కొలంబో: వారణాసి నుంచి కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం కొలంబోలో జరుగుతున్న 14వ అంతర్జాతీయ వేకాస్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఈ ఏడాది ఆగస్ట్ నుంచి వారణాసి నుంచి కొలంబోకు నేరుగా విమాన సేవలు మొదలు అవుతాయని తెలిపారు. కొలంబోలో ఉన్న తమిళులు...వారణాసితో పాటు గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడు తొలి ప్రవచనం చేసిన పుణ్యస్థలం సార్‌నాథ్‌ను సందర్శించుకోవాలని అన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బుద్ధుడి నడయాడిన గడ్డపై పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని మోదీ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రముఖుల నుంచి వచ్చినవే అని ఆయన అన్నారు. బుద్ధుని బోధనలను శ్రీలంక ముందుకు తీసుకు వెళుతోందని అన్నారు. భారత్-శ్రీలంకల మధ్య హద్దులు లేని స్నేహం ఉందని ఇరు దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులు, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరిస్తామని మోదీ వెల్లడించారు.
వారణాసి నుంచి కొలంబోకు నేరుగా ఫ్లయిట్
Published Fri, May 12 2017 12:10 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM
Advertisement