sharp shooter
-
వేటగాళ్ల రుణం తీర్చుకోలేం!
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని యవత్మాల్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న మ్యానీటర్ (ఆడపులి) ‘అవని’ని వేట జాతీయ స్థాయిలో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిని మట్టుపెట్టిన హైదరాబాదీ షార్ప్‌షూటర్ నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్, అతడి తండ్రి నవాబ్ షఫత్ అలీ ఖాన్‌లను కేంద్ర మంత్రి మేనకగాంధీ సహా అనేక మంది విమర్శించారు. అయితే యవత్మాల్కు చెందిన రైతులు, సామాన్యులు మాత్రం మీ రుణం తీర్చుకోలేమంటూ ఈ తండ్రీకొడుకులను ఘనంగా సన్మానించారు. మంగళవారం రాత్రి సావర్‌ఖేడా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరితో పాటు సహకరించిన వారందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఆదిలాబాద్‌కు 60 కిమీ దూరంలో మహారాష్ట్రలోని తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయస్సున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్మాల్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో ఇతర జంతువుల కంటే మనుషులను వేటాడటం తేలికని గుర్తించిన పులి మ్యానీటర్‌గా మారి పంజా విసురుతూనే ఉంది. ఈ ఆడపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ మూడూ కలిసి యవత్మాల్ చుట్టూ ఉన్న 12 కిమీ పరిధిలో సంచరిస్తూ... తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలిసి మృతదేహాలను పీక్కు తింటున్నాయి. ఇలా ఇప్పటి వరకు వీటి చేతిలో 14 మంది చనిపోయారు. అక్కడి అటవీ శాఖ కోరిక మేరకు అస్ఘర్, షఫత్ సెప్టెంబర్ రెండో వారంలో అక్కడికి వెళ్లి వేట మొదలెట్టారు. బంధించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ నెల 3న అవనిని మట్టు పెట్టారు. దీనిపై మేనకగాంధీతో పాటు అనేక మంది జంతు ప్రేమికులు విమర్శలు గుప్పించారు. బాహ్యప్రపంచం ఈ వేటను వివాదాస్పదం చేసినా... యవత్మాల్ చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు మాత్రం వీరి రుణం తీర్చుకోలేమని చెబుతున్నారు. కొన్ని నెలలుగా తమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మ్యానీటర్‌ను చంపిన అస్ఘర్, షఫత్లతో పాటు సహాయకుల్నీ మంగళవారం సావర్‌ఖేడాకు ఆహ్వానించారు. 12 గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు వీరిని ఘనంగా సన్మానించారు. మ్యానీటర్ వల్ల వారు పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఓ పులి మహిళపై దాడి చేసి తల వేరు చేసినట్లు ఉన్న జ్ఞాపికను వీరికి అందజేశారు. అదే ప్రాంతంలో సంచరిస్తున్న అవని కూనలను బంధించాల్సిందిగా వీరిని కోరారు. -
సల్మాన్ ఖాన్ హత్యకు భారీ స్కెచ్
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటు రాజస్ధానీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణొయి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లారెన్స్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం అతని తెగ వారు దైవంగా పూజించే కృష్ణ జింకను సల్మాన్ వేటాడటం. ఈ నేపధ్యంలో రేస్ 3 షూటింగ్ స్పాట్ దగ్గర కొంతమంది అనుమానాస్పదంగా కనిపించటంతో ముంబాయి పోలీసులు సల్లు భాయ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న హరియాణాకు చెందిన షార్ప్ షూటర్ సంపత్ నెహ్రాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంపత్ ముంబై వెళ్లి, సల్మాన్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న హరియాణా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సంపత్ గ్యాంగ్‌లోని మరో ముగ్గురు షార్ప్ షూటర్స్ రాజు, అక్షయ్, అంకిత్‌ల ఆచూకిని మాత్రం గుర్తించలేకపోయమన్నారు పోలీసులు. వీరంతా ముంబై నగరంలో సల్మాన్ ఖాన్‌ను చంపడం కోసం తిరుగుతున్నట్లు, వీరికి సంబంధించి ఎటువంటి ఆధారాలు హర్యానా పోలీసుల వద్ద లేనట్లు సమాచారం. వీరి వల్ల సల్మాన్‌కు ప్రమాదం ఉన్నట్లు పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వీరు ముగ్గురు సంపత్‌ను పోలీసుల నుంచి విడిపించడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ‘సోమవారం కోర్టుకు హజరవుతున్న సంపత్‌ను పోలీసుల కన్నుగప్పి విడిపించాడానికి ప్రయత్నం చేసారు. కానీ మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సంపత్‌ను కోర్టుకు హజరుపర్చామ’ని పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాక ఈ విషయం గురించి ముంబై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని, వారు వచ్చే వారం ముంబై నుంచి హరియాణాకు వచ్చి సంపత్‌ను విచారిస్తారని తెలిపారు. -
చోటారాజన్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్
లక్నో: మాఫియా డాన్ చోటరాజన్ గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చోటరాజన్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్ ఖాన్ ముబారక్‌ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, బుల్లెట్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్‌లో ఖాన్ ముబారక్ పట్టుబడ్డాడు. చోటా రాజన్ ముఠా సభ్యులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతని నుంచి కూపీ లాగుతున్నారు. -
షార్ప్ షూటర్ అరెస్ట్
అహ్మదాబాద్: షార్ప్ షూటర్ కార్తిక్ హల్దార్ ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. వివాదస్పద స్వామిజీ ఆశారాం బాపు కేసులో ముగ్గురు సాక్ష్యులను అతడు హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తిక్ హల్దార్ ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆశారాం బాపును 2013లో జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రేప్ కేసులో ఆయన కుమారుడు నారాయణసాయిని కూడా అరెస్టయ్యారు. 2001- 2005 మధ్య కాలంలో నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్‌లోని సూరత్ నగరంలో 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
షార్ప్ షూటర్ సునీల్ అరెస్ట్
లక్నో: మాఫియా డాన్ బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ తో సంబంధమున్న షార్ప్ షూటర్ అరుణ్ కుమార్ సింగ్ అలియాస్ సునీల్ అలియాస్ ముఖేష్ ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోరఖ్‌పూర్ నివాసియైన అతడిని లక్నో పోలీసుల సాయంతో గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్ లో అతడిపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో అతడిని అరెస్ట్ చేశారు. సూరత్ లో ఒకరిని హత్య చేసేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్టు అతడు ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. తనకు బబ్లూ శ్రీవాస్తవ గ్యాంగ్ తో సంబంధాలున్నాయని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం అరుణ్ కుమార్ ను సూరత్ కు తరలించారు.