కొలంబో: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక రాజధాని కొలంబోలో పర్యటించారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ అక్కడి నుంచి బయల్దేరి కొలంబోకు చేరుకున్నారు. శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల బాంబు పేలుళ్ల సంభవించిన కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిను సందర్శించారు. ఈ సందర్భంగా ఘటనలో మృతి చెందిన లంక పౌరులకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సతో సమావేశం కానున్నారు. కాగీ లంక పర్యటన అనంతరం మోదీ అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.
Started the Sri Lanka visit by paying my respect at one of the sites of the horrific Easter Sunday Attack, St. Anthony's Shrine, Kochchikade.
— Narendra Modi (@narendramodi) 9 June 2019
My heart goes out to the families of the victims and the injured. pic.twitter.com/RTdmNGcDyg
Comments
Please login to add a commentAdd a comment