షార్ప్ షూటర్ సునీల్ అరెస్ట్ | sharp shooter Sunil arrested in UP | Sakshi
Sakshi News home page

షార్ప్ షూటర్ సునీల్ అరెస్ట్

Published Thu, Oct 16 2014 9:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

షార్ప్ షూటర్ సునీల్ అరెస్ట్

షార్ప్ షూటర్ సునీల్ అరెస్ట్

లక్నో: మాఫియా డాన్ బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ తో సంబంధమున్న షార్ప్ షూటర్ అరుణ్ కుమార్ సింగ్ అలియాస్ సునీల్ అలియాస్ ముఖేష్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోరఖ్పూర్ నివాసియైన అతడిని లక్నో పోలీసుల సాయంతో గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్ లో అతడిపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో అతడిని అరెస్ట్ చేశారు.

సూరత్ లో ఒకరిని హత్య చేసేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్టు అతడు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. తనకు బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ తో సంబంధాలున్నాయని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం అరుణ్ కుమార్ ను సూరత్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement