black buck hunting case
-
సల్మాన్ ఖాన్ హత్యకు భారీ స్కెచ్
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటు రాజస్ధానీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణొయి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లారెన్స్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం అతని తెగ వారు దైవంగా పూజించే కృష్ణ జింకను సల్మాన్ వేటాడటం. ఈ నేపధ్యంలో రేస్ 3 షూటింగ్ స్పాట్ దగ్గర కొంతమంది అనుమానాస్పదంగా కనిపించటంతో ముంబాయి పోలీసులు సల్లు భాయ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ను చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న హరియాణాకు చెందిన షార్ప్ షూటర్ సంపత్ నెహ్రాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంపత్ ముంబై వెళ్లి, సల్మాన్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న హరియాణా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సంపత్ గ్యాంగ్‌లోని మరో ముగ్గురు షార్ప్ షూటర్స్ రాజు, అక్షయ్, అంకిత్‌ల ఆచూకిని మాత్రం గుర్తించలేకపోయమన్నారు పోలీసులు. వీరంతా ముంబై నగరంలో సల్మాన్ ఖాన్‌ను చంపడం కోసం తిరుగుతున్నట్లు, వీరికి సంబంధించి ఎటువంటి ఆధారాలు హర్యానా పోలీసుల వద్ద లేనట్లు సమాచారం. వీరి వల్ల సల్మాన్‌కు ప్రమాదం ఉన్నట్లు పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వీరు ముగ్గురు సంపత్‌ను పోలీసుల నుంచి విడిపించడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ‘సోమవారం కోర్టుకు హజరవుతున్న సంపత్‌ను పోలీసుల కన్నుగప్పి విడిపించాడానికి ప్రయత్నం చేసారు. కానీ మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సంపత్‌ను కోర్టుకు హజరుపర్చామ’ని పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాక ఈ విషయం గురించి ముంబై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని, వారు వచ్చే వారం ముంబై నుంచి హరియాణాకు వచ్చి సంపత్‌ను విచారిస్తారని తెలిపారు. -
చంపేస్తామని బెదిరించారు: కునికా
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి, బెయిల్ పొందిన సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా ఓ చర్చా వేదికలో మాట్లాడిన తనను హతమారుస్తామని కొందరు బిష్ణోయ్ వర్గీయులు బెదిరించారని బాలీవుడ్ సూపర్‌స్టార్ సహ నటి కునికా సదానంద్ చెప్పారు. తనను బెదిరించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని సల్మాన్‌తో హమ్ సాథ్ సాథ్ హై మూవీలో నటించిన కునికా తెలిపారు. సల్మాన్‌కు మద్దతుగా నిలిచినందుకు బిష్ణోయ్ వర్గీయులు కొందరు తనను హతమారుస్తామని ఫోన్లో బెదిరించారని, అసభ్య మెసేజ్‌లు పంపారని కునికా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భద్రత కల్పించినట్టు సమాచారం. టీవీ చర్చల సందర్భంగా తాను సల్మాన్‌ను శిక్షించే బదులు బిష్ణోయ్ కమ్యూనిటీ అతడిని ఉపయోగించుకోవాలని, బెయిల్‌ను వ్యతిరేకించరాదని తాను సూచించానన్నారు. కృష్ణజింకలకు ఆహారం సమకూర్చడం, వనాలను దత్తత తీసుకోవడం వంటి కార్యకలాపాలను సల్మాన్ చేపట్టేలా చూడాలని చెప్పానన్నారు. మరో చర్చలో బిష్ణోయ్‌లు సైతం జింకలను వేటాడతారని చెప్పానన్నారు. అయితే టీవీ చర్చలో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని సంతోష్ బిష్ణోయ్ అనే వ్యక్తి తనకు కాల్ చేసి బెదిరించాడని తెలిపారు. బెదిరింపు ఫోన్‌కాల్స్ ఆగలేదని, ఫేస్‌బుక్‌లోనూ తనను వెంటాడారని, తనపై కేసు పెడతామని బెదిరించారని చెప్పుకొచ్చారు. అయితే తన ప్రకటనకు క్షమాపణలు కోరుతూ తాను ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశానని తెలిపారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సల్మాన్‌కు ఇటీవల బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. -
'విదేశాలకు వెళ్లాలనుకుంటే హైకోర్టును అడగండి'
న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయితే సల్మాన్ ఖాన్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. రాజస్తాన్ హైకోర్టు స్టే ఆర్డర్‌ను సవాల్ చేస్తూ రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును తిరిగి పరిశీలించాలని రాజస్తాన్ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. శిక్ష నిలుపుదల చేస్తే సల్మాన్‌కు ఎటువంటి నష్టం కలగదనే విషయాన్ని హైకోర్టులోనే చెప్పుకోవాలని అత్యున్నత న్యాయస్థానం రాజస్తాన్ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణజింకలను వేటాడినట్టు 1998లో సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసలు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ ..రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పుపై విధించింది. ఇప్పుడు అటుతిరిగి ఇటు తిరిగి మళ్లీ ఈ కేసు రాజస్తాన్ హైకోర్టు ముందుకు వచ్చింది. గతేడాది నవంబర్ ఐదున సుప్రీంకోర్టులో ఈ కేసు వాదనలు ముగిశాయి. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ, జస్టిస్ ఏకే గోయెల్ ఈ కేసులో వాదనలు విన్నారు. -
సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
-
సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థాపం పక్కన పెట్టింది. సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లవచ్చని రాజస్తాన్ హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పునర్ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాజస్తాన్ హైకోర్టును ఆదేశించింది. కాగా ఈ కేసులో సల్మాన్‌కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం నవంబర్ 12న ఆ శిక్షపై స్టే విధించింది. -
సల్మాన్ కేసులో వెలువనున్న సుప్రీం తీర్పు!
-
సల్మాన్ కేసులో వెలువనున్న సుప్రీం తీర్పు!
న్యూఢిల్లీ: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై సుప్రీంకోర్టు బుధవారం వెలువరించే అవకాశముంది. ఈ కేసులో సల్మాన్‌కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం నవంబర్ 12న ఆ శిక్షపై స్టే విధించింది. -
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు సుప్రీం కోర్టు నోటీస్
న్యూఢిల్లీ: కష్ణజింక వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. సల్మాన్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు నిలుపుదల చేయడాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ విచారణ జరిపారు. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సల్మాన్‌కు నోటీసు ఇచ్చారు. 1998లో రాజస్థాన్‌లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా ఓ కష్ణజింకను, రెండు చింకారా జింకలను వేటాడినట్టు సల్మాన్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నటులు సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలం కూడా నిందితులుగా ఉన్నారు. 2006లో ట్రయల్ కోర్టు సల్మాన్‌ఖాన్‌ను దోషిగా నిర్ధారించింది. ఓ కేసులో ఏడాది, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై 2007లో సల్మాన్‌ఖాన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. విదేశాలకు వెళ్లేందుకు అనువుగా ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని కోరారు. దీంతో గత ఏడాది నవంబర్‌లో రాజస్థాన్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. దానిపై రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈరోజు సల్మాన్‌కు నోటీస్ జారీ చేసింది.