సల్మాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటు రాజస్ధానీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణొయి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లారెన్స్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం అతని తెగ వారు దైవంగా పూజించే కృష్ణ జింకను సల్మాన్ వేటాడటం. ఈ నేపధ్యంలో రేస్ 3 షూటింగ్ స్పాట్ దగ్గర కొంతమంది అనుమానాస్పదంగా కనిపించటంతో ముంబాయి పోలీసులు సల్లు భాయ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న హరియాణాకు చెందిన షార్ప్ షూటర్ సంపత్ నెహ్రాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సంపత్ ముంబై వెళ్లి, సల్మాన్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న హరియాణా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సంపత్ గ్యాంగ్‌లోని మరో ముగ్గురు షార్ప్ షూటర్స్ రాజు, అక్షయ్, అంకిత్‌ల ఆచూకిని మాత్రం గుర్తించలేకపోయమన్నారు పోలీసులు. వీరంతా ముంబై నగరంలో సల్మాన్ ఖాన్‌ను చంపడం కోసం తిరుగుతున్నట్లు, వీరికి సంబంధించి ఎటువంటి ఆధారాలు హర్యానా పోలీసుల వద్ద లేనట్లు సమాచారం. వీరి వల్ల సల్మాన్‌కు ప్రమాదం ఉన్నట్లు పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాక వీరు ముగ్గురు సంపత్‌ను పోలీసుల నుంచి విడిపించడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ‘సోమవారం కోర్టుకు హజరవుతున్న సంపత్‌ను పోలీసుల కన్నుగప్పి విడిపించాడానికి ప్రయత్నం చేసారు. కానీ మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సంపత్‌ను కోర్టుకు హజరుపర్చామ’ని పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాక ఈ విషయం గురించి ముంబై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని, వారు వచ్చే వారం ముంబై నుంచి హరియాణాకు వచ్చి సంపత్‌ను విచారిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment