‌ రూ.2799గా ఉన్నాయి.  ముందుగానే వారి టిక్కెట్లు బుక్ చేసుకోవాలని,  www.airasia.com ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌లకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement